జన నాయగన్ బయటకొస్తుందా..?

దళపతి విజయ్ పొలిటికల్ కెరీర్ మొదట్లోనే పెద్ద షాక్ తగిలింది. టీ.వీ.కె పార్టీ సరూర్ మీటింగ్ లో జరిగిన తొక్కిసలాటలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు.;

Update: 2025-10-01 06:24 GMT

దళపతి విజయ్ పొలిటికల్ కెరీర్ మొదట్లోనే పెద్ద షాక్ తగిలింది. టీ.వీ.కె పార్టీ సరూర్ మీటింగ్ లో జరిగిన తొక్కిసలాటలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. సంఘటన జరిగిన 3 రోజుల తర్వాత దళపతి విజయ్ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఐతే అందులో స్టాలిన్ ప్రభుత్వం గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇన్సిడెంట్ జరిగిన దాని కన్నా విజయ్ వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఇంకాస్త ఎక్కువ డ్యామేజ్ అయ్యింది.

విజయ్ చివరి సినిమా జన నాయగన్..

విజయ్ డైరెక్ట్ గా స్టాలిన్ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తూ మాట్లాడాడు. ఐతే దళపతి విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్ అవ్వాల్సి ఉంది. జనవరి 9న సినిమా రిలీజ్ ఉంది. కచ్చితంగా ఈ ఘటన తాలూకా ఇంపాక్ట్ సినిమా మీద ఉంటుంది. అంతేకాదు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాడు కాబట్టి విజయ్ సినిమా మీద ప్రభుత్వం తమ రాజకీయాన్ని చూపించే ఛాన్స్ ఉంటుంది.

అంతకుముందు కూడా విజయ్ సినిమాల రిలీజ్ టైం లో తమిళనాడు ప్రభుత్వం ఇబ్బందులు పెట్టేది. జయలలిత టైం నుంచి అది కొనసాగుతుంది. ఐతే స్టాలిన్ ప్రభుత్వం ఏర్పడ్డాక డైరెక్ట్ గా ఎప్పుడు విజయ్ సినిమాలను ఆపలేదు. ఐతే విజయ్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి స్టాలిన్ ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వస్తుంది. తప్పకుండా విజయ్ జన నాయగన్ మీద రివర్స్ ఎటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది.

ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ..

అంతేకాదు ఆ సినిమాలో విజయ్ రాజకీయాల గురించి, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కొన్ని డైలాగ్స్ కూడా ఉన్నాయని టాక్. అసలే విజయ్ మీటింగ్ తో జరిగిన తొక్కిసలాట వల్ల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాడు. మళ్లీ సినిమాలో డైలాగ్స్ తో అధికార పార్టీని టార్గెట్ చేస్తే మరింత రిస్క్ లో పడే అవకాశం ఉంటుంది.

దళపతి విజయ్ జన నాయగన్ సినిమాను హెచ్. వినోద్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్దే, మమితా బైజు నటిస్తున్నారు. బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ గా జన నాయగన్ వస్తుందని తెలుస్తుంది. ఐతే మూల కథ తీసుకుని స్క్రీన్ ప్లే మొత్తం మార్చేస్తున్నారని టాక్.

సినీ హీరోలు రాజకీయాల్లో రాణించడం కామనే.. తమిళనాడులో విజయ్ కి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఐతే ఆయన పార్టీ మీటింగ్ లో జరిగిన తొక్కిసలాట వల్ల 40 మంది ప్రాణాలు బలయ్యాయి. ఐతే ఈ ఘటన పట్ల విజయ్ రెస్పాండ్ అయిన విధానం కూడా కొంతమందికి నచ్చలేదు. విజయ్ వీడియో బైట్ లో ఎలాంటి బాధ కనిపించట్లేదని అంటున్నారు. ఐతే ఫ్యాన్స్ మాత్రం తమ హీరోని అలా చూసి షాక్ అవుతున్నారు.

Tags:    

Similar News