భార్యతో విడాకులు, త్రిషతో రిలేషన్.. విజయ్ క్లారిటీ ఇచ్చినట్లేనా?

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్.. ఇటీవల తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ స్టార్ట్ చేసి రాజకీయాల్లో యాక్టివ్ గా మారిన వేళ ఆయనపై విమర్శలు, చుట్టూ వివాదాలు పెరిగాయని చెప్పాలి.;

Update: 2026-04-09 06:45 GMT

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్.. ఇటీవల తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ స్టార్ట్ చేసి రాజకీయాల్లో యాక్టివ్ గా మారిన వేళ ఆయనపై విమర్శలు, చుట్టూ వివాదాలు పెరిగాయని చెప్పాలి. ముఖ్యంగా ఆయన కుటుంబ జీవితం, భార్య సంగీతతో విడాకుల రూమర్లు, సీనియర్ బ్యూటీ త్రిష కృష్ణన్ తో సంబంధం ఉందన్న ప్రచారం సినీ, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.

ఇప్పటి వరకు ఆ విషయంపై బహిరంగంగా స్పందించని విజయ్, తాజాగా రెస్పాండ్ అయ్యారు. మరికొద్ది రోజుల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. తిరునెల్వేలిలో నిర్వహించిన భారీ మీటింగ్ లో విజయ్ మాట్లాడారు. ఆ సమయంలో తన వ్యక్తిగత జీవితం, పొలిటికల్ జర్నీపై వస్తున్న ఆరోపణలన్నీ ఎన్నికల ముందు కావాలని క్రియేట్ చేసినవని స్పష్టం చేశారు.

ముఖ్యంగా ఇవన్నీ తనను బలహీనపరచడానికి ప్రత్యర్థులు చేస్తున్న కుట్రలేనని ఆరోపించారు. ఎన్నికలకు ముందు తనను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత జీవితాన్ని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని విమర్శించారు. ముఖ్యంగా విజయ్ మీద ఏదో ఒక వివాదం సృష్టించడం వాళ్లకు అలవాటైపోయిందని ఎద్దేవా చేశారు. గతంలో కరూర్ తొక్కిసలాట ఘటన విషయంలో అదే జరిగిందని తెలిపారు.

అంతే కాదు.. తన మూవీ జన నాయగన్ విషయంలో కూడా అదే చేశారని ఆరోపించారు. ముఖ్యంగా ఆ సినిమా విడుదలను అడ్డుకోవడానికి కూడా ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలు చేశారు. అది సరిగ్గా కుదరకపోవడం వల్ల వ్యక్తిగత జీవితంపై దృష్టి మళ్లించారని తెలిపారు. తన సినిమాను ఆపలేకపోయినప్పుడు, తన కుటుంబ విషయాలను లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు.

ఎన్నికలకు కేవలం 30 రోజులు మాత్రమే ఉండగా ఇలాంటి రూమర్లు స్ప్రెడ్ చేయడం వెనుక రాజకీయ ఉద్దేశ్యాలు ఉన్నాయని క్లియర్ గా తెలుస్తుందని అన్నారు. తనకు దగ్గరగా ఉన్న వారిని కూడా వివాదాల్లోకి లాగుతున్నారని తెలిపారు. మీరు అర్థం చేసుకుంటున్నారు కదా తాను ఏమి చెబుతున్నానో అంటూ క్లారిటీ ఇచ్చే కూడా ప్రయత్నం చేశారు.

అలా ఎవరి పేరును ప్రస్తావించకుండా స్పందించిన విజయ్.. తనను ప్రజల నుంచి వేరు చేయాలని ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవని ధీమా వ్యక్తం చేశారు. ఎంత ప్రయత్నించినా తనను ప్రజల నుంచి దూరం చేయలేరని తెలిపారు. ప్రజలే తన బలమని చెప్పారు. ఏదేమైనా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తనపై వస్తున్న విమర్శలు, వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఆరోపణలపై విజయ్ ఎట్టకేలకు స్పందించడంతో.. ఆయన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

భార్యతో విడాకులు, త్రిషతో రిలేషన్ వంటి విషయాలపై విజయ్ క్లారిటీ ఇచ్చినట్లేనా అంటూ అంతా ఇప్పుడు సోషల్ మీడియాలో డిస్కస్ చేసుకుంటున్నారు.

Tags:    

Similar News