చివరికి చావును కోరుకుంటున్న పవిత్ర గౌడ!

రేణుకా స్వామి హత్య కేసులో ఏ వన్ నిందితురాలిగా ఉన్న పవిత్ర గౌడ జైలు జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే.

Update: 2026-09-23 08:00 GMT

పవిత్ర గౌడ.. గత ఏడాది కాలంగా కన్నడ నాట ఎక్కువగా సంచలనం సృష్టించిన పేరు ఇది. ఒకప్పుడు సినిమాలు, సీరియల్స్ అంటూ సంతోషంగా జీవితాన్ని గడిపిన ఈమె అనూహ్యంగా కన్నడ హీరో దర్శన్ తో రిలేషన్ పెట్టుకోవడం, పైగా ఆ బంధానికి పదేళ్లు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ముఖ్యంగా రేణుకా స్వామి అనే అభిమాని పవిత్ర గౌడను అసభ్యకరమైన మెసేజ్లతో సోషల్ మీడియాలో దాడి చేశారు. దీంతో కోపోద్రిక్తురాలు అయిన పవిత్ర గౌడ.. దర్శన్ తో పాటు మరికొంతమందితో కలిసి రేణుకా స్వామిని గత ఏడాది జూలైలో అత్యంత దారుణంగా హతమార్చిన విషయం సంచలనం సృష్టించింది.

జైలులో ఉండలేకపోతున్నాను-పవిత్ర గౌడ

రేణుకా స్వామి హత్య కేసులో ఏ వన్ నిందితురాలిగా ఉన్న పవిత్ర గౌడ జైలు జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ జైలులో తాను ఉండలేనని , బెయిల్ అయినా ఇవ్వండి లేదా విషమిచ్చి చంపేయండి అంటూ ఆమె తన విన్నపాన్ని కోర్టు ముందు ఉంచింది. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

బెయిల్ అయినా ఇవ్వండి లేదా కాస్త విషమిచ్చి చంపేయండి..

రేణుకా స్వామి హత్య కేసులో జైల్లో ఉన్న ఈమె తనకు బెయిల్ ఇవ్వాలి అంటూ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను 59వ సిసిహెచ్ కోర్టు విచారించింది. విచారణ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరైన ఈమె.. జైలులో తనకు రక్షణ లేదని, ప్రాణభయం వెంటాడుతోందని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా జైలులో ఉన్న నైజీరియన్ ఖైదీల నుంచి తీవ్ర ఇబ్బందులు, వేధింపులు ఎదుర్కొంటున్నానని , తనకు బెయిల్ అయినా మంజూరు చేయాలని లేదా కాస్త విషం ఇచ్చి చంపేయాలంటూ వ్యాఖ్యానించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం అటు సినీ, ఇటు న్యాయవర్గాలలో తీవ్ర కలకలం రేపుతోంది..

తదుపరి విచారణను వాయిదా వేసిన కోర్టు..

జైలులో ఉండడం తన వల్ల కాదు అని, ఆఖరికి చావైనా ఇవ్వండి అంటూ ఆమె చేసిన అభ్యర్థన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదే విషయంపై పవిత్ర గౌడ తరఫు న్యాయవాదులు, న్యాయమూర్తి ముందు తమ వాదనలు వినిపిస్తూ.." జైలు గోడల మధ్య పవిత్ర గౌడను అంతమొందించేందుకు సైతం కుట్రలు జరుగుతున్నాయని, ఆమె రక్షణ పై తీవ్ర ఆందోళన ఉందంటూ" న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారట. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ప్రతినిధులు ఈ విషయాన్ని స్పందిస్తూ.. కోర్టు పూర్వ ఉత్తర్వుల మేరకు ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగానే ఆమెను ఇప్పటికే మరో బ్యారక్ కి మార్చాము. మళ్లీ ఇప్పుడు మార్చడం అంటే కుదరదు అంటూ తమ వాదనలు వినిపించారట అయితే ఇరుపక్షాల వాదనలను ఆలకించిన కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసినట్లు సమాచారం.

ఏది ఏమైనా రేణుకా స్వామి హత్య కేసులో జైలు జీవితం గడుపుతున్న పవిత్ర గౌడ ఇప్పుడు ఉన్నట్టుండి కాస్త విషమిచ్చి చంపేయండి అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. మరి తదుపరి విచారణలో కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో చూడాలి.

Tags:    

Similar News