సైజ్ తగ్గింది.. స్టైల్ పెరిగింది.. నివేదా సెల్ఫీ నెట్‌లో ట్రెండ్
టాలీవుడ్ బ్యూటీ నివేదా పేతురాజ్ గురించి పరిచయం అక్కర్లేదు, తన సహజమైన అందం, నటనతో తెలుగు మరియు తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న చిన్నది తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ బ్యూటీ నివేదా పేతురాజ్ గురించి పరిచయం అక్కర్లేదు, తన సహజమైన అందం, నటనతో తెలుగు మరియు తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న చిన్నది తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. బ్లూ జీన్స్ ధరించి తీసిన మిర్రర్ సెల్ఫీతో పాటు తన ఫిట్‌నెస్ జర్నీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ను ఫ్యాన్స్‌తో పంచుకుంది. జీన్స్ సైజ్ తగ్గించి మరింత స్లిమ్‌గా మారిన నివేదా ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతూ నెటిజన్లను, ఫిట్‌నెస్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.
సైజ్ 30 నుంచి 28కి.. ఫిట్‌నెస్ మైలురాయి:
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న పిక్స్‌లో నివేదా తన 'లేవీస్ 726 హై రైజ్ ఫ్లేర్' జీన్స్ లేబుల్‌ను హైలైట్ చేస్తూ "30 ➔ 28" అని క్యాప్షన్ ఇచ్చింది. వర్కౌట్స్, క్రమశిక్షణతో రెండు జీన్స్ సైజులు తగ్గించుకుని సరికొత్త ఫిట్‌నెస్ గోల్ సాధించినట్లు తెలిపింది. ఇక బ్లూ జీన్స్, క్యాజువల్ లుక్‌లో అద్దం ముందు నిలబడి దిగిన మిర్రర్ సెల్ఫీ ఆమె స్లిమ్ అండ్ ట్రిమ్ ట్రాన్స్‌ఫార్మేషన్‌ను స్పష్టంగా చూపుతోంది.
ఫ్యాన్స్ కామెంట్లు అండ్ సోషల్ మీడియా హల్‌చల్ :
సహజసిద్ధమైన అందంతో మేకప్ లేకపోయినా మెరిసిపోయే నివేదా, ఈ ఫిట్‌నెస్ లుక్‌లో మరింత గ్లామరస్‌గా కనిపిస్తోంది. ఇక ఈ పిక్స్ చూసిన అభిమానులు "పర్ఫెక్ట్ ట్రాన్స్‌ఫార్మేషన్", "సూపర్ ఫిట్‌నెస్ గోల్స్", "బ్యూటిఫుల్ లుక్" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తూ లైకులతో ముంచెత్తుతున్నారు.
'మెంటల్ మదిలో' నుంచి కంబ్యాక్ వరకు :
ఇక 2017లో వచ్చిన 'మెంటల్ మదిలో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నివేదా, 'చిత్రలహరి', 'అల వైకుంఠపురములో', 'రెడ్', 'పాగల్', 'దాస్ కా ధమ్కీ' వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్‌గా 'పరువు' అనే వెబ్ సిరీస్‌తో కూడా ఓటీటీలో ప్రశంసలు అందుకుంది.
చేతిలో వరుస క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్టులు:
ఇక ప్రస్తుతం నివేదా పేతురాజ్ సౌత్‌లో భారీ ఆఫర్లతో బిజీగా ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ సరసన 'ఆదర్శ కుటుంబం', మెగాస్టార్ చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో వస్తున్న కాకా చిత్రాలలో కీలక పాత్రలు పోషిస్తోంది. ఇటీవల సింగ్ గీతం సినిమాలో నటించి హిట్ అందుకుంది ..ఇక తమిళ సినిమా 'పార్టీ'కూడా విడుదలకు సిద్ధంగా వుంది. తన నటనతోనే కాకుండా ఫిట్‌నెస్ అండ్ ఫ్యాషన్ సెన్స్‌తో అలరిస్తున్న నివేదా పేతురాజ్, రాబోయే పెద్ద సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మరిన్ని భారీ విజయాలు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.