ఆ డైరెక్టర్ పై పెద్ద భారమే ఉంది!
దీంతో పాటూ ఈ సినిమా డైరెక్టర్ హెచ్. వినోత్ నుంచి గత కొంత కాలంగా వచ్చిన సినిమాలన్నీ ఘోర డిజాస్టర్లుగా మిగిలాయి.;
దళపతి విజయ్ హీరోగా హె. వినోత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా జన నాయగన్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆల్రెడీ షూటింగ్ ఆఖరి దశకు చేరుకుందని తెలుస్తోంది. 2026 సంక్రాంతికి జన నాయగన్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నారు. అయితే జూన్ 22న విజయ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఈ సినిమా నుంచి ఓ గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
జూన్ 22 ఉదయం 12 గంటలకు ఈ గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించగా, ఈ గ్లింప్స్ ఎలా ఉంటుందో అని విజయ్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అయితే వారి టెన్షన్ కు చాలానే కారణాలున్నాయి. ఫుల్ టైమ్ పాలిటిక్స్ లోకి రాబోయే ముందు విజయ్ చేస్తున్న ఆఖరి సినిమా అయినప్పటికీ జన నాగయన్ సినిమాపై అతని గత సినిమాలకు ఉన్నంత హైప్ లేదు.
జన నాయగన్ సినిమా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుందనే ఊహాగానాలే ఈ సినిమాపై ఉన్న లో బజ్ కు మెయిన్ రీజన్. దీంతో పాటూ ఈ సినిమా డైరెక్టర్ హెచ్. వినోత్ నుంచి గత కొంత కాలంగా వచ్చిన సినిమాలన్నీ ఘోర డిజాస్టర్లుగా మిగిలాయి. ఇన్ని పరిస్థితుల మధ్య వస్తున్న జన నాయగన్ గ్లింప్స్ కు కావాల్సిన హైప్ ను క్రియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అందులో భాగంగానే విజయ్ ఫ్యాన్స్ గ్లింప్స్ కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి ఎంతో ఉత్సాహంగా ఆ విషయాన్ని స్పెషల్ హ్యాష్ ట్యాగులతో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సినిమాపై హైప్ పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ గ్లింప్స్ ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకుని సినిమాపై హైప్ ను పెంచుతుందా లేదా గ్లింప్స్ తో ఉన్న అంచనాలను కూడా తగ్గిస్తుందా అనేది చూడాలి. ఏదేమైనా డైరెక్టర్ పై ఈ గ్లింప్స్ రూపంలో పెద్ద భారమే ఉంది.