• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  Thalaivar 170: రజినీకాంత్...

Thalaivar 170: రజినీకాంత్ బర్త్ సర్ ప్రైజ్ ఎలా ఉందంటే..

| ఇక రిలీజ్ అయిన టైటిల్ టీజర్ అదిరిపోయింది. మరోసారి ఈ సినిమాలో రజినికాంత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని టీజర్ చూస్తే అర్థమవుతుంది.

By - Tupaki Desk
Update: 2023-12-12 13:46 GMT

రీసెంట్ గా 'జైలర్' తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. రజనీకాంత్ ప్రస్తుతం 170 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. జై భీమ్ మూవీ తో దర్శకుడిగా ప్రశంసలు అందుకున్న TJ జ్ఞాన వేల్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. 'Thalaivar170' అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో సౌత్ నుంచి నార్త్ వరకు పలువురు స్టార్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు.

తెలుగు నుంచి దగ్గుబాటి రానా, మలయాళ నుంచి ఫాహాద్ ఫాజిల్ తోపాటూ బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబచ్చన్ నటిస్తుండడంతో సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతున్న ఈ మూవీ నుంచి నేడు రజినీకాంత్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కోసం అదిరిపోయే గిఫ్ట్ అందించారు మేకర్స్. ఈ మేరకు మూవీ టైటిల్ టీజర్ ని విడుదల చేశారు. కాగా ఈ చిత్రానికి 'వెట్టయన్' అనే టైటిల్ ని ఖరారు చేశారు.

ఇది తమిళ టైటిల్ కావడంతో ఇతర భాషల్లో వేరే టైటిల్ అనౌన్స్ చేస్తారా? లేక అదే టైటిల్ ని పెడతారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక రిలీజ్ అయిన టైటిల్ టీజర్ అదిరిపోయింది. మరోసారి ఈ సినిమాలో రజినికాంత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని టీజర్ చూస్తే అర్థమవుతుంది. టీజర్ స్టార్టింగ్ లో రజనీకాంత్ కుర్చీలో కూర్చుని టేబుల్ మీద కాలు పెట్టి సుభాష్ చంద్రబోస్ బుక్ చదువుతూ కనిపిస్తారు.

ఆ తర్వాత ఖాకీ షూస్ తో ఆఫీస్ నుంచి బయటికి నడిచి వస్తారు. ఇక టీజర్ చివర్లో 'వేట మొదలైనప్పుడు వేటాడడం తప్పదు' అంటూ రజనీకాంత్ చెప్పే డైలాగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. టీజర్ లో అనిరుద్ మరోసారి తన బీజీయం తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మొత్తం మీద రజనీకాంత్ కొత్త సినిమా టీజర్ తో ఫ్యాన్స్ పండగ చేసుకోవడం గ్యారెంటీ. కాగా ఇటీవలే ముంబైలో అమితాబచ్చన్ కి సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేశారు.

సుమారు 33 ఏళ్ల తర్వాత రజినీకాంత్, అమితాబచ్చన్ కలిసి నటిస్తున్న సినిమా ఇది. 1980లో అందాకా నూన్, గిరాఫ్తార్ అంటే సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు. ఆ తర్వాత ఆ 1991లో రిలీజ్ అయిన 'హమ్' సినిమాలో కలిసి నటించిన వీళ్ళిద్దరూ మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్లో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2024లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Full View
Tags:    
  • Rajinikanth 
  • Thalaivar170 
  • Title 
  • Release 
  • Anirudh 
  • Lycaproductions 
  • Tjgnanavel 
  • Amitabhbachchan 
  • Fahadhfaasil 
  • Rana 

Similar News

'కీడా కోలా'పై దర్శకుడు కరుణ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-25 08:32 GMT

బ్రహ్మాస్త్రలో హాలీవుడ్ ప్రభావమే మైనస్ అయిందా?

2026-11-25 08:32 GMT

హీరోలకు లేని అభ్యంతరం దీపికకు ఎందుకు?

2026-11-25 08:14 GMT

ఆకాశంలో ఒక తార.. చిరు, నాని ఏమన్నారంటే..

2026-11-25 08:13 GMT

క‌పూర్ సిస్టర్స్ ముందు ఆ హాలీవుడ్ తారలు సరిపోరా?

2026-11-25 08:13 GMT

మంచు కొండల్లో ట్రెక్కింగ్.. అదరగొట్టిన కాయదు లోహర్

2026-11-25 08:13 GMT

ఎన్నేళ్లు గడిచినా వర్మ మారలేదు..ఇప్పటికీ అదే తిరుగుబాటు!

2026-11-25 07:08 GMT

తెలంగాణ యాస..1960ల నాటి కొత్త ప్రపంచం!

2026-11-25 07:08 GMT

నారా రోహిత్‌.. నవంబర్‌ ఎంత స్పెషల్ అంటే..

2026-11-25 07:07 GMT

అందాల పోటీల్లో కొత్త చరిత్ర.. కేరళ అమ్మాయి అరుదైన ఘనత!

2026-11-25 07:07 GMT

చంద్రబోస్ ఇంట్లో తరుణ్ భాస్కర్‌కు స్పెషల్ ఫ్యాన్!

2026-11-25 07:05 GMT

అంతరిక్షం కంటే ముందు 150 కాఫీ షాప్‌లకు వెళ్లిందట..!

2026-11-25 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS