భార్య‌తో అలా రోడ్డు ప‌క్క‌న టీ తాగుతూ..

పుష్ప డైరెక్ట‌ర్ సుకుమార్ భార్య త‌బిత సుకుమార్ నిర్మాత‌గా మారి సినిమాలు నిర్మిస్తూ ఇండ‌స్ట్రీలోని ప్ర‌తీ ఒక్కరితో ఎంతో మంచి రిలేష‌న్ ను మెయిన్ చేస్తూ ఉంటుంద‌నే సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-06-02 10:10 GMT

పుష్ప డైరెక్ట‌ర్ సుకుమార్ భార్య త‌బిత సుకుమార్ నిర్మాత‌గా మారి సినిమాలు నిర్మిస్తూ ఇండ‌స్ట్రీలోని ప్ర‌తీ ఒక్కరితో ఎంతో మంచి రిలేష‌న్ ను మెయిన్ చేస్తూ ఉంటుంద‌నే సంగ‌తి తెలిసిందే. త‌బిత ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ త‌న అప్డేట్స్ ను షేర్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు తాజాగా త‌బిత సుకుమార్ మే నెల హైలైట్స్ ను పోస్ట్ చేసింది.

అందులో త‌బిత త‌న లైఫ్ లో చాలా సింపుల్ గా ఉంటుంద‌ని అర్థ‌మైపోయింది. త‌బిత షేర్ చేసిన ఈ ఫోటోకు పెద్ద‌గా ఫిల్ట‌ర్లు కానీ, క్యాప్ష‌న్లు కానీ ఏమీ లేవు. అయిన‌ప్ప‌టికీ ఆమె షేర్ చేసిన స్టోరీ అందరి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. అయితే తబిత షేర్ చేసిన ఫోటోల్లో ఒక ఫోటో మాత్రం చాలా హైలైట్ గా నిలుస్తూ అంద‌రినీ ఎట్రాక్ట్ చేస్తోంది. ఆ ఫోటో మ‌రెవ‌రిదో కాదు త‌న భ‌ర్త సుకుమార్‌ది.

సుకుమార్, త‌బిత ఇద్ద‌రూ క‌లిసి బైక్ రైడ్ కు వెళ్లి అక్క‌డ రోడ్డు ప‌క్క‌నే ఓ చిన్న టీ బ్రేక్ తీసుకుని లైఫ్ ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న ఫోటో ఒక‌టి ఇప్పుడు అంద‌రినీ తెగ ఆక‌ర్షిస్తోంది. ఒక స్టార్ డైరెక్ట‌ర్ అయుండి సుకుమార్ ఇలా బైక్ పై చాలా నార్మ‌ల్ గా భార్య‌తో బ‌య‌ట‌కు వెళ్ల‌డం, రోడ్డు ప‌క్క‌న ఆగి టీ తాగ‌డం లాంటి సంఘ‌ట‌న‌లు ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోని వ్య‌క్తుల నుంచి చాలా త‌క్కువగా చూస్తుంటాం. అలాంటిది సుకుమార్ త‌న ఫ్యామిలీకి టైమ్ కేటాయించి ఇలా బ‌య‌ట‌కు వెళ్ల‌డం అంద‌రి చూపునీ త‌మ వైపు తిప్పుకునేలా చేస్తోంది.

ఈ ఫోటోతో పాటూ ఆ పోస్ట్ లో మ‌రికొన్ని ఫోటోలు కూడా ఉన్నాయి. ఆ ఫోటోల్లో త‌బిత త‌న లేట్ నైట్ సిటీ లైట్స్, మ‌రియు న‌మ‌త్ర శిరోద్క‌ర్, బాలీవుడ్ న‌టుడు ఇషాన్ ఖ‌ట్ట‌ర్ లాంటి సెల‌బ్రిటీల‌తో క‌లిసి దిగిన స్నాప్స్ ను కూడా పోస్ట్ చేసింది. ఇవ‌న్నీ చూస్తుంటే సుకుమార్ భార్య త‌బిత మే నెల ఎంతో అద్భుతంగా గ‌డిచింద‌ని అర్థ‌మ‌వుతుంది. త‌బిత గ‌తేడాది మారుతి న‌గ‌ర్ సుబ్రహ్మ‌ణ్యం సినిమాను నిర్మించిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News