స్టార్ హీరో సీక్వెల్ మూవీపై ఫేక్ ప్రచారం
అయితే ఇవన్నీ నిరాధార వార్తలు అంటూ కొట్టి పారేసింది బాలీవుడ్ హంగామా. తేరే నామ్ లాంటి క్లాసిక్ ని ఎవరూ టచ్ చేయకూడదు.;
తమిళ చిత్రం `సేతు` రీమేక్ `తేరే నామ్` సల్మాన్ కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమా. కల్ట్ జానర్ చిత్రంలో సల్మాన్ ఖాన్ నటనను ఆరాధించని ప్రేక్షకులకు లేరు. అందుకే ఈ సినిమాకి సీక్వెల్ ని రూపొందించేందుకు సాజిద్ నడియాడ్ వాలా సిద్ధమవుతున్నారని ప్రచారం సాగుతోంది. సల్మాన్ ఖాన్ ఈ సీక్వెల్ లో నటిస్తారని, అతడు స్క్రిప్టును పరిశీలిస్తున్నారని కథనాలొచ్చాయి.
అయితే ఇవన్నీ నిరాధార వార్తలు అంటూ కొట్టి పారేసింది బాలీవుడ్ హంగామా. తేరే నామ్ లాంటి క్లాసిక్ ని ఎవరూ టచ్ చేయకూడదు. ఈ చిత్రంలోని గుండెల్ని మెలిపెట్టే భావోద్వేగ సన్నివేశాలను తిరిగి రిపీట్ చేయడం అంత సులువు కాదు. పాత్రల్ని ఆ స్థాయిలో పండించాలంటే చాలా పరివర్తన అవసరం. అందుకే ఇలాంటి కల్ట్ క్లాసిక్ ని టచ్ చేయడానికి సాజిద్ నడియాడ్ వాలా ఇష్టపడరని తెలుస్తోంది. తేరే నామ్ సీక్వెల్ గురించి సాజిద్ ఇప్పటివరకూ సల్మాన్ తో మాట్లాడలేదు.
అంతేకాదు.. సల్మాన్ ఖాన్ తో సాజిద్ ఓ సినిమాకి ప్లాన్ చేస్తున్నారు. అయితే దాని గురించి వివరాలేవీ ఇంకా బయటకు రాలేదు. ఆ ఇద్దరి కలయికలో తేరే నామ్ సీక్వెల్ ఉంటుందన్నది ఊహ మాత్రమే. అది నిజం కాదు! అని క్లారిటీగా తెలుస్తోంది. ఇప్పటివరకూ ఒరిజినల్ సేతు హక్కుల కొనుగోలు కోసం సాజిద్ ప్రయత్నించలేదు. సల్మాన్ లేదా ఇతర నటులు ఎవరినీ సాజిద్ సంప్రదించలేదు.
`తేరే నామ్` అనేది 2000ల ప్రారంభంలో సల్మాన్ ఖాన్ నటించిన క్లాసిక్ ప్రేమ కథా చిత్రం. తమిళ చిత్రం సేతు ఆధారంగా రూపొందింది. చాలా కాలంగా దీనికి సీక్వెల్ గురించి చర్చ జరుగుతోంది. కానీ స్క్రిప్ట్ లేకుండా సీక్వెల్ ఉండకూడదు. సాజిద్ నదియాద్వాలాతో రెండవ భాగం అనే ఆలోచన అంతా అర్థరహితం. శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో తన కొడుకును లాంచ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు సాజిద్. రోమియో అనే చిత్రాన్ని సాజిద్ నిర్మిస్తున్నారు.