సిద్ధు తెలుసు కదా.. తెలివైన నిర్ణయం ఏం చేస్తుందో..?
2 గంటల 16 నిమిషాలతో తెలుసు కదా ఫిక్స్ చేయడం చాలా తెలివైన నిర్ణయం అని చెప్పొచ్చు. ఇక సినిమాకు సెన్సార్ టీం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని తెలుస్తుంది.;
డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ తో సెన్సేషనల్ హిట్ అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ ఆ తర్వాత జాక్ తో షాక్ ఇచ్చాడు. ఇక లేటెస్ట్ గా నీరజ కోన డైరెక్షన్ లో సిద్ధు చేసిన సినిమా తెలుసు కదా. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమా నిర్మించారు. అక్టోబర్ 17న రిలీజ్ అవుతున్న ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. సెన్సార్ టీం నుంచి సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. సెన్సార్ టీం సిద్ధు తెలుసు కదా సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమా 2 గంటల 16 నిమిషాల రన్ టైం తో వస్తుంది.
సెన్సార్ టీం నుంచి పాజిటివ్ రెస్పాన్స్..
ఈమధ్య కాలంలో ఇంత తక్కువ రన్ టైం తో సినిమా రావడం చాలా అరుదుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆడియన్స్ చూస్తున్నారు కదా అని కొన్ని సినిమాలు 2 గంటల 50 నిమిషాలు కూడా చేస్తున్నారు. రెండున్నర గంటల పైన సినిమాలే అన్నీ వస్తున్నాయి. 2 గంటల 16 నిమిషాలతో తెలుసు కదా ఫిక్స్ చేయడం చాలా తెలివైన నిర్ణయం అని చెప్పొచ్చు. ఇక సినిమాకు సెన్సార్ టీం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని తెలుస్తుంది.
నీరజ కోన ఎలాంటి డీవియేషన్స్ లేకుండా ఈ కథ నడిపించారట. ఇక సిద్ధుతో పాటు హీరోయిన్స్ కూడా బాగా నటించారని తెలుస్తుంది. సినిమాకు సిద్ధు, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా ముగ్గురు మూడు పిల్లర్స్ గా ఉంటారని తెలుస్తుంది. ఇక సిద్ధు తెలుసు కదా సినిమాకు థమన్ మ్యూజిక్ కూడా మరో హైలెట్ అని అంటున్నారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.
నీరజ కోన మొదటి డైరెక్ట్రోరియల్ సినిమా..
తెలుసు కదా సినిమాకు సెన్సార్ నుంచి వచ్చిన ఈ టాక్ సిద్ధు ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. నీరజ కోన మొదటి డైరెక్ట్రోరియల్ సినిమా అవ్వడం వల్ల ఈ సినిమాపై ఆమె చాలా టెన్షన్ గా ఉన్నారు. ఐతే అవుట్ పుట్ మీద మాత్రం డైరెక్టర్ కాన్ ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. అక్టోబర్ 17న మరికొన్ని సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. సిద్ధుతో పోటీకి దిగే ఆ సినిమాల్లో ఏది సక్సెస్ అవుతుందో చూడాలి.
సిద్ధు జొన్నలగడ్డ కూడా జాక్ ఇచ్చిన షాక్ నుంచి బయటకు వచ్చి తెలుసు కదా తో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. తెలుసు కదా సినిమా ప్రమోషన్స్ కూడా ఊపందుకున్నాయి. ఇద్దరు హీరోయిన్స్ తో సిద్ధు చేస్తున్న స్పెషల్ చిట్ చాట్ ఆడియన్స్ ని అలరిస్తున్నాయి.