తెలుగు హీరోలు × బాలీవుడ్ మేకర్స్.. లెక్క సరిపోవట్లే!

ఇదే గతంలో జంజీర్లో రామ్ చరణ్‌కి, ఆదిపురుష్ ప్రభాస్‌కి జరిగింది. వారి స్థాయికి తగిన పాత్ర రాయకపోవడం వల్లే ప్రేక్షకుల్లో కనెక్ట్ కాలేకపోయారు.;

Update: 2025-05-23 18:30 GMT

ఇప్పటి బాలీవుడ్ సినిమా ట్రెండ్ చూస్తే, మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని స్టార్‌ కాస్టింగ్ డిసిషన్స్ తీసుకుంటున్నారు కానీ… కథ, పాత్రల అవసరాలు అనే ఫౌండేషన్ పూర్తిగా మరిచిపోతున్నారు. ముఖ్యంగా తెలుగు హీరోల విషయంలో ఇది తీవ్రమైన సమస్యగా మారింది. తాజాగా ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కలయికలో తెరకెక్కుతున్న వార్ 2 టీజర్‌కి వచ్చిన స్పందన చూస్తేనే ఇది స్పష్టంగా అర్థమవుతుంది.

తెలుగులో ఎన్టీఆర్ స్థాయికి తగిన పాత్రను తయారు చేయాలి అంటే, ఆయన ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, పర్సనల్ స్టార్ ఇమేజ్ అన్నీ కలగలిపిన పాత్ర కావాలి. కానీ బాలీవుడ్ మాత్రం పాన్ ఇండియా మంత్రాన్ని తలకెక్కించుకుని, కథలో కంటెంట్ లేకుండానే ఒక స్టార్‌ని పెట్టేయడం ఇష్టపడుతున్నట్లు అనిపిస్తోంది. ఇదే గతంలో జంజీర్లో రామ్ చరణ్‌కి, ఆదిపురుష్ ప్రభాస్‌కి జరిగింది. వారి స్థాయికి తగిన పాత్ర రాయకపోవడం వల్లే ప్రేక్షకుల్లో కనెక్ట్ కాలేకపోయారు.

ఒకప్పుడు బాలీవుడ్ కథలకి దక్షిణ భారత నటులు అద్భుతంగా సరిపోయేవారు. రజినీకాంత్, కమల్ హాసన్‌లాంటి లెజెండ్స్ బాలీవుడ్‌లో సినిమాలు చేసినప్పుడు, వాటి స్క్రీన్ ప్లే, పాత్ర డిజైన్ అంతా అందులో మునిగిపోయేవారు. కానీ ఇప్పటి దశలో తెలుగు హీరోలను సినిమాల్లో పెట్టి, ఓ వన్ లైనర్ స్క్రీన్ టైమ్ ఇవ్వడం ట్రెండ్ అయిపోయింది. ఇది హీరోకే కాదు, ప్రేక్షకుడికీ అవమానమే.

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకులు తమ కథలో హీరోని ఎలా మలచుకోవాలో బాగా అర్థం చేసుకుంటారు. రాజమౌళి, సుకుమార్, కొరటాల శివ వంటి దర్శకులు స్టార్లను ‘ఎలివేట్’ చేయడంలో మాస్టర్లు. కానీ బాలీవుడ్ కథలు ఇంకా అలాంటి స్కిల్‌ను సాధించలేకపోతున్నాయి. ఒక తెలుగు హీరోను తెరపై చూపించాలంటే, ఆయన డెఫినిషన్‌ను అర్థం చేసుకోవాలి. అలానే ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లే ప్రెజెంట్ చేయాలి. లేదంటే అది ప్రయోజనానికి మించిన ప్రయోగంగా మిగులుతుంది.

తెలుగు హీరోలను కేవలం కమర్షియల్ మార్కెట్ కోసం వాడుకునే రోజుల్ని మించి వెళ్లాలి. వారి ‘సినిమాటిక్ స్వరూపం’ను పసిగట్టి, కథలో తగిన స్థాయిలో మలచే దిశగా బాలీవుడ్ అడుగులు వేయాలి. లేదంటే ఈ క్రాస్ ఇండస్ట్రీ కలయికలు ప్రేక్షకుల మదిలో తాత్కాలిక ఉత్సాహంగా మిగిలిపోతాయేగానీ, మర్చిపోలేని అనుభూతిగా క్లిక్ కాలేవనే కామెంట్స్ వస్తున్నాయి.

మన స్టార్స్ కూడా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కమల్ హాసన్ లాంటి స్టార్ ను కల్కి లో ఎంత పవర్ఫుల్ గా చూపించారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డైలాగ్స్ నుంచి క్యారెక్టర్ డిజైనింగ్ వరకు ఓ ప్లాన్ ఫాలో అయ్యారు. ఇదే తరహాలో బాలీవుడ్ కూడా కాస్త అంచనాలను మించి ఆలోచించాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News