సమ్మర్ ఫైట్.. 11 సినిమాల మధ్య ఆ ఇద్దరు స్టార్స్..!

మార్చి ఎండింగ్ లో ఆల్రెడీ చరణ్ పెద్ది వస్తుంది. మార్చి 27న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు. బుచ్చి బాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.;

Update: 2025-11-10 10:30 GMT

సంక్రాంతి, దసరా, దీపావళి, క్రిస్మస్ తో పాటు సినిమాలకు సమ్మర్ కూడా ఒక మంచి అడ్వాంటేజ్ అవుతుంది. సమ్మర్ లో సినిమా వచ్చింది అంటే కచ్చితంగా స్కూల్స్, కాలేజెస్ హాలీడేస్ కాబట్టి కచ్చితంగా ఎంగేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఐతే నెక్స్ట్ సమ్మర్ స్టార్ సినిమాలతో పాటు యువ హీరోల సినిమాలు కూడా పోటీలో దిగుతున్నాయి. అవి కూడా ఒకటి రెండు కాదు ఏకంగా 11 సినిమాలు సమ్మర్ రేసులో రిలీజ్ కు పోటీ పడుతున్నాయి.

మార్చి 27న చరణ్ పెద్ది..

మార్చి ఎండింగ్ లో ఆల్రెడీ చరణ్ పెద్ది వస్తుంది. మార్చి 27న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు. బుచ్చి బాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రమోషనల్ కంటెంట్ కూడా అదిరిపోతుంది. ఐతే దానికన్నా ముందు కె.జి.ఎఫ్ యష్ హీరోగా టాక్సిక్ సినిమా వస్తుంది. ఆ సినిమా ప్రమోషన్స్ ఇంకా మొదలు పెట్టలేదు. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో నేషనల్ వైడ్ గా మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు యష్.

ఇక ఈ రెండు సినిమాలతో పాటు నాగ చైతన్య కార్తీక్ వర్మ సినిమా కూడా సమ్మర్ రేసులో రిలీజ్ కు రెడీ అవుతుంది. విరూపాక్ష తర్వాత కార్తీ దండు చేస్తున్న ఈ సినిమా కూడా థ్రిల్లర్ జోనర్ లో సరికొత్త సెన్సేషన్ అవుతుందని అంటున్నారు. ఈ సినిమాతో పాటు సాయి ధరం తేజ్ సంబరాల యేటిగట్టు కూడా సమ్మర్ రిలీజ్ కు ఫిక్స్ అయ్యింది. అసలైతే ఈ ఇయర్ సెప్టెంబర్ లోనే రిలీజ్ అవ్వాల్సిన ఎస్.వై.జి సినిమా నెక్స్ట్ సమ్మర్ షిఫ్ట్ అయ్యింది.

కొరియన్ కనకరాజుగా వరుణ్ తేజ్..

ఇక 2026 వేసవి టార్గెట్ తో వస్తున్నాడు వరుణ్ తేజ్. మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో కొరియన్ కనకరాజుగా వరుణ్ తేజ్ రాబోతున్నాడు. ఈ సినిమా కొరియన్, తెలుగు భాషల్లో రిలీజ్ ఉంటుందని టాక్. ఈ మూవీని కూడా సమ్మర్ లోనే రిలీజ్ డేట్ ఉండేలా చూస్తున్నారు. వీరితో పాటు శర్వానంద్ భోగి కూడా సమ్మర్ కే రిలీజ్ అంటున్నారు. సంపత్ నంది డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పీరియాడికల్ మాస్ మూవీగా రాబోతుంది.

ఇక అడివి శేష్ డెకాయిట్ సినిమా మార్చి 19న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా టాక్సిక్ రిలీజ్ రోజే వస్తుంది. ఐతే ప్రాజెక్ట్ విషయంలో అడివి శేష్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక నిఖిల్ స్వయంభు సినిమా కూడా నెక్స్ట్ సమ్మర్ లోనే రిలీజ్ అంటున్నారు. ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ బయటకు రావట్లేదు కానీ సైలెంట్ గా షూటింగ్ చేస్తున్నారని తెలుస్తుంది.

సూపర్ ఎంటర్టైనర్ గా విశ్వక్ సేన్ ఫంకీ..

నెక్స్ట్ సమ్మర్ కి సూపర్ ఎంటర్టైనర్ గా రాబోతుంది విశ్వక్ సేన్ ఫంకీ. అనుదీప్ కెవి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డ్రాగన్ బ్యూటీ కయదు లోహర్ హీరోయిన్ గా చేసింది. ఫంకీ టీజర్ తోనే తన మార్క్ చూపించాడు అందీప్. ఐతే ఈ సినిమా ఏప్రిల్ 14 లో రిలీజ్ లాక్ చేశారు. నెక్స్ట్ సమ్మర్ కి అక్కినేని అఖిల్ లెనిన్ కూడా వస్తుందని ఆక్. ఐతే ఆ సినిమా రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. దాదాపు సమ్మర్ కే రిలీజ్ ఉండొచ్చని చెప్పుకుంటున్నారు.

ఇక సమ్మర్ లోనే తన నెక్స్ట్ రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. కిష్కింధపురి సినిమాతో సక్సెస్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ నెక్స్ట్ జైంధవతో రాబోతున్నాడు. ఈ సినిమా సమ్మర్ కే రిలీజ్ టార్గెట్ అని తెలుస్తుంది. ఇక కె ర్యాంప్ తర్వాత కిరణ్ అబ్బవరం మళ్లీ 2026 సమ్మర్ కి తను చేస్తున్న చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ ప్లానింగ్ చేస్తున్నాడు. ఆల్రెడీ చెన్నై లవ్ స్టోరీ టీజర్ రిలీజై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఇక ఆనంద్ దేవరకొండ ఆదిత్య హాసన్ తో కలిసి చేస్తున్న సినిమా కూడా సమ్మర్ లోనే రిలీజ్ అని చెబుతున్నారు. బేబీతో హిట్ కొట్టిన ఆనంద్ ఈసారి ఒక సూపర్ ఎంటర్టైనర్ సినిమాతో రాబోతున్నాడని తెలుస్తుంది. సో ఇలా ఒక సినిమా కాదు ఏకంగా 11 యువ హీరోల సినిమాలు సమ్మర్ రిలీజ్ కు పోటీ పడుతున్నాయి. ఐతే వీటిలో ఏ సినిమా మళ్లీ వాయిదా పడుతుంది. ఏది సమ్మర్ లో రిలీజ్ కు ఫిక్స్ అవుతుంది అన్నది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.

Tags:    

Similar News