'పెద్ది'కి మరింత బూస్ట్.. ప్లాన్ మామూలుగా లేదుగా!

మార్చి 22న చెన్నైలో జరగనున్న చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కోసం నిర్వహించే రోర్ 26 మెగా ఈవెంట్‌ లో రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.;

Update: 2026-03-15 10:03 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది మూవీపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సనా రూపొందిస్తున్న ఆ చిత్రం ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్లు స్పీడప్ చేస్తూ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతోంది.

పెద్ది చిత్రానికిి సంగీతాన్ని ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ముఖ్యంగా తొలి సాంగ్ చికిరి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. విడుదలైన కేవలం 13 గంటల్లో 32 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 24 గంటల్లోనే దాదాపు 46 మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది.

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక వ్యూస్ సాధించిన సాంగ్స్ లిస్ట్ లో ఆ పాట ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అంతేకాకుండా ఇటీవల విడుదలైన రెండో పాట రయ్ రయ్ రా రా కూడా ట్రెండింగ్‌ లో నిలుస్తోంది. విలేజ్ బీట్లతో, రెహమాన్ ప్రత్యేకమైన మ్యూజిక్ స్టైల్‌ తో రూపొందిన ఆ పాట ఆకట్టుకుంటోంది. అయితే సాంగ్స్ ను విడుదల చేయడమే కాకుండా, అవి ప్రేక్షకుల్లో మరింత పాపులర్ అయ్యేలా మూవీ టీమ్ ప్రత్యేక ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

ఇప్పటికే చికిరి సాంగ్ ను గ్రాండ్ గా జరిగిన ఒక కాన్సర్ట్‌ లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన రెహమాన్ లైవ్ కాన్సర్ట్ కు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అక్కడ చికిరి వీడియో సాంగ్ ప్రదర్శించడం విశేషం. దీంతో ఆ కాన్సర్ట్ ద్వారా సాంగ్ మరింత పాపులర్ అయింది. ఇక ఇప్పుడు రయ్ రయ్ రా రా పాటను కూడా మరో భారీ వేదికపై ప్రదర్శించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.

మార్చి 22న చెన్నైలో జరగనున్న చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కోసం నిర్వహించే రోర్ 26 మెగా ఈవెంట్‌ లో రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో పెద్ది సినిమాలోని రెండో సింగిల్ ను ఆయన ప్రదర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆ కార్యక్రమం జరగనుండగా.. ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు అభిమానుల్లో జోష్ నింపే విధంగా ఆ మెగా ఈవెంట్‌ ను ప్లాన్ చేశారు.

సీఎస్కే టీమ్ లెజెండ్స్ పాల్గొనే ఆ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులు హాజరవుతారు! అలాంటి వేదికపై పెద్ది సినిమా పాటలు వినిపిస్తే, అవి మరింతగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందని చెప్పాలి. ఏదేమైనా సాంగ్స్ రిలీజ్ నుంచి కాన్సర్ట్ల వరకు స్పెషల్ ప్రమోషనల్ ఈవెంట్స్ తో పెద్ది టీమ్ సినిమాపై స్ట్రాంగ్ హైప్‌ సృష్టిస్తోంది. భారీ వేదికలపై పాటలు ప్రదర్శించడం ద్వారా మూవీకి మరింత బూస్ట్ యాడ్ అవుతుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

Tags:    

Similar News