మోనాలిసా ఏజ్‌పై డైరెక్టర్ కామెంట్స్ వైరల్ ..
మహాకుంభమేళాలో తన అందంతో నెటిజన్లను కట్టిపడేసిన 'వైరల్ గర్ల్' మోనాలిసా వివాహం ఇప్పుడు పెను వివాదానికి దారితీసింది.;
మహాకుంభమేళాలో తన అందంతో నెటిజన్లను కట్టిపడేసిన 'వైరల్ గర్ల్' మోనాలిసా వివాహం ఇప్పుడు పెను వివాదానికి దారితీసింది. ఆమె ఫర్మాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఆమె అసలు వయస్సు ఎంత అనే విషయంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తాజాగా సినిమా దర్శకుడు మేకర్ సనోజ్ మిశ్రా ఆమె వయస్సుపై చేసిన వ్యాఖ్యలు ఈ కేసుకు కొత్త మలుపునిచ్చాయి. కేరళలో జరిగిన ఈ వివాహం వెనుక అసలు విషయాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
మోనాలిసా వయసుపై సంచలన వ్యాఖ్యలు:
మహాకుంభమేళాలో మోనాలిసాను మొదటిసారి గుర్తించి, తన సినిమా 'ది డైరీ ఆఫ్ మణిపూర్'లో అవకాశం ఇచ్చిన దర్శకుడు సనోజ్ మిశ్రా తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. మోనాలిసా వయసు కేవలం 16 ఏళ్లేనని, ఆమె ఒక మైనర్ అని ఆయన పేర్కొన్నారు. పెళ్లి కోసం వయస్సు పత్రాలను తారుమారు చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ, ఆమెకు వెంటనే మెడికల్ టెస్టులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆమె మైనర్ అని తేలితే, ఈ పెళ్లికి సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ వ్యాఖ్యలతో మోనాలిసా పెళ్లి వ్యవహారం మరింత ముదిరింది.
పెళ్లి చుట్టూ ముసురుతున్న వివాదాలు:
మరోవైపు మోనాలిసా మాత్రం తాను మేజర్ అని, తనకు 18 ఏళ్లు నిండాయని బలంగా చెబుతోంది. తన పెళ్లి సర్టిఫికేట్‌ను కూడా మీడియాకు చూపిస్తూ, తన పుట్టిన తేదీ జనవరి 1, 2008 అని పేర్కొంది. అయితే ఆమె తండ్రి జైసింగ్ భోసలే మాత్రం ఇది 'లవ్ జిహాద్' అని, తన కూతురిని మభ్యపెట్టి తీసుకెళ్లారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. తన ఇష్టప్రకారమే హిందూ సంప్రదాయంలో కేరళలో పెళ్లి చేసుకున్నానని మోనాలిసా స్పష్టం చేసినప్పటికీ, ఆమె వయస్సు మరియు మత మార్పిడి అంశాలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం ఈ కేసులో పోలీసుల జోక్యం కూడా పెరిగింది. మోనాలిసా మేజర్ అని నిర్ధారించుకున్న కేరళ పోలీసులు ఆమెకు రక్షణ కల్పించినప్పటికీ, వయస్సు పత్రాల తారుమారు ఆరోపణలు వస్తుండటంతో విచారణ తప్పేలా లేదు. దర్శకుడు సనోజ్ మిశ్రా ఈ విషయాన్ని మరింత సీరియస్‌గా తీసుకుని, మోనాలిసాను ఒక కుట్రలో భాగంగానే పెళ్లి చేసుకున్నారని వాదిస్తున్నారు. ఇక తన తండ్రి బలవంతంగా మరో వ్యక్తితో పెళ్లి చేయాలని చూస్తున్నందుకే తాను పారిపోయి వచ్చానని మోనాలిసా చెబుతోంది.ఇక ఈ వయస్సు గొడవ ఎటు దారితీస్తుందో, అసలు నిజాలు ఎప్పుడు బయటకు వస్తాయో వేచి చూడాలి.