నార్త్ మార్కెట్‌పై రామ్ చరణ్ దాడి.. పెద్దితో హిస్టరీ క్రియేట్ చేయాలని ప్లాన్
పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ పెద్ది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.;
పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ పెద్ది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా, కేవలం కాస్టింగ్ వల్లే కాదు, రిలీజ్ స్ట్రాటజీ కారణంగా కూడా ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా జియో స్టూడియోస్ ఈ సినిమాను నార్త్ మార్కెట్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి రూపొందిస్తున్న ప్లాన్ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సౌత్ మార్కెట్‌లో ఇప్పటికే బలమైన స్థానం సంపాదించుకున్న రామ్ చరణ్, ఇప్పుడు నార్త్ ఇండియాలో తన మార్కెట్‌ను మరింత విస్తరించాలనే టార్గెట్ తో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.
ఈ స్ట్రాటజీలో అత్యంత ఆసక్తికర అంశం నార్త్ ఇండియాలో ప్రీమియర్ షోలు ప్లాన్ చేయడమే. సాధారణంగా ప్రీమియర్స్ అనేవి తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా కనిపించే ట్రెండ్. కానీ పెద్ది కోసం ఈ సౌత్ స్టైల్ రిలీజ్ కల్చర్‌ను నార్త్ మార్కెట్‌లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుండటం విశేషం. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, రిలీజ్‌కు ముందు రాత్రే మల్టీప్లెక్సుల్లో పెద్దికి సంబంధించిన స్పెషల్ ప్రీమియర్స్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇది కేవలం కలెక్షన్స్ పెంచడానికి మాత్రమే కాదు, ఫ్యాన్స్ హైప్‌ను పీక్స్‌కి తీసుకెళ్లే స్ట్రాటజీగా కూడా భావిస్తున్నారు. సోషల్ మీడియాలో ముందే పాజిటివ్ టాక్ వస్తే, అదే డే 1 ఓపెనింగ్స్‌పై భారీ ప్రభావం చూపుతుందనే అంచనాలున్నాయి.
ఇదే సమయంలో, థియేటర్ కౌంట్ విషయంలో కూడా పెద్ది భారీ టార్గెట్ ను పెట్టుకుంది. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్‌లో పెద్ది సినిమాను రిలీజ్ చేయాలని జియో స్టూడియోస్ ప్లాన్ చేస్తోందని టాక్. భారీ స్థాయిలో స్క్రీన్ కౌంట్ పెరిగితే, మొదటి రోజు కలెక్షన్స్‌పై నేరుగా ప్రభావం ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోరామ్ చరణ్ గత సినిమాల ఓపెనింగ్స్‌ను మించి, డే1 రికార్డ్స్ సెట్ చేసే అవకాశముందనే ఇండస్ట్రీ బజ్ వినిపిస్తోంది.
అదేవిధంగా, ఈ సినిమా టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ బాక్సాఫీస్ పోటీలో మరో కీలక ఘట్టంగా మారే అవకాశముంది. ఇటీవల సౌత్ సినిమాలు నార్త్ మార్కెట్‌లో బలంగా నిలబడుతున్న తరుణంలో, పెద్ది ఆ ట్రెండ్‌ను మరింత బలోపేతం చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ప్రీమియర్ షోలు, భారీ రిలీజ్, పాన్ ఇండియా ప్రమోషన్స్.. అన్నీ కలిపి బాలీవుడ్ మార్కెట్‌లో టాలీవుడ్ స్థాయిని మరింత పెంచే అవకాశం ఉందని విశ్లేషణలు సూచిస్తున్నాయి.
మొత్తానికి, పెద్ది కేవలం ఒక సినిమాగా మాత్రమే కాకుండా, ఒక కొత్త రిలీజ్ మోడల్‌ను పరీక్షించే ప్రాజెక్ట్‌గా మారుతోంది. నార్త్ ఇండియాలో ప్రీమియర్ షోలు నిర్వహించడం సక్సెస్ అయితే, ఫ్యూచర్ లో ఇతర టాలీవుడ్ సినిమాలు కూడా ఇదే మార్గాన్ని అనుసరించే అవకాశం ఉంది. అలా జరిగితే, ఇది ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతుంది.