నిక్కరులోనూ అగ్గి రాజేయడం ఎలానో పటానీని అడగాలి!

గ్లామర్ ప్రపంచంలో చీరకట్టుతో హొయలు పోవడం, బికినీలు .. మోనోకినీలతో సెగలు పుట్టించడం హీరోయిన్లకు సహజమే.;

Update: 2026-05-04 13:18 GMT

గ్లామర్ ప్రపంచంలో చీరకట్టుతో హొయలు పోవడం, బికినీలు .. మోనోకినీలతో సెగలు పుట్టించడం హీరోయిన్లకు సహజమే. కానీ బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ శైలి మాత్రం అందుకు భిన్నం. తాజాగా ముంబై వీధుల్లో ఒక సాధారణ నిక్కరులో కనిపించిన ఈ భామ.. తనదైన లుక్ తో హీట్ పుట్టించింది. సీకే బ్రాండ్‌కు అంబాసిడర్‌గా ఇన్నర్ దుస్తులకు ప్రచారం చేసిన దిశా..ఏ చిన్న అవుట్‌ఫిట్ ధరించినా అది క్షణాల్లో ట్రెండ్‌గా మారిపోతుందనడం రెగ్యుల‌ర్ గా చూస్తున్న‌దే.

దిశా పటానీ ఫిజిక్ ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఒక సాదాసీదా పంజాబీ డ్రెస్ ధరించినా.. అందులో తనదైన ముద్ర వేయగల బాడీ లాంగ్వేజ్ త‌న‌ సొంతం. నేటి జెన్ జెడ్ హీరోయిన్లలో దిశాకు ఉన్నంత క్రేజ్ మరే ఇతర కథానాయికకు లేదనే చెప్పాలి. జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్, అనన్యా పాండే వంటి స్టార్ కిడ్స్ ఉన్నా.. కియరా, పూజా లాంటి క్రేజీ హీరోయిన్లు ఎంతమంది ఉన్నా..దశాబ్దంన్నర కాలంగా దిశా పటానీ తన ఫ్యాషన్ సెన్స్‌తో వారంద‌రినీ వెనక్కి నెట్టేస్తోంది.

జిమ్ సెషన్ల నుండి పూల్ సైడ్ ఈత వరకు.. కాఫీ షాపుల నుండి గ్రాండ్ ఫంక్షన్ల వరకు దిశా ఎక్కడికి వెళ్లినా కెమెరా కళ్లన్నీ త‌న‌పైనే ... తీర్చిదిద్దిన టోన్డ్ ఫిగర్‌తో మతులు చెడగొట్టే ఈ సుందరి.. తాజాగా ముంబైలోని ఒక అల్ట్రా రిచ్ ఏరియాలో షాపింగ్‌కు వెళ్లింది. అక్కడ రిసెప్షన్‌లో తన పని ముగించుకుని బయటకు రాగానే డజనుకు పైగా కెమెరాలు త‌న‌ను చుట్టుముట్టాయి. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే ఫ్లాష్ లైట్ల మెరుపుల మధ్య తన కార్ ఎక్కి వెళ్లిపోయింది. కానీ ఆ కొద్ది క్షణాల విజువల్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

కెరీర్ విషయానికి వస్తే.. దిశా పటానీకి కాలం అంతగా కలిసిరావడం లేదనే చెప్పాలి. త‌ను నటించిన వరుస పాన్-ఇండియా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. ప్రభాస్ సరసన నటించిన `కల్కి 2898 ఏడీ` ఘనవిజయం సాధించినా.. ఆ తర్వాత వచ్చిన సూర్య `కంగువ` భారీ డిజాస్టర్‌గా మిగిలింది. అటు బాలీవుడ్ కెరీర్ కూడా ప్రస్తుతం అంతంత మాత్రంగానే సాగుతోంది. గ్లామర్ పరంగా సోషల్ మీడియాను ఏలుతున్నా.. ఒక నటిగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది.

ప్రస్తుతం 2026 సంవత్సరంలో దిశా పటానీ కొన్ని కీలక ప్రాజెక్టులలో నటిస్తోంది. మరి ఈ ఏడాది అయినా దిశాకు నటిగా మంచి విజయాలను అందిస్తుందో లేదో చూడాలి. ఫ్యాషన్ ప్రపంచంలో `క్వీన్`గా వెలుగొందుతున్న ఈ బ్యూటీ బాక్సాఫీస్ వద్ద కూడా తన సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. గ్లామర్ ఎంత ఉన్నా.. వెండితెరపై సక్సెస్ అనేది కెరీర్ గ్రాఫ్‌కు అత్యంత అవసరం.

Tags:    

Similar News