అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్.. పూనమ్ పోస్ట్ కు అర్థమేంటి?

టాలీవుడ్‌ లో ఒకప్పుడు హీరోయిన్‌ గా అందరినీ మెప్పించిన బ్యూటీ పూనమ్ కౌర్.. ఇప్పుడు సినిమాల కంటే సోషల్ మీడియాలో చేసే పోస్టులతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.;

Update: 2026-05-04 13:28 GMT

టాలీవుడ్‌ లో ఒకప్పుడు హీరోయిన్‌ గా అందరినీ మెప్పించిన బ్యూటీ పూనమ్ కౌర్.. ఇప్పుడు సినిమాల కంటే సోషల్ మీడియాలో చేసే పోస్టులతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ ఆమె చేసిన ఒక ట్వీట్ మరోసారి చర్చకు దారి తీసింది. ప్రస్తుతం నెట్టింట పూనమ్ పోస్ట్ ఫుల్ వైరల్ అవుతోంది.

విజేత తాను గెలవబోతున్నానని ప్రకటించరు, కేవలం గెలుస్తారంటూ అంటూ ఆమె ఎక్స్ వేదికగా చేసిన ఆ కామెంట్.. మొదట చూసినప్పుడు సాధారణంగా విజయం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి చెప్పినట్లు కనిపిస్తుంది. కానీ ట్వీట్ టైమింగ్ కారణంగా ఇది పలు విధాలుగా అర్థం చేసుకుంటున్నారు నెటిజన్లు. రాజకీయ పరిణామాలకా? లేక వ్యక్తిగతంగా ఎవరినైనా ఉద్దేశించిందా? అన్న కోణంలో సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

అయితే ఆ ట్వీట్ వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్న దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నా.. పూనమ్ కౌర్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఆమె పోస్ట్ చుట్టూ మరింత ఆసక్తి పెరిగింది. కొందరు దీనిని పొలిటికల్ కామెంట్ గా భావిస్తుంటే, మరికొందరు పర్సనల్ ఎవరినో టార్గెట్ చేసినట్లు ఉన్నారని అభిప్రాయపడుతున్నారు. దీంతో పూనమ్ ట్వీట్ ఇంకా వైరల్ అవుతోంది.

ఇది మొదటిసారి కాదు.. పూనమ్ కౌర్ ఇలాంటి పరోక్ష వ్యాఖ్యలు చేయడం. గతంలో కూడా ఆమె సోషల్ మీడియా పోస్టులు అనేకసార్లు వివాదాలకు దారి తీశాయి. ఎవరి పేరు కూడా ప్రస్తావించకుండా సందేశాలు పెట్టడం, వాటిపై ఊహాగానాలు పెరగడం ఆమెకు కొత్తేమీ కాదు. ఈ మధ్య కొన్ని పోస్టుల్లో నేరుగా పేర్లు కూడా ప్రస్తావిస్తున్నా.. ఎక్కువ శాతం మాత్రం పరోక్షంగానే ఉంటాయి.

ఇక ఆమె సినీ జర్నీ విషయానికి వస్తే.. 2006లో వచ్చిన మాయాజాలం సినిమాతో హీరోయిన్‌ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఒక విచిత్రం, శౌర్యం, వినాయకుడు, నాగవల్లి, గగనం, శ్రీనివాస కళ్యాణం వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా శౌర్యం సినిమాలో ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఆమె సినిమాలు చేశారు.

అయితే కెరీర్ ప్రారంభంలో వచ్చిన గుర్తింపును కొనసాగించలేకపోయిన పూనమ్.. క్రమంగా హీరోయిన్ పాత్రల నుంచి సపోర్టింగ్ రోల్స్ వైపు మళ్లారు. ఆ తర్వాత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. సినిమాల్లో కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఆమె యాక్టివ్‌ గా ఉంటూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా వివాదాస్పద వ్యాఖ్యలు, పరోక్ష ట్వీట్లు, ఇంటర్వ్యూల్లో చేసిన వ్యాఖ్యలు ఆమెను హాట్ టాపిక్‌ గా మారుస్తుంటాయి. మొత్తానికి తాజా ట్వీట్ కూడా అదే ట్రెండ్‌ ను కొనసాగించింది. క్లారిటీ లేకపోయినా.. చర్చకు దారి తీసేలా ఉండటం పూనమ్ స్టైల్‌ గా మారిపోయింది. ఇక ఆ పోస్టుపై ఆమె మళ్లీ ఏమైనా క్లారిటీ ఇస్తారా? లేక ఎప్పటిలానే మౌనం పాటిస్తారా? అనేది అంతా వేచి చూడాలి.




Tags:    

Similar News