హీరోలికిప్పుడు కమర్షియల్ కాదు కాన్సెప్ట్ ముఖ్యం!

ఒకప్పుడు నాలుగు ఫైట్లు, ఆరు పాటలు, కామెడీతో కూడిన కమర్షియల్ ఫార్ములా చిత్రాలకే పరిమితమనే ముద్ర ఉండేది. కానీ నేడు కాలం మారింది.

Update: 2026-05-27 15:30 GMT

ఒకప్పుడు నాలుగు ఫైట్లు, ఆరు పాటలు, కామెడీతో కూడిన కమర్షియల్ ఫార్ములా చిత్రాలకే పరిమితమనే ముద్ర ఉండేది. కానీ నేడు కాలం మారింది. ప్రేక్షకుడి అభిరుచీ మారింది. కేవలం స్టార్ ఇమేజ్‌ను నమ్ముకుని థియేటర్లకు వచ్చే రోజులు పోయాయి. అందుకే టాలీవుడ్ అగ్ర హీరోలు సైతం రొటీన్ కమర్షియల్ బాటను వీడి సరికొత్త కాన్సెప్ట్‌ల వైపు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో జెండా పాతాలంటే కథలో గట్టి దమ్ముండాలని స్టార్స్ బలంగా నమ్ముతున్నారు. ఈ సరికొత్త ట్రెండ్‌కు బాటలు వేస్తూ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస వైవిధ్యమైన చిత్రాలను లైన్‌లో పెడుతున్నారు.

హను రాఘవపూడి దర్శకత్వంలో రెండో ప్రపంచ యుద్దం నేపథ్యంలో చారిత్రా త్మక డ్రామా `ఫౌజీ`లో నటిస్తుండటం విశేషం. దీంతోపాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న `స్పిరిట్` లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ కనిపించనున్నారు. ఈ రెండు చిత్రాలు కూడా రొటీన్ మాస్ చిత్రాలకు భిన్నంగా సరికొత్త కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా తెర‌కెక్కుతున్నాయి. ద‌ర్శ‌కులిద్ద‌రు కాన్సెప్ట్ ను ఎక్కా డీవిటేయ్ అవ్వ‌కుండా తెలివిగా తెర‌కెక్కించ‌గల ద‌ర్శ‌కులే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం తన రూట్ మార్చారు.

ప్ర‌స్తుతం `రాకా` అనే సైన్స్ ఫిక్షన్- టైం ట్రావెల్ డ్రామాను ఎంచుకోవడం అన్న‌ది ఎంతో ఇంట్రెస్టింగ్.మరోవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో `పెద్ది` అనే పల్లెటూరి నేపథ్యమున్నచిత్రం తెర‌కెక్కుతోంది. ఊరి కోసం, తన వారి కోసం పోరాడే ఓ విలక్షణమైన యువకుడి పాత్రలో చరణ్ సరికొత్త లుక్‌తో మెప్పించనున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సైతం కాన్సెప్ట్ చిత్రాలతో సిద్ధమవుతున్నారు.దేవ‌ర ఇలాంటి ప‌క్కా కాన్సెప్ట్ తోనే తెర‌కెక్కించారు. తాజాగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న `డ్రాగ‌న్` అనే హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

నీల్ సినిమాల్లో ఎన్ని పాత్ర‌లున్నా? కాన్పెట్ ఎక్క‌డా దారి త‌ప్ప‌దు. ఆరంభం నుంచి ముగింపు వ‌ర‌కూ ఒకే పాయింట్ చుట్టూ క‌థ‌ను న‌డ‌ప‌డంలో ఎంతో ప్రోఫెష‌న‌ల్ అత‌డు. టాలీవుడ్ కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన రాజమౌళి సైతం అద్భుతమైన ఫాంటసీ కథను సిద్ధం చేస్తున్నారు. `వారణాసి` పుణ్యక్షేత్రం నేపథ్యంలో.. వేల సంవత్సరాల కాల గమనంలో సాగే చారిత్రక ప్రయాణం ఇది. ఇవ‌న్నీ గమనిస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ కొత్త ఆరోగ్యకరమైన మార్పు కనిపిస్తోంది. గతంలో స్టార్ హీరోలు ప్రయోగాలు చేయడానికి భయపడేవారు. కానీ నేడు ఓటీటీల విప్లవం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభిన్న కంటెంట్‌ను ప్రేక్షకులు వీక్షిస్తున్నారు. ఈ క్రమంలో కథల్లో వైవిధ్యం లేకపోతే నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో భారీ బడ్జెట్‌తో పాటు అంతే బలమైన ఆలోచనతో ద‌ర్శ‌కులు క‌దులుతున్నారు.

Tags:    

Similar News