• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిగ్ బాస్ 8 : డబుల్...

బిగ్ బాస్ 8 : డబుల్ ఎలిమినేషన్ షాక్ ఇస్తారా.. డేంజర్ ఎవరికి..?

| తేజా తర్వాత అవినాష్, పృధ్వి తో పాటు విష్ణు ప్రియ కూడా లీస్ట్ ఓటింగ్ లోనే ఉంది. ఒక ఎలిమినేషన్ తేజా అయితే రెండో ఎలిమినేషన్ ఎవరన్నది మాత్రం సస్పెన్స్ గా ఉందని చెప్పొచ్చు.

By - Tupaki Desk
Update: 2024-11-30 05:29 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని టాక్ నడుస్తుంది. శనివారం ఎపిసోడ్ ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. అది జరిగితే మాత్రం కచ్చితంగా లీకుల ద్వారా ఎవరు ఎలిమినేట్ అవుతున్నారన్నది తెలుస్తుంది. సీజన్ 8 లో ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు రోహిణి తప్ప అందరు నామినేట్ అయ్యారు. వారిలో ఈ వారం ఒకరు కాదు ఇద్దరు ఎలిమినేట్ అవుతారని తెలుస్తుంది.

ఓటింగ్ పర్సంటేజ్ ప్రకారం ముగ్గురు కంటెస్టెంట్స్ డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా టికెట్ టు ఫినాలె దక్కించుకున్న అవినాష్ కూడా చివర నుంచి రెండు, మూడు స్థానాల్లో ఉన్నాడు. ఇక ఈ వారం లీస్ట్ లో టేస్టీ తేజా ఉన్నాడు. దాదాపు అతని ఎలిమినేషన్ కన్ఫర్మ్ అన్నట్టే. ఐతే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందన్న టాక్ నడుస్తుంది. కాబట్టి తేజాతో పాటు మరో కంటెస్టెంట్ కూడా హౌస్ ను విడిచి వెళ్తాడు.

ఐతే అది ఎవరన్నది చెప్పడం కష్టమే అవుతుంది. ఎందుకంటే ఓటింగ్ ప్రకారం పృధ్వి, అవినాష్ ఇద్దరు లీస్ట్ నుంచి సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ఐతే టికెట్ టు ఫినాలె ఉంది కాబట్టి అవినాష్ ఈ వారం సేవ్ అయితే అతను మొదటి ఫైనలిస్ట్ అవుతాడు. అవినాష్ కన్నా పృధ్వికి ఎక్కువ ఓట్లు వస్తే మాత్రం అవినాష్ ఫైనలిస్ట్ అయినా కూడా బయటకు రాక తప్పదు. ఒకవేళ అవినాష్ ని సేవ్ చేయాలని అనుకుంటే మాత్రం పృధ్వి ని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది.

తేజా తర్వాత అవినాష్, పృధ్వి తో పాటు విష్ణు ప్రియ కూడా లీస్ట్ ఓటింగ్ లోనే ఉంది. ఒక ఎలిమినేషన్ తేజా అయితే రెండో ఎలిమినేషన్ ఎవరన్నది మాత్రం సస్పెన్స్ గా ఉందని చెప్పొచ్చు. ఆదివారం దాకా ఆ ఎలిమినేషన్ ట్విస్ట్ ని రివీల్ చేయరని తెలుస్తుంది. మరి ఈవెనింగ్ వరకు ఎలిమినేషన్ గురించి ఏదైనా లీక్స్ వస్తాయేమో చూడాలి.

బిగ్ బాస్ సీజన్ 8 లో ట్విస్ట్ లు, టర్నులు బాగానే ఉన్నాయి. ఈ వారం మొత్తం ఇదివరకు హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపించి టికెట్ టు ఫినాలె టాస్క్ నడిపించారు. అవినాష్ ఎంతో తెలివిగా ఆడి టికెట్ టు ఫినాలెని దక్కించుకున్నాడు. ఐతే అతనికి దక్కిన ఈ ఛాన్స్ ని ప్రేక్షకులు ఆమోదించి అతన్ని ఈ వీక్ సేవ్ చేస్తాడా లేదా అన్నది చూడాలి.

Tags:    
  • Telugubiggboss8 
  • Biggboss8 
  • Nagarjuna 
  • Doubleelimination 
  • Contestants 
  • Avinash 
  • Vishnupriya 
  • Prithvi 
  • Tastyteja 

Similar News

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

Copyright @2026

Powered by Blink CMS