క్రియేటివ్ ఫిలింమేక‌ర్స్‌ 3ల‌క్ష‌లు గెలుచుకునే ఛాన్స్

తెలుగు రాష్ట్రాల్లో క్రియేటివిటీకి కొద‌వేమీ లేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌లో అద్భుత‌మైన క్రియేట‌ర్లు ఉన్నారు.;

Update: 2025-09-17 04:17 GMT

తెలుగు రాష్ట్రాల్లో క్రియేటివిటీకి కొద‌వేమీ లేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌లో అద్భుత‌మైన క్రియేట‌ర్లు ఉన్నారు. ముఖ్యంగా ద‌ర్శ‌క‌త్వం, ర‌చ‌నా రంగంలో స్థిర‌ప‌డాల‌నుకునే ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ ఇబ్బ‌డిముబ్బ‌డిగా ఉన్నారు. కొంద‌రు ప్రాక్టిక‌ల్ గా సంస్థ‌ల్లో శిక్ష‌ణ తీసుకున్న‌వారు ఉండ‌గా, చాలా మంది సినీప‌రిశ్ర‌మ‌లో సెట్లలో ప‌ని చేస్తూ అనుభ‌వం ఘ‌డించిన వారు ఉన్నారు. అయితే ఇలాంటి ఔత్సాహిక క్రియేట‌ర్ల‌కు అరుదైన అవ‌కాశం అందిస్తోంది తెలంగాణ ప్ర‌భుత్వం.


మంచి సందేశం ముఖ్యం:

చ‌క్క‌ని సందేశంతో ల‌ఘు చిత్రాల‌తో లేదా అంద‌మైన పాట‌తో మీరు ఒక ల‌క్ష నుంచి 3 ల‌క్షల వ‌ర‌కూ గెలుచుకునేందుకు అవ‌కాశం క‌ల్పిస్తోంది. దీనికోసం తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) సార‌థ్యంలో `బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్` ఛాలెంజ్‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ప్రకటించింది. యువ ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హించ‌డ‌మే ధ్యేయంగా దీనిని టిఎఫ్‌డిసి అధ్య‌క్షుడు దిల్ రాజు ప్రారంభించారు. ఈ పోటీ తెలంగాణ సంస్కృతిని సెల‌బ్రేట్ చేసుకునేందుకు ఫిలింమేకింగ్‌, సంగీతంలో కొత్త ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హించేందుకు ఒక వేదిక‌ అని ఆయ‌న తెలిపారు.

పోటీకి ఏం పంపాలి?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్‌తో పాటు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలు, సాంప్రదాయ కళారూపాలపై ల‌ఘు చిత్రాలు లేదా పాట‌ల‌ను రూపొందించి ఎంట్రీల‌కు పంపాల్సి ఉంటుంది.

అర్హ‌త‌లు ఇవి:

40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పాల్గొనేవారు పోటీ పడటానికి అర్హులు. లఘు చిత్రాలు మూడు నిమిషాలకు మించకూడదు. పాటలు ఐదు నిమిషాల్లోపు ఉండాలి. రెండూ 4K రిజల్యూషన్‌లో ఈ ఛాలెంజ్ కోసం ప్రత్యేకంగా రూపొందించాల్సి ఉంటుంది. గతంలో వేరే చోట ప్రదర్శించబడిన ఎంట్రీలు పరిగణించబడవు.

ల‌క్ష నుంచి 3 ల‌క్ష‌లు:

మొదటి బహుమతికి రూ. 3 లక్షలు, రెండవ బహుమతికి రూ. 2 లక్షలు, మూడవ బహుమతికి రూ. 1 లక్ష, .. ఒక్కొక్కరికి రూ. 20,000 చొప్పున ఐదు కన్సోలేషన్ బహుమతులు వంటి ఆకర్షణీయమైన బహుమతులు అందుకోవ‌చ్చు. విజేతలకు ప్రశంసా పత్రాలు, మెమెంటోలు కూడా అందుతాయి.

జూరీ ప‌రిశీల‌న‌....

నిపుణులైన జ్యూరీ ఎంట్రీల‌ను ప‌రిశీలిస్తుంది. ఎంట్రీలను youngfilmmakerschallenge@gmail.com కు ఇమెయిల్ ద్వారా లేదా WhatsApp (8125834009) ద్వారా పంపవచ్చు. చివరి తేదీ 30 సెప్టెంబర్ 30, 2025.

Tags:    

Similar News