OG కంటే హై రేంజ్ లో మిరాయ్.. ఇది లెక్క!
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఇప్పటి వరకూ వచ్చిన ప్రతి అప్‌డేట్ అభిమానుల్లో పెద్ద ఎత్తున బజ్ క్రియేట్ చేసింది.;
టాలీవుడ్ లో పాన్ ఇండియా రేంజ్ కు చేరుకోవాలని తహతహలాడుతున్న సినిమాల్లో ఒకటి మిరాయ్. హనుమాన్ బ్లాక్‌బస్టర్ తో తేజా సజ్జా స్థాయి పెరిగిన తర్వాత, నటిస్తున్న ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామా పై అంచనాలు ఆటోమేటిక్‌గా పెరిగిపోయాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఇప్పటి వరకూ వచ్చిన ప్రతి అప్‌డేట్ అభిమానుల్లో పెద్ద ఎత్తున బజ్ క్రియేట్ చేసింది.
మిరాయ్ ప్రీ రిలీజ్ నుంచి టికెట్ సేల్ బజ్ వరకూ అన్నీ పాజిటివ్ వైబ్ లో నడుస్తున్నాయి. కానీ ఈ మధ్యలో మరో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఐఎండీబీ (IMDb)లో మిరాయ్ నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతూ సంచలనం సృష్టించింది. దీన్ని బట్టి పాన్ ఇండియా రేంజ్ లో సినిమా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఓజీ రెండో స్థానంలో ఉండటం మరింత చర్చనీయాంశంగా మారింది.
ఇండస్ట్రీలోని ట్రేడ్ వర్గాలు కూడా ఈ ట్రెండింగ్ ను పాజిటివ్‌గా విశ్లేషిస్తున్నాయి. సాధారణంగా IMDb లో ఆడియన్స్ ఓటింగ్ ఆధారంగా టాప్ లిస్టు ఏర్పడుతుంది. అటువంటి చోట మిరాయ్ మొదటి స్థానంలో ఉండటం సినిమా మీద ఉన్న అంచనాలను మల్టిప్లై చేసింది. పవన్ హీరోగా ఓజీ లాంటి పవర్‌ఫుల్ ప్రాజెక్ట్ ను వెనక్కి నెట్టి ముందుకు రావడం చిన్న విషయం కాదు. తేజా సజ్జా యూత్ కనెక్ట్, ట్రైలర్ విజువల్స్ ఇచ్చిన ఇంపాక్ట్ అన్నీ కలిసి ఈ రేంజ్ కి తీసుకొచ్చాయి.
ప్రొడ్యూసర్స్ స్మార్ట్‌గా ప్లాన్ చేసిన డిస్ట్రిబ్యూషన్, నాన్ థియేట్రికల్ రైట్స్ సేల్ కూడా అదనంగా బూస్ట్ ఇచ్చాయి. రూ.60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ.45 కోట్లు వసూలు చేసి, విడుదలకు ముందే రూ.20 కోట్ల టేబుల్ ప్రాఫిట్ దక్కించుకోవడం ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశమైంది. ఇటువంటి విజయాలు ఇప్పుడు అరుదుగా కనిపిస్తున్నాయి.
ఇక టీజర్స్, పోస్టర్స్ ద్వారా చూపించిన ఫాంటసీ యూనివర్స్ ఆడియన్స్ లో కొత్త అనుభూతి కలిగిస్తోంది. విజువల్స్, టెక్నికల్ గ్రాండియర్, యాక్షన్ సీన్స్ అన్నీ పాన్ ఇండియా లెవెల్ కి సరిపోయేలా ఉన్నాయి. దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని విజువల్స్ కి స్పెషల్ అట్రాక్షన్ క్రియేట్ చేశారు. మల్టీ లాంగ్వేజ్ ప్రమోషన్స్ కూడా బలంగా నడుస్తున్నాయి. మొత్తానికి, IMDbలో నెంబర్ వన్ ప్లేస్ సాధించడం మిరాయ్ కు కలిసొచ్చింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నకొద్దీ మరింతగా క్రేజ్ పెరుగుతోంది. ఇక ఈ క్రేజ్ బాక్సాఫీస్ వద్ద ఎలా కాష్ అవుతుందో, ఓజీతో కలిపి సెప్టెంబర్ నెలలో ఏ రేంజ్ లో హంగామా జరుగుతుందో చూడాలి.