తేజ సజ్జా మిరాయ్.. సూపర్ అప్డేట్..!
యువ హీరో తేజా సజ్జ కెరీర్ ని చాలా బాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. అతను చేస్తున్న సినిమాలు వాటి ఫలితాలు అతనికి మంచి పాపులారిటీ తెచ్చేలా చేస్తున్నాయి.;
యువ హీరో తేజా సజ్జ కెరీర్ ని చాలా బాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. అతను చేస్తున్న సినిమాలు వాటి ఫలితాలు అతనికి మంచి పాపులారిటీ తెచ్చేలా చేస్తున్నాయి. తేజా సజ్జా హనుమాన్ సినిమా పాన్ ఇండియా హిట్ అందుకుంది. ఆ సినిమాతో అతను నేషనల్ లెవెల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఐతే ఇక నెక్స్ట్ సినిమాలను కూడా అదే రేంజ్ లో ఉండేలా చూస్తున్నాడు తేజా. ప్రస్తుతం అతను కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో మిరాయ్ సినిమా చేస్తున్నాడు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాలో ప్రతినాయకుడిగా మంచు హీరో మనోజ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అసలైతే ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని అనుకున్న ఈ సినిమా సెప్టెంబర్ కి వాయిదా వేశారు మేకర్స్. ప్రస్తుతం మిరాయ్ సినిమా రామోజి ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. అక్కడ భారీ యాక్షన్ సీన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
అంతేకాదు నెక్స్ట్ వీక్ ఒక సాంగ్ షూట్ చేస్తారట. సినిమాకు కీలకమైన అంశాలు ఈ షెడ్యూల్ లో షూట్ చేస్తున్నారట. ఇక మిరాయ్ సినిమాను ఫైనల్ గా సెప్టెంబర్ 5న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. నెక్స్ట్ రిలీజ్ చేసే ప్రమోషనల్ టీజర్ లో రిలీజ్ అప్డేట్ కూడా ఉంటుందని తెలుస్తుంది.
ఐతే ఆల్రెడీ సెప్టెంబర్ 5కి అనుష్క ఘాటి, రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఐతే ఇప్పుడు ఆ డేట్ కి తేజా సజ్జ మిరాయ్ కూడా రిలీజ్ అంటూ చెబుతున్నారు. తేజా సజ్జా మిరాయ్ సినిమా కూడా ఒక డిఫరెంట్ కథతో వస్తుంది. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మిరాయ్ సినిమా కథ ఏంటి అన్నది క్లూ ఇస్తూ వదిలిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.
కార్తీక్ ఘట్టమనేని ఈసారి ఒక అద్భుతమైన స్టోరీతో విజువల్ ట్రీట్ ఇచ్చేలా సినిమా చేస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో తేజ సజ్జ, మనోజ్ ల సీన్స్ కూడా క్రేజీగా ఉంటాయని అంటున్నారు. మిరాయ్ సినిమా టీజర్ తోనే సూపర్ బజ్ ఏర్పరచుకోగా రాబోతున్న ప్రమోషనల్ కంటెంట్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుందని అంటున్నారు.