తేజా సజ్జా.. క్లాష్ లేకుండా ఓజితో పాజిటివ్ క్రేజ్!
టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా తన కెరీర్‌ను కొత్త రేంజ్‌లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.;
టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా తన కెరీర్‌ను కొత్త రేంజ్‌లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే హనుమాన్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్న అతను, ఇప్పుడు మరో ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ మిరాయ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా కోసం హార్డ్ వర్క్ చేసిన మేకర్స్ అంతే గ్రాండ్‌గా ప్రమోషన్స్ చేస్తూ అంచనాలను పెంచుతున్నారు.
ఇటీవల మిరాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను బెంగళూరులో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాండల్‌వుడ్ యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వర్షం పడుతున్నప్పటికీ అక్కడికి విచ్చేసిన అభిమానుల రెస్పాన్స్ తేజాను చాలా ఇంప్రెస్ చేసింది. ఆయన తన స్పీచ్‌లో ప్రత్యేకంగా ధ్రువ సర్జాకు ధన్యవాదాలు తెలిపారు. హనుమాన్ సినిమాకు కూడా ధ్రువ సర్జా సపోర్ట్ చేసిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ పాజిటివ్ గా స్పందించాడు.
ఇక ఈవెంట్‌లో తేజా చేసిన కొన్ని కామేంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. “మిరాయ్ సెప్టెంబర్ 12న థియేటర్స్‌లోకి రానుంది. మొదటి నుంచి చివరి వరకూ ఒక కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లే ఫాంటసీ అడ్వెంచర్ ఇది. ప్రతి వయసు వర్గానికి నచ్చేలా సినిమా ఉంటుంది. క్లీన్ గా ఎంటర్టైన్ చేస్తుంది” అని అన్నారు. అదే సమయంలో తేజా సజ్జా, “మిరాయ్ చూసిన తర్వాత మనందరం కలిసి పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీని కూడా చూద్దాం. ఆ సినిమా కోసం నేనూ చాలా ఎగ్జైటెడ్‌గా ఎదురు చూస్తున్నాను” అని చెప్పడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
పవన్ కళ్యాణ్ ఓజీపై ఆడియన్స్‌లో హైప్ హై రేంజ్ లో ఉంది. అదే నెలలో విడుదల అవుతున్న మిరాయ్ కు కాస్త క్రేజ్ తగ్గుతుందేమో అని చాలామంది భావించారు. అయితే తేజా సజ్జా మాటలు రెండు సినిమాలకూ పాజిటివ్ వైబ్‌ని క్రియేట్ చేశాయి. ఏ క్లాష్ లేకుండా, సినిమాలు ఒకదానికొకటి సపోర్ట్ చేసుకునేలా ఉండటమే ఈ కామెంట్ల ప్రత్యేకత. దీంతో పవన్ ఫ్యాన్స్ కూడా తేజాపై మంచి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ధ్రువ సర్జా కూడా ఈ ఈవెంట్‌లో తేజాకు శుభాకాంక్షలు తెలియజేశారు. “తేజా సజ్జా, మొత్తం మిరాయ్ టీమ్‌కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సినిమా కూడా హనుమాన్ లాగా బిగ్ సక్సెస్ కావాలి” అని ఆశీర్వదించారు. ఆయన ప్రెజెన్స్, సపోర్ట్ బెంగళూరు ఆడియన్స్‌లో పాజిటివ్ వైబ్‌ని క్రియేట్ చేసింది. మొత్తానికి, మిరాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తేజా సజ్జా చెప్పిన పవన్ కళ్యాణ్ ఓజీ గురించి మాటలు ఇప్పుడు రెండు సినిమాల చుట్టూ హైప్ పెంచుతున్నాయి. సెప్టెంబర్ 12న మిరాయ్ విడుదలైతే, సెప్టెంబర్ 25న ఓజీ థియేటర్స్‌లోకి వస్తుంది. ఇరువైపులా ఉన్న పాజిటివ్ బజ్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులకే దారితీస్తుందని ట్రేడ్ టాక్ వినిపిస్తోంది.