బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ ఆ ముగ్గురితో రిస్క్ చేస్తున్నాడా?

ఈ నేప‌థ్యంలో వీరి ముగ్గురినీ ఈ వెబ్ సిరీస్ లోకి తీసుకుని సిద్ధార్థ్ రాయ్ క‌పూర్ రిస్క్ చేస్తున్నాడ‌నే చెప్పాలి.;

Update: 2025-05-22 20:30 GMT
బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ ఆ ముగ్గురితో రిస్క్ చేస్తున్నాడా?

పావైల్ గులాటి, సిద్ధాంత్ గుప్తా, ఫాతిమా స‌నా షేక్ మొద‌టిసారి ఓ వెబ్‌సిరీస్ లో క‌లిసి న‌టించ‌నున్నారు. తీన్ కావే టైటిల్ తో తెర‌కెక్క‌నున్న ఈ సిరీస్ ను సిద్ధార్థ్ రాయ్ క‌పూర్ నిర్మిస్తున్నాడు. కామెడీ వెబ్‌సిరీస్ గా తెర‌కెక్క‌నున్న ఈ సిరీస్ ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉంది. మొద‌టిసారి ఈ ముగ్గురి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సిరీస్ త‌ప్ప‌కుండా ఆడియ‌న్స్ ను ఆక‌ట్టుకుంటుంద‌ని మేక‌ర్స్ చెప్తున్నారు.

కానీ ఈ సిరీస్ ఓటీటీలో రిలీజ‌య్యాక ఆశించిన ఫ‌లితాల్ని అందుకుంటుందా అనేదే ఇప్పుడు అనుమానంగా మారింది. దానికి కార‌ణాలు లేక‌పోలేదు. తీన్ కావే లో న‌టిస్తున్న పావైల్ గులాటి, సిద్దాంత్ గుప్తా, ఫాతిమా స‌నా ముగ్గురూ ఫేమ్ లో లేరు. పావైల్ గులాటి యాక్ట‌ర్ గా ఇప్ప‌టికే త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న‌ప్ప‌టికీ త‌న నుంచి వ‌చ్చిన ఆఖ‌రి మూడు సినిమాలూ ఐ ల‌వ్ యు, దేవా, కౌశ‌ల్ జీస్ వ‌ర్సెస్ కౌశ‌ల్ ఆడియ‌న్స్ ను ఆక‌ట్టుకోలేకపోయాయి.

ఇక సిద్ధాంత్ గుప్తా నుంచి వ‌చ్చిన ఆప‌రేష‌న్ రోమియో, బ్లాక్ వారెంట్ కూడా పెద్ద‌గా మ్యాజిక్ చేయ‌లేకపోయాయి. ఇక మిగిలింది ఫాతిమా స‌నా. దంగ‌ల్ సినిమాలో అద్భుత‌మైన న‌ట‌న క‌న‌బ‌రిచి ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫాతిమా ఆ సినిమాతో బాక్సాఫీస్ వ‌ద్ద రూ.2000 కోట్లు క‌లెక్ట్ చేసిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత ఆమె నుంచి వ‌చ్చిన సినిమాలేవీ అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయాయి. ఫాతిమా స‌నా ఇందిరా గాంధీగా క‌నిపించిన సామ్ బ‌హ‌దూర్ సినిమా కూడా ఆడియ‌న్స్ ను మెప్పించ‌లేక‌పోయింది.

ఈ నేప‌థ్యంలో వీరి ముగ్గురినీ ఈ వెబ్ సిరీస్ లోకి తీసుకుని సిద్ధార్థ్ రాయ్ క‌పూర్ రిస్క్ చేస్తున్నాడ‌నే చెప్పాలి. ఎందుకంటే గ‌త కొన్ని వారాలుగా ఓటీటీలో వ‌చ్చిన ది రాయ‌ల్స్, కుల్ లాంటి ఎన్నో వెబ్ సిరీస్ లు మంచి కంటెంట్ లేక రాంగ్ క్యాస్టింగ్ తో ఆడియ‌న్స్ నుంచి విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నాయి. అయితే ఈ సిరీస్ విష‌యంలో అంద‌రికీ ఉన్న ఆశ ఏంటంటే సిద్ధార్థ్ రాయ్ క‌పూర్ నుంచి వ‌చ్చిన ఆఖ‌రి రెండు సిరీస్‌లు అర‌ణ్య‌క్, రాకెట్ బాయ్స్ ఆడియ‌న్స్ ను మెప్పించ‌గ‌లిగాయి. కాబ‌ట్టి ఇప్పుడు ఈ సిరీస్ కూడా సిద్ధార్థ్ మంచి డైరెక్ట‌ర్ చేతిలో పెడితే వ‌ర్క‌వుట్ అయ్యే ఛాన్సుంది. ఈ నేప‌థ్యంలో టీన్ కావే సిద్ధార్థ్ రాయ్ క‌పూర్ కు ఎలాంటి ఫ‌లితాన్నిస్తుందో చూడాలి మ‌రి.

Tags:    

Similar News