• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దేవర విజయం.. వారి కోసం...

దేవర విజయం.. వారి కోసం ఎన్టీఆర్ థాంక్స్ లెటర్

| దేవర 1 - బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దసరా సెలవులు కూడా ఈ సినిమాకు హెల్ప్ అయ్యాయి

By - Tupaki Desk
Update: 2024-10-15 10:34 GMT

దేవర 1 - బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దసరా సెలవులు కూడా ఈ సినిమాకు హెల్ప్ అయ్యాయి. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావడంతో ఎన్టీఆర్ కెరీర్ లో ఒక బిగ్ రికార్డ్ నమోదైంది. ఇక ఈ సినిమా విజయం పట్ల చిత్ర యూనిట్ కూడా ఎంతో సంతోషంగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఓపెన్ గా ఒక లెటర్ విడుదల చేశారు. అందులో చిత్ర యూనిట్ కి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ, ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఎన్టీఆర్ ఈ విధంగా వివరణ ఇస్తూ.. "దేవర పార్ట్ 1'కి అందుతున్న అద్భుతమైన స్పందనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమా ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. నా సహ నటులైన సైఫ్ అలీ ఖాన్ సర్, జాన్వీ, ప్రకాష్ రాజ్ గారు, శ్రీకాంత్ గారు మరియు ఇతర నటీనటులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారు తమ పాత్రలకు ప్రాణం పోసి, మా కథకు జీవం ఇచ్చారు" అని అన్నారు.

"అలాగే నా దర్శకుడు కొరటాల శివ గారికి ధన్యవాదాలు. ఈ కథను సృష్టించిన ఆయన దిశానిర్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ విజయవంతమైంది. అనిరుధ్ అద్భుతమైన సంగీతం, రత్నవేలు సర్ సినిమాటోగ్రఫి, సాబు సర్ ప్రొడక్షన్ డిజైన్, యుగంధర్ గారు వీఎఫ్ఎక్స్, శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటింగ్ తో ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచినందుకు ధన్యవాదాలు. మా సినిమాను విజయవంతంగా ప్రదర్శించిన పంపిణీదారులు మరియు థియేటర్ ప్రదర్శకులకు ధన్యవాదాలు" అని తారక్ తెలిపారు

"ఇక నా సినీ పరిశ్రమ మిత్రులకు, వారు అందించిన ప్రేమకు ధన్యవాదాలు. అలాగే, దేశవ్యాప్తంగా ఉన్న మీడియాకు మా సినిమాను విశేషంగా ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు. మా నిర్మాతలు సుధాకర్ మిక్కిలినేని గారు మరియు హరికృష్ణ కొసరాజు గారికి ఈ ప్రాజెక్టున్ను విజయవంతంగా రూపొందించినందుకు ధన్యవాదాలు. ప్రపంచ నలుమూలల ఇంతటి ఆదరణ చూపిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు నా ధన్యవాదాలు.

నా కుటుంబ సభ్యులైన నా అభిమానులందరికీ, గత నెల రోజులుగా దేవర చిత్రాన్ని ఒక పండుగలా జరుపుకుంటున్నందుకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు చూపించే ప్రేమ అభిమానమే నన్ను ఈ స్థాయికి చేర్చింది. మీరు ఎలప్పుడు గర్వపడే చిత్రాలు చేస్తూనే ఉండడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. 'దేవర పార్ట్ 1' చిత్రాన్ని మీ భుజాలపై మోసి, ఇంతటి ఘనవిజయవంతంగా మార్చినందుకు కృతజ్ఞతలు" అంటూ జూనియర్ ఎన్టీఆర్ తన సంతోషాన్ని ఈ విధంగా షేర్ చేసుకున్నారు.

Grateful. pic.twitter.com/YDfLplET7S

— Jr NTR (@tarak9999) October 15, 2024
Tags:    
  • NTR 
  • Devarasuccess 
  • Koratalasiva 
  • Janhvikapoor 
  • Devaramovie 
  • Devara 
  • Devaracast 
  • Saifalikhan 
  • Srikanth 
  • Prakashraj 

Similar News

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

Copyright @2026

Powered by Blink CMS