బిగ్ బాస్ హౌస్ లోకి మహా కుంభమేళా వైరల్ బ్యూటీ!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతున్నారో అర్థం అవ్వడం లేదు.;
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతున్నారో అర్థం అవ్వడం లేదు. ఇప్పటివరకు మామూలుగా మన మధ్యలో తిరిగిన వారే రాత్రికి రాత్రే ఫేమస్ అవుతున్నారు. అలా ఎవరు ఎప్పుడు ఫేమస్ అవుతారో ఊహించలేం. అలా సోషల్ మీడియా ద్వారా కుంభమేళా జరిగిన సమయంలో చాలామంది ఫేమస్ అయ్యారు.లేడీ సన్యాసిని, పూసలు అమ్ముకునే మోనాలిసా ఇలా ఎంతో మంది ఫేమస్ అయ్యారు. అయితే కుంభమేళా తొక్కిసలాట సమయంలో ఓ అమ్మాయి చాలా ఫేమస్ అయింది. తొక్కిసలాటలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు అంటూ మీడియా ముందు ఏడ్చి వైరల్ అయింది. ఆమె ఎవరో కాదు తాన్యా మిట్టల్.. అలా ఒకే ఒక్క వీడియోతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన తాన్యా మిట్టల్ తాజాగా బిగ్ బాస్ 19లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది.. మరి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తాన్యా మిట్టల్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఆమె ఏం చేస్తుంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
బిగ్ బాస్ హౌస్ లోకి మహా కుంభమేళా వైరల్ బ్యూటీ..
సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్న హిందీ బిగ్ బాస్ సీజన్ 19 లో మహాకుంభమేళ ద్వారా ఫేమస్ అయిన తాన్యా మిట్టల్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇన్స్టాలో 2.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న తాన్యా మిట్టల్ కి సోషల్ మీడియాలో చాలా పాపులారిటీ ఉంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ లోకి రావడంతో చాలామంది ఆమె అభిమానులు కప్పు గెలవాలని కోరుకుంటున్నారు. ఇక మరికొంతమందేమో తాన్యా మిట్టల్ ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అని సెర్చ్ చేస్తున్నారు.
తాన్యా మిట్టల్ బ్యాక్ గ్రౌండ్..
మరి తాన్యా మిట్టల్ బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. తాన్యా మిట్టల్ చండీగఢ్ లోని గ్వాలియర్ లో పుట్టి పెరిగింది.ఉన్నత చదువులు చదివి సొంతంగా హ్యాండ్ మేడ్ లవ్ అనే సంస్థను కూడా స్థాపించింది. అలాంటి ఈ ముద్దుగుమ్మ మహిళల సాధికారత, విద్య, ఆరోగ్యం కోసం ఎప్పుడు ఆలోచిస్తుంది. ఇక ఈమె కేవలం హ్యాండ్ మేడ్ విత్ లవ్ బై తాన్యా అనే బ్రాండ్ ని స్థాపించడమే కాదు మోడలింగ్ రంగంలో రాణించి 2018లో మిస్ ఆసియా టైటిల్ ని కూడా గెలుచుకుంది.అలా అందాల పోటీలలో కూడా తాన్యా మిట్టల్ రాణించిందని చెప్పుకోవచ్చు.
మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా గుర్తింపు..
అలాంటి తాన్యా మిట్టల్ గురించి మరికొన్ని విషయాలు చూస్తే..ఆమె మల్టీ టాలెంటెడ్..ఎందుకంటే ఓవైపు హ్యాండ్ మేడ్ విత్ లవ్ బై తాన్యా అనే బ్రాండ్ ని స్థాపించడమే కాకుండా మరోవైపు పాడ్ కాస్టర్ గా..మోడల్ గా.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా అన్ని రంగాల్లో కూడా రాణిస్తోంది. ఇక తన బ్రాండ్ ద్వారా హ్యాండ్ కఫ్ లు, హ్యాండ్ బ్యాగులు, చీరలు వంటివి తయారు చేస్తుంది..
మిస్ ఆసియా టూరిజం యూనివర్సిటీ కిరీటం..
ఇక మోడలింగ్ రంగం విషయానికి వస్తే.. తాన్యా మిట్టల్ భారతదేశం తరఫున లెబనాన్ లో జరిగిన మిస్ ఆసియా టూరిజం యూనివర్సిటీ పోటీలలో పాల్గొని మిస్ ఆసియా టూరిజం కిరీటం కూడా గెలుచుకుంది.. అలాంటి తాన్యా ఈ ఏడాది జరిగిన మహా కుంభమేళా సందర్భంగా దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. ఎందుకంటే మౌని అమావాస్య రోజు మహా కుంభమేళలో ఒక విషాదకరమైన సంఘటన జరిగింది.
భారీ తొక్కిసలాటలో ఎంతోమంది ప్రాణాలు విడిచారు. అయితే ఈ భయంకరమైన సంఘటనను తల్చుకొని తాన్యా మిట్టల్ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకొని మాట్లాడిన వీడియో క్షణాల్లో వైరల్ అవ్వడంతో తాన్యా మిట్టల్ ఓవర్ నైట్ లో ఫేమస్ అయిపోయింది. అంతేకాదు మహా కుంభమేళలో చనిపోయిన ఎంతోమందికి సహకారం ఇవ్వడమే కాకుండా ఆహారం, నీళ్లు వంటివి అందించి సహాయం చేసింది.. అయితే ఆ రోజు తాన్యా మిట్టల్ చేసిన పనికి చాలామంది విమర్శించారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసమే దొంగ కన్నీళ్లు పెట్టుకుందని నెగిటివ్ కామెంట్లు చేశారు. అయితే అలాంటి తాన్యా మిట్టల్ ప్రస్తుతం హిందీ బిగ్ బాస్ సీజన్ 19 లో కంటెస్టెంట్ గా పాల్గొంది.ఇక సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న తాన్యా మిట్టల్ ని ప్రేక్షకులు ఏ మేర ఆదరిస్తారో చూడాలి