వాళ్లిద్దరి బ్రేకప్ కి కారణం డామినేషన్!
తమన్నా-విజయ్ వర్మ లకు బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే. ప్రేమికులుగా మొదలైన ప్రయాణం పెళ్లి పీఠల వరకూ వెళ్తుందనుకునే లోపే వీగిపోయింది.;
తమన్నా-విజయ్ వర్మ లకు బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే. ప్రేమికులుగా మొదలైన ప్రయాణం పెళ్లి పీఠల వరకూ వెళ్తుందనుకునే లోపే వీగిపోయింది. ఆ తర్వాత ఎవరి ప్రయాణం వారిది. ఇద్దరు సినిమా లతో బిజీ అయ్యారు. మరి ఈ జంట విడిపోవడానికి కారణం ఏంటి? అన్నది ఇంత వరకూ బయటకు రాలే దు. సహజంగా ఇలాంటి విషయాలు బయటకు రావు. భార్యాభర్తలు విడిపోవడానికి గల కారణాలైన బయట కు వస్తాయేమో గానీ ప్రేమికులు విడిపోతే మాత్రం గొప్ప రహస్యంగా ఉంటుంది.
ఏ ఒక్కరు బ్రేకప్ పై స్పందిం చడానికి అంగీకరించరు. వ్యక్తిగత విషయమంటూ ఎవరికి వారు తప్పుకుం టారు. తాజాగా తమన్నా బ్రేకప్ విషయం ఒకటి నెట్టింట లీకైంది. అదీ తమన్నా మాటల్లోనే. తాను కూడా డైరెక్టర్ గా విషయాన్ని చెప్పకుండా పరోక్షంగా చెప్పకనే చెప్పింది. తమన్నా మీద విజయ్ వర్మ డామినేషన్ చేసినట్లు ఆమె మాటల్లో బయట పడిందంటూ ఓ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. డామినే షన్ కు సంబంధించి తమన్నా ఎంత చెప్పినా విజయ్ వర్మ వినేవాడు కాదని, ఆ కారణంగా కొంత కాలం మార్పుకోసం ఎదురు చూసి తమన్నా దూరమైనట్లు వార్తలొస్తున్నాయి.
మహిళను సమాజంలో చులకన భావంతో చూసినంత కాలం ఈ రకమైన ఆధిపత్య ధోరణికి గురికావా ల్సిం దే అన్నారు. మహిళలకు అన్నింటా సమాన హోదా కల్పించాలంటే కొంత మంది అభద్రతా భావాన్ని కలిగి ఉంటారన్నారు. అలాంటి వాళ్లు హిళల మనోభావాలను పూర్తిగా అర్దం చేసుకోలేకపోయినా? కనీసం ప్రయత్నమైనా చేయానలన్నారు. అదే ఓ మహిళ పురుషుడి కి ఎదురు తిరిగితే ఎలా ఉంటుందన్నది? కూడా కొందరు గ్రహించాలన్నారు. ఈ వ్యాఖ్యలు తమన్నా? విజయ్ వర్మని ఉద్దేశించే చేసిందం టున్నారు.
మరి వీటిపై విజయ్ రియాక్షన్ ఉంటుందా? అన్నది చూడాలి. ప్రస్తుతం తమన్నా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. 'రోమియో','రేంజర్', 'రోహిత్ శెట్టి సినిమా షూటింగ్ ల్లో పాల్గొంటుంది. ఇటీవలే రిలీజ్ అయిన 'రైడ్ 2'లో స్పెషల్ అప్పిరియన్స్ తో అలరించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో బాలీవుడ్ లో కొత్త అవకాశాలు పెరిగాయి. తెలుగులో చివరిగా 'ఓదెల 2' తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా అంచనాల మధ్య విడుదలైన వాటిని అందుకోవడంలో విఫలమైంది.