ఆ విషయంలోనూ హీరోలకు పోటీగా తమన్నా
పైగా తమన్నా ఎప్పుడూ ఏదో ఒక కారణం చేత వార్తల్లో ఉండటం వల్ల ఆమె గురించి అభిమానులు ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉన్నారు.;
మిల్కీ బ్యూటీ తమన్నా సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతోంది. దశాబ్దంకు పైగా స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో వెలుగు వెలిగిన తమన్నా ఇప్పుడు కాస్త ప్రాధాన్యత తక్కువ ఉన్న పాత్రలు చేస్తూ, సీనియర్ హీరోల సినిమాల్లో పెద్దగా ప్రాముఖ్యత లేని సినిమాలు చేయడం మనం చూస్తున్నాం. తమన్నా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు, కానీ ఆమె వయసు పెరగడం వల్ల ఆఫర్లు తగ్గుతూ వచ్చాయి. అందం విషయంలో మునుపటితో పోల్చితే ఏమాత్రం తగ్గని కారణంగా సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసే అందాల ఆరబోత ఫోటోలకు మంచి స్పందన ఉంటుంది. పైగా తమన్నా ఎప్పుడూ ఏదో ఒక కారణం చేత వార్తల్లో ఉండటం వల్ల ఆమె గురించి అభిమానులు ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉన్నారు.
తమన్నా కొత్త వ్యాపారంకు ఏర్పాట్లు
సినిమాల్లో ఆఫర్లు తగ్గడంతో తమన్నా వ్యాపారంలో అడుగు పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు ఒక వైపు నటిస్తూనే మరోవైపు వ్యాపారంలో అడుగు పెడుతున్నారు. రెండు పడవల ప్రయాణం అన్నట్టుగా కాకుండా వ్యాపారాల్లో కేవలం పెట్టుబడి వరకు పరిమితం అవుతున్నారు. సన్నిహితులతో ఆ వ్యాపారాలు రన్ చేయిస్తున్నారు. టాలీవుడ్‌లో ఉన్న దాదాపు అందరు హీరోలకు ఏదో రకమైన వ్యాపారం లేదా వ్యాపారాలు ఉన్న విషయం తెల్సిందే. కొందరు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. హీరోలకు ఏమాత్రం తగ్గకుండా తమన్నా సైతం వ్యాపారం చేసేందుకు రెడీ అయిందని వార్తలు వస్తున్నాయి.
జ్యూవెలరీ వ్యాపారంలో తమన్నా ఫ్యామిలీ
ఇప్పటికే తమన్నా ఫ్యామిలీ జ్యూవెలరీ కి సంబంధించిన వ్యాపారం లో ఉంది. తమన్నా బ్రాండ్ ఇమేజ్ కారణంగా ఆ వ్యాపారం బాగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు తమన్నా సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఆ వ్యాపారం ఏంటి అనే విషయంలో క్లారిటీ లేదు. కానీ అందుకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమన్నా ఏ వ్యాపారం లో అడుగు పెట్టినా ఖచ్చితంగా విజయాన్ని సొంతం చేసుకుంటుంది. కనుక ఆమె ముందు ముందు ఏ వ్యాపారాలు చేయబోతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తోటి హీరోయిన్స్ కొందరు నిర్మాణం వైపు అడుగులు వేస్తున్న నేపథ్యంలో తమన్నా భవిష్యత్తులో ఆ పని కూడా చేసే అవకాశాలు ఉన్నాయి.
క్రికెటర్‌తో తమన్నా పెళ్లి పుకార్లకు క్లారిటీ
ఇక తమన్నా ఒక పాకిస్తానీ క్రికెటర్‌తో ప్రేమలో ఉందని, పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయనే వార్తలు వచ్చాయి. తాజాగా ఆ విషయమై మిల్కీ బ్యూటీ క్లారిటీ ఇచ్చింది. తాజా ఇంటర్వ్యూలో తమన్నా పెళ్లి వార్తలపై స్పందించింది. త్వరలో పాకిస్తానీ క్రికెటర్‌తో పెళ్లి అంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అంది. పుకార్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రావడం ఆశ్చర్యంగా ఉందని, తనకు అలాంటి ఆలోచన లేదని, ప్రస్తుతం తాను సింగిల్ అని క్లారిటీ ఇచ్చింది. మిల్కీ బ్యూటీ పెళ్లి గురించి గతంలోనూ పుకార్లు షికార్లు చేశాయి.
ఆ మధ్య నటుడు విజయ్ వర్మతో రిలేషన్‌లో కొనసాగిన మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు అతడికి పూర్తి దూరంగా ఉంది. ఇద్దరి మధ్య కొన్ని విభేదాల కారణంగా బ్రేకప్ అయ్యారు. ఇప్పటి వరకు బ్రేకప్ గురించి ఇద్దరి నుంచి బాహాటంగా ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ ఇద్దరూ విడిపోయారు అనేది మాత్రం వాస్తవం అని వారి సన్నిహితులు స్వయంగా ప్రకటించారు. తమన్నా ఈ మధ్య కాలంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లోనూ నటిస్తోంది. ప్రధానంగా ఐటెం సాంగ్స్‌లో తమన్నాను ఎక్కువగా చూస్తూ ఉన్నాం. త్వరలో మరిన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తమన్నా కనిపించే అవకాశాలు ఉన్నాయి.