గ్లామర్ ఇమేజ్‌ను బ్రేక్ చేయాలని చూస్తున్న తమన్నా!

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న తమన్నా ఇప్పుడు కెరీర్‌లో మరో కీలక దశను ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది.

Update: 2026-08-18 15:30 GMT

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న తమన్నా ఇప్పుడు కెరీర్‌లో మరో కీలక దశను ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. దాదాపు రెండు దశాబ్దాలుగా హీరోయిన్‌గా కొనసాగుతున్న ఆమె కెరీర్‌లో గ్లామర్, కమర్షియల్ సినిమాలు, స్పెషల్ సాంగ్స్ ఒకవైపు గుర్తింపును తీసుకొస్తే.. మరోవైపు అదే ఇమేజ్ ఇప్పుడు కొత్త తరహా పాత్రలకు అడ్డంకిగా మారుతోందా అనే డిస్క‌ష‌న్ మొదలైంది. ఈ నేపథ్యంలో తనకు వచ్చే పాత్రల విషయంలో తమన్నా ఆలోచనా విధానం మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో తమన్నా కొన్ని ప‌ర్స‌న‌ల్ లిమిట్స్ ను చాలా క్లియ‌ర్ గా ఫాలో అయ్యారు. ముఖ్యంగా కిస్ సీన్స్ కు దూరంగా ఉండే హీరోయిన్‌గా ఆమెకు ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది. అయితే కాలక్రమంలో సినిమాల స్వభావం, కథ చెప్పే విధానం మారడంతో ఆమె కూడా తన డెసిష‌న్స్ లో మార్పులు చేసుకున్నారు. లస్ట్ స్టోరీస్ వంటి ప్రాజెక్ట్ ద్వారా తెరపై మరింత బోల్డ్‌గా కనిపించేందుకు సిద్ధమైన తమన్నా.. ఆ తర్వాత గ్లామర్‌కు సంబంధించిన అవకాశాల్లోనూ తన మార్కెట్‌ను విస్తరించుకున్నారు.

ముఖ్యంగా స్పెష‌ల్ సాంగ్స్ తో ఆమెకు మరో రకమైన క్రేజ్ వచ్చింది. స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ అప్పియరెన్స్‌లు, స్పెషల్ సాంగ్స్ తమన్నాకు భారీ గుర్తింపును తీసుకొచ్చాయి. అయితే ఇక్కడే మరో సమస్య మొదలైందని చెప్పొచ్చు. ఒక హీరోయిన్ కు వచ్చిన గ్లామర్ ఇమేజ్ ఎక్కువకాలం కంటిన్యూ అయితే, అదే తరహా పాత్రలకు మాత్రమే ఆఫర్లు పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. తమన్నా విషయంలోనూ ఇప్పుడు ఇదే ప్రశ్న తెరపైకి వస్తోంది. మరోవైపు తెలుగులో ఆమెకు గతంలో ఉన్నంత స్థాయిలో అవకాశాలు కనిపించడం లేదు. వరుసగా వస్తున్న న్యూ ఏజ్ హీరోయిన్స్, మారుతున్న కథలు, వయసుకు తగ్గ పాత్రల కొరత.. ఇవన్నీ కలిసి టాలీవుడ్‌లో తమన్నా స్పేస్‌ను కొంత తగ్గించాయని చెప్పొచ్చు. దీంతో ప్రస్తుతం ఆమె బాలీవుడ్ ప్రాజెక్టులపై ఎక్కువగా దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది.

అయితే ఈసారి తమన్నా టార్గెట్ కేవలం ఎక్కువ సినిమాలు చేయడం కాదనే సంకేతాలు ఇస్తున్నారు. పాత్రకు అవసరమైతే రొమాంటిక్ సీన్స్ లో నటించడాన్ని తప్పుగా చూడాల్సిన అవసరం లేదని ఆమె భావిస్తున్నారు. అదే టైమ్ లో ఒక సీన్ ఆధారంగా నటి పాత్ర‌ను అంచనా వేయకూడదనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే.. తెరపై కనిపించే గ్లామర్ కంటే పాత్రలోని బలం, కథలో తన ప్రాధాన్యత తనకు ముఖ్యమని త‌మ‌న్నా తెలియ‌చేయ‌స్తున్నారు.

ఇదే సమయంలో స్పెషల్ సాంగ్స్‌కు మాత్రమే పరిమితం కాకుండా విభిన్నమైన, నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేయాలనే ఆసక్తి కూడా తమన్నాలో పెరిగినట్టు కనిపిస్తోంది. అందుకే ప్రస్తుతం ఆమె కెరీర్‌ను మరోసారి రీసెట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారా అనే ఆసక్తి నెలకొంది. గ్లామర్ హీరోయిన్‌గా వచ్చిన గుర్తింపును వదిలేయడం కాదు.. దాన్ని దాటి ఒక నటిగా కొత్త గుర్తింపు తెచ్చుకోవడమే తమన్నా తదుపరి లక్ష్యమా? రాబోయే సినిమాల్లో ఆమె ఎంచుకునే పాత్రలు దీనికి సమాధానం చెప్పే అవకాశం ఉంది. ఈ మార్పు సక్సెస్ అయితే, తమన్నా కెరీర్‌లో ఇదే మరో కీలకమైన టర్నింగ్ పాయింట్‌గా నిలిచే అవకాశముంది.

Tags:    

Similar News