క్యూట్‌నెస్ రీలోడెడ్.. త్రిథా చౌదరి!
టాలీవుడ్‌లో యువ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల తార త్రిథా చౌదరి.
టాలీవుడ్‌లో యువ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల తార త్రిథా చౌదరి. క్యూట్ లుక్స్‌తో టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ భామ, ఒకప్పుడు స్టార్ హీరోయిన్ త్రిష లేని లోటును భర్తీ చేసేలా ఉందంటూ సోషల్ మీడియాలో అభిమానులు ప్రశంసిస్తున్నారు. కేవలం గ్లామరస్ పాత్రలకే పరిమితం కాకుండా.. వరుస చిత్రాలతో పాటు వైవిధ్యమైన వెబ్ సిరీస్‌ల ద్వారా తన ఇమేజ్‌ను మరింత పెంచుకునే పనిలో పడ్డారు. ప్రయోగాత్మక సిరీస్‌లలో ఈ బ్యూటీ కనబరిచిన అత్యుత్తమ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
మరోవైపు సామాజిక మాధ్యమాలలోను త్రిథా జరంత స్పీడ్ మీద ఉంది. ఇటీవల త్రిథా చౌదరి షేర్ చేసిన ఒక లేటెస్ట్ బ్లూ-థీమ్డ్ అఫీషియల్ గ్లామర్ లుక్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటోగ్రాఫ్ కి ఫ్యాన్స్ నుంచి స్పందనలు అనూహ్యం. ``సీఈవో ఆఫ్ హెర్ వోన్ లిటిల్ యూనివర్శ్`` అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో త్రిథ షేర్ చేసిన ఈ పోస్ట్ కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంటోంది. త్రిథ సోషల్ మీడియా ప్రొఫైల్‌లో కనిపిస్తున్న ఈ స్టైల్, కాన్ఫిడెన్స్ .. ఇండిపెండెంట్ పర్సనాలిటీకి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ పోస్ట్‌కు నెటిజన్లు నుంచి భారీ స్పందన లభించడమే కాక .. కామెంట్ సెక్షన్ అభిమానుల ప్రేమతో నిండిపోయింది.
ఈ బ్యూటీ పోస్ట్‌లపై స్పందిస్తూ ఫ్యాన్స్ తనను `బాస్ లేడీ` అని, `ఫ్రెష్ ఎయిర్ ఫర్ ది సోల్` అని కొనియాడుతున్నారు. కేవలం అందం మాత్రమే కాకుండా తనదైన శైలిలో సానుకూల విషయాలను షేర్ చేస్తూ డిజిటల్ కమ్యూనిటీతో ఎప్పుడూ టచ్‌లో ఉంటున్నారు. తెరపై ఎంత గ్లామర్‌గా కనిపిస్తారో.. నిజ జీవితంలోనూ అంతే పరిణతితో కూడిన ఆలోచనలు, సెల్ఫ్-యాక్సెప్టెన్స్ మ్యాటర్స్ లో యువతకు స్ఫూర్తినిస్తున్నారు. ఆకర్షణీయమైన రూపంతో పాటు చక్కటి వ్యక్తిత్వం త్రిథాను ఇండస్ట్రీలో ప్రత్యేకంగా నిలబెడుతోంది.
ఇక కెరీర్ పరంగా చూస్తే.. 2026లో త్రిథా చౌదరి పలు క్రేజీ ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, బెంగాలీ పరిశ్రమలలో దూసుకుపోతున్న ఈ భామ గతంలో ఆశ్రమ్, బందిష్ బండిట్స్ వంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్‌లతో సంచలనం సృష్టించారు. ఈ ఏడాది (2026)లో నటిస్తున్న పలు చిత్రాలు, వెబ్ ప్రాజెక్ట్‌లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా ట్రెండింగ్ ప్రాజెక్ట్‌లు..మోస్ట్ అవేటెడ్ `ఆశ్రమ్` కొత్త సీజన్ షూటింగ్ విశేషాలతో త్రిథా పేరు మరోసారి సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
వెండితెరపై తన అభినయంతో, డిజిటల్ వేదికలపై గ్లామర్ ఫోటోషూట్‌లతో నిత్యం ట్రెండింగ్‌లో ఉండే త్రిథా చౌదరి.. మునుముందు మరింత వైవిధ్యమైన పాత్రలతో తన మార్కును చూపించడానికి సిద్ధమవుతున్నారు. నటనలో త్రిథా అంకితభావం.. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకునే తత్వమే ఆమెను ప్రేక్షకుల అభిమాన తారగా నిలబెడుతోంది. భవిష్యత్ ప్రాజెక్ట్‌లతో ఈ బ్యూటీ మరింత విజయవంతమైన మైలురాళ్లను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.