విజయ్ క్రేజ్.. ఇకపై అలా చేస్తే సీరియస్ యాక్షన్!
హీరోల క్రేజ్ ను క్యాష్ చేసుకోవడం కొత్తేమీ కాదు. వాళ్ల ఫొటోలతో టీషర్టులు అమ్మడం నుంచి.. పేరుతో ఫేక్ అనౌన్స్మెంట్లు ఇవ్వడం వరకు రకరకాలుగా వాడుకుంటుంటారు.
హీరోల క్రేజ్ ను క్యాష్ చేసుకోవడం కొత్తేమీ కాదు. వాళ్ల ఫొటోలతో టీషర్టులు అమ్మడం నుంచి.. పేరుతో ఫేక్ అనౌన్స్మెంట్లు ఇవ్వడం వరకు రకరకాలుగా వాడుకుంటుంటారు. ఇప్పుడు ఏఐ రావడంతో ఫొటోలు, వీడియోలను మార్చి ఫేక్ కంటెంట్ క్రియేట్ చేయడం కూడా ఈజీ అయింది. అయితే ఆ క్రేజ్ వాడుకొని ఇష్టానుసారంగా చేస్తామంటే ఇకపై కుదరదని తెలుస్తోంది. రీసెంట్ గా విజయ్ దేవరకొండ కోర్టుకెళ్లడంతో, ఆయన క్రేజ్ ను వాడుకునే వారికి చిక్కులు తప్పవా అనే చర్చ మొదలైంది.
సినిమా హీరోలకు ఉండే ఫ్యానిజం పెద్దది. సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటోలకు సూపర్ రెస్పాన్స్ ఉంటుంది. ఇదే కొందరికి బిజినెస్ వేగా మారుతోంది. హీరోల ఫోటోలతో టీషర్టులు, మగ్గులు తయారు చేసి అమ్మడం.. వారి పేర్లతో అనౌన్స్మెంట్లు ఇవ్వడం.. అభిమానులను అట్రాక్ట్ చేసేలా పోస్టులు పెట్టడం వంటివి చేస్తున్నారు. అయితే, ఒక హీరోపై అభిమానం ఉండటం వేరు.. ఆయన గుర్తింపును పర్మిషన్ లేకుండా బిజినెస్ కు వాడుకోవడం వేరు.
ఇప్పుడు విజయ్ దేవరకొండ పిటిషన్ లో కూడా అవే మెయిన్ ఇష్యూస్ గా ఉన్నాయి. తన పర్మిషన్ లేకుండా ఫోటోలు, పేరు యూజ్ చేసి వస్తువులు అమ్ముతున్నారని, తప్పుడు అనౌన్స్మెంట్లు ఇస్తున్నారని ఆయన ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. కొందరు తన రిప్రజెంటేటివ్స్ గా మూవ్ అవుతున్నారని తెలిపారు. అంటే, తనకు సంబంధం లేని విషయాలతో తన పేరును లింక్ చేయడంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఒక ఫోటోను మార్చి ప్రచారం చేయాలంటే కొంత కష్టం ఉండేది. ఇప్పుడు ఏఐతో ఫేక్ ఫొటోలు, వీడియోలను ఎవరైనా ఈజీగా క్రియేట్ చేయవచ్చు. అసలు ఆ వ్యక్తి చెప్పని మాటలు చెప్పినట్టు చూపించడం, చేయని పనులు చేసినట్లు ప్రచారం చేయడం సాధ్యమవుతోంది. ఇలాంటి కంటెంట్ నిజమో కాదో తెలియక అభిమానులు కూడా నమ్మే ప్రమాదం ఉంది. విజయ్ కూడా ఆ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
తన పేరుతో ఫేక్ వెబ్ సైట్లు, తప్పుడు ప్రకటనలు ఉన్నాయని తెలిపారు. వీటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. మెటా, ఎక్స్, గూగుల్ తో పాటు అమెజాన్, ఫ్లిప్ కార్ట్, మీషో వంటి ప్లాట్ ఫామ్స్ పై జరుగుతున్న మిస్ యూజ్ ను కూడా తన పిటిషన్ లో ప్రస్తావించారు. తమ పేర్లు యూజ్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తే, ఫైనాన్షియల్ గా నష్టం కలిగిస్తే లేదా చెడ్డ పేరు తెస్తే సమస్యలు ఎదురవుతాయని అభిప్రాయపడ్డారు.
నిజమే.. హీరోల క్రేజ్‌ను ఉపయోగించు కోవాలంటే అది చట్టపరమైన హద్దుల్లోనే ఉండాలి. అభిమానం పేరుతోనో, వ్యాపారం కోసమో వారి గుర్తింపును ఇష్టానుసారంగా వాడుకోవడం సరైనది కాదని చెప్పాలి. అందుకే తన పర్సనాలిటీ రైట్స్ కాపాడాలంటూ విజయ్ కోర్టును కోరగా, న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అయితే విజయ్ పిటిషన్ పై ఫైనల్ డెసిషన్ ఇంకా రాలేదు. నెక్స్ట్ విచారణ 2027 ఫిబ్రవరి 2న జరగనుంది. అప్పుడు కోర్టు ఏం చెబుతుందో వేచి చూడాలి.