తెలుగు ఇండస్ట్రీ లో టాప్ 5 డైరెక్టర్లు వీళ్ళేనా?
ఇండస్ట్రీ ఏ ఒక్కరిది కాదు. సక్సెస్ సాధించిన దర్శకులు ఇక్కడ ఎక్కువ కాలం కొనసాగుతారు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ పాపులారిటీని సంపాదించుకున్న టాప్ 5 దర్శకులు వీళ్లే...
ఇండస్ట్రీ ఏ ఒక్కరిది కాదు. సక్సెస్ సాధించిన దర్శకులు ఇక్కడ ఎక్కువ కాలం కొనసాగుతారు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ పాపులారిటీని సంపాదించుకున్న టాప్ 5 దర్శకులు వీళ్లే...
రాజమౌళి
తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. అపజయం ఎరుగని దర్శకుడిగా అరుదైన రికార్డు ను సొంత చేసుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు తో అంతర్జాతీయ అడ్వెంచర్ డ్రామా గా తెరకెక్కుతున్న 'వారణాసి' మూవీ పై గ్లోబల్ మార్కెట్ లో భారీ అంచనాలున్నాయి. రాజమౌళి ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటి వరకు ఎవ్వరు చూడని కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలను తెరకెక్కిస్తుంటాడు. విజువల్ గ్రాండియర్, వి ఎఫ్ ఎక్స్ తో ప్రేక్షకులను అబ్బురపర్చడం రాజమౌళి స్టైల్. కథాంశంలో వైవిధ్యాన్ని చూపిస్తూనే ఎమోషన్స్ , మాస్ ఎలివేషన్స్ ను సమన్వయం చేస్తూ స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తాడు. రాజమౌళి దర్శకత్వంలో నటించడానికి చాలామంది హీరోలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హాలీవుడ్ హీరోలు సైతం రాజమౌళి డైరెక్షన్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుండటం విశేషం...
సుకుమార్
'పుష్ప' ఫ్రాంచైజీ తో పాన్ ఇండియాలో తన ముద్ర వేసిన దర్శకుడు సుకుమార్... ఆయన సినిమాల్లో కొత్తదనంతో పాటు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయగలిగే ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రతి సన్నివేశంలో డీటైలింగ్ ను మైంటైన్ చేస్తూ ప్రేక్షకుడికి ఎక్కడ బోర్ కొట్టించకుండా సినిమాని ముందుకు తీసుకెళ్లడంలో సిద్ధహస్తుడు. కెరియర్ స్టార్టింగ్ లో మైండ్ గేమ్ లు, విభిన్న క్యారెక్టరైజేషన్ లను, డిఫరెంట్ స్క్రీన్ ప్లే ను రాస్తూ ప్రయోగాత్మకమైన సినిమాలను చేశాడు. కానీ వాటిని ప్రేక్షకులు పూర్తి స్థాయి ఆదరించలేదు. దాంతో తన పంథాను పూర్తిగా మార్చి 'రా అండ్ రస్టిక్' సినిమాను ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా వచ్చినవే రంగస్థలం, పుష్ప సినిమాలు...ఈ మూవీస్ తో జాతీయ స్థాయిలో ఆయనకి గొప్ప గుర్తింపు వచ్చింది.
సందీప్ రెడ్డి వంగ
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, అనిమల్ సినిమాలతో మేకింగ్ లో వైవిధ్యాన్ని చూపించిన దర్శకుడు సందీప్. ఇప్పటివరకు ఆయన తీసిన సినిమాలతో ఇండియన్ సినిమా బాక్సాఫీస్ మీద దండయాత్ర చేసి భారీ రికార్డులను బ్రేక్ చేశాడు. ప్రభాస్ తో చేస్తున్న 'స్పిరిట్' అంతకు మించి అనేలా ఉండబోతోందట. ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీ లోనే ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలబోతోందని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. సందీప్ సినిమాల్లో బోల్డ్ కంటెంట్ కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికి తన సినిమాను ప్రేక్షకులు పూర్తి స్థాయి లో ఆదరిస్తున్నారు.
త్రివిక్రమ్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రేక్షకుడికి చేరువయ్యే కుటుంబ బంధాలు, బాంధవ్యాలతో సినిమాలు చేస్తాడు. పాన్ ఇండియాలో సినిమా చేయకపోయిన తెలుగు ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఎంటర్ టైన్ చేస్తున్నాడు... ప్రేక్షకుడిని తన మాటలతో మాయ చేస్తూ రెండున్నర గంటల పాటు కూర్చోపెడతాడు. ఇక టెక్నికల్ గా త్రివిక్రమ్ సినిమాకి ఏదైతే అవసరమో దాన్ని మాత్రమే వాడుతూ హంగులు ఆర్భాటాలకు పోకుండా సగటు ప్రేక్షకుడి అర్థమయ్యే విధంగా తెరకెక్కిస్తాడు. ప్రస్తుతం వెంకటేష్ తో 'ఆదర్శ కుటుంబం' సినిమాను చేశాడు. తొందరలోనే ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది...
నాగ్ అశ్విన్
సావిత్రి జీవిత కథ ఆధారంగా 'మహానటి' సినిమాను చేసి ప్రేక్షకులందరిని అలరించాడు. కల్కి సినిమాతో టాప్ డైరెక్టర్ గా మారిన నాగ్ అశ్విన్ ఈ మూవీతో దాదాపు 1200 కోట్ల వరకు కలెక్షన్స్ ను కొల్లగొట్టాడు... నాగ్ అశ్విన్ కల్కి మూవీ ని హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కించాడు. ప్రస్తుతం 'కల్కి 2' సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు...