భోగి కోసం చంద్రబోస్ అచ్చమైన పల్లె పాట!

సినిమా పాట అంటే వినగానే నచ్చాలి.. మళ్లీ మళ్లీ వినాలనిపించాలి. కానీ కొన్ని సాంగ్స్ మాత్రం మనల్ని మరో వరల్డ్ లోకి తీసుకెళ్తాయి.

Update: 2026-10-09 10:29 GMT

సినిమా పాట అంటే వినగానే నచ్చాలి.. మళ్లీ మళ్లీ వినాలనిపించాలి. కానీ కొన్ని సాంగ్స్ మాత్రం మనల్ని మరో వరల్డ్ లోకి తీసుకెళ్తాయి. మన ఊరిని, మనుషులను, వాళ్ల కష్టాలను గుర్తుచేస్తాయి. ఇప్పుడు యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న భోగి సినిమా నుంచి వచ్చిన ఎగిలివారంగా లేచి సాంగ్ కూడా అలాంటి ఎక్స్పీరియన్సే ఇస్తోంది. ముఖ్యంగా ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ రాసిన లిరిక్స్ ఆ సాంగ్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.




 


శర్వానంద్ లీడ్ రోల్ లో సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా భోగి. 1960స్ తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఆ సినిమా సాగనుంది. రీసెంట్ గా విడుదలైన తొలి పాటలోనూ అదే ఎన్విరాన్మెట్ ను చూపించారు. భీమ్స్ సిసిరోలియో అందించిన మ్యూజిక్, తెలంగాణ జానపదాన్ని గుర్తుచేసే వాయిస్ లు పాటకు అందాన్ని తీసుకొచ్చాయి. అయితే వీటన్నింటికీ మించి చంద్రబోస్ రాసిన పదాలు ఫిదా చేస్తున్నాయి.

ఎగిలివారంగా లేచి అంటూ సాగే ఆ పాటలో మంచి విలేజ్ లైఫ్ స్టైల్ కనిపిస్తుంది. తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి పనులు చేసుకోవడం, దేవుళ్లకు దీపాలు పెట్టడం, ఆ తర్వాత పొలాలకు వెళ్లడం.. ఇలా పల్లెటూరి మహిళల రోజువారీ జీవితాన్ని చంద్రబోస్ తన పదాల్లో చూపించారు. అయితే ఎక్కడా ఆర్టిఫీషియల్ గా అనిపించదు. పల్లె ప్రజలు మాట్లాడుకునే మాటలు, వారి లైఫ్ స్టైల్ సాంగ్ లో చాలా నేచురల్ గా కనిపిస్తాయి.

అందుకే ఆ పాట వింటున్నప్పుడు ఏదో సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కంటే మన ఊరిలోని పాత రోజులను గుర్తు చేసుకుంటున్నామనే ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. మన అమ్మమ్మలు, నానమ్మలు చేసిన పనులు, పొలాల్లో కష్టపడిన మన పెద్దల జీవితం కళ్ల ముందు కనిపిస్తోంది. ఇదే చంద్రబోస్ లిరిక్స్ లోని స్పెషాలిటీ. పాటలో పేదల కష్టాలు, భూమిని నమ్ముకుని బతికే రైతులు, కూలీలు ఎంత కష్టపడినా వారి జీవితాల్లో కొరతలు ఎలా వెంటాడేవో ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.

కష్టపడటమే తెలిసిన మనుషులకు కనీస అవసరాలు కూడా అందని పరిస్థితులను కొన్ని పదాల్లోనే గుర్తుచేశారు. ముఖ్యంగా అవసరమైన సౌకర్యాలు లేని పరిస్థితిని చెప్పే పదాలు ఆలోచించేలా చేస్తాయి. తాగడానికి నీరు, వ్యవసాయానికి అవసరమైన సోర్సెస్, మినిమమ్ ఫెసిలిటీస్ అందనప్పుడు కొందరి ప్రజల బతుకు ఎలా ఉంటుందో లిరిక్స్ గుర్తుచేస్తాయి.

తెలంగాణ జానపద సంగీతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన భీమ్స్ సిసిరోలియో.. భోగి పాటలో కూడా పల్లె వాతావరణానికి సరిపోయే బాణీని అందించారు. నల్గొండ గద్దర్ నరసన్న, కందుకూరి శంకర్ బాబు వాయిస్ లు పాటలోని మట్టి వాసనను మరింత పెంచాయి. అయితే ఆస్కార్ రేంజ్ కు చేరిన చంద్రబోస్ పెన్.. సందర్భానికి తగ్గట్టు మంచి పదాలతో కూడా స్ట్రాంగ్స్ ఫీలింగ్స్ ను చెప్పగలదని మరోసారి గుర్తుచేస్తోంది. మరి భోగి స్టోరీకి ఆ సాంగ్ ఎలాంటి స్ట్రెంత్ ఇస్తుందో చూడాలి. అయితే తొలి పాటతోనే చంద్రబోస్ తన పెన్ పవర్ చూపించారనే చెప్పాలి.



Full View


Tags:    

Similar News