రవితేజతో ఆత్రేయ.. ఈసారి నాని మూవీకి మించిన ప్లాన్!
వివేక్ ఆత్రేయకు ఇలాంటి కొత్త ఆలోచనలు ఇప్పుడే మొదలుకాలేదు. నాని హీరోగా వచ్చిన సరిపోదా శనివారం సినిమాకు ఆయన చేసిన ప్రమోషన్స్ అప్పట్లో స్పెషల్ గా నిలిచాయి.
సినిమా టైటిల్ ప్రకటించడానికి ఓ డాక్యుమెంటరీ.. వినడానికి కొత్తగా ఉంది కదా! మాస్ మహారాజా రవితేజతో మూవీ చేస్తున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ ఇప్పుడు ఇలాంటి కొత్త ఆలోచనతో ముందుకొస్తున్నారు. అక్టోబర్ 11వ తేదీన ఉదయం 10.30 గంటలకు టైటిల్ డాక్యుమెంటరీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో సినిమా టైటిల్ పై ఇంట్రెస్ట్ పెరగడమే కాదు.. ఆత్రేయ ప్రమోషన్స్ లోనూ కొత్త మోడల్ ఎంచుకున్నారనే చర్చ మొదలైంది.
సాధారణంగా సినిమా టైటిల్ ను ఓ పోస్టర్ తో ప్రకటిస్తారు. కొన్నిసార్లు చిన్న వీడియో విడుదల చేస్తారు. కానీ, టైటిల్ పరిచయం కోసమే ఓ చిన్న డాక్యుమెంటరీని తీసుకురావడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇందులో ఏం చూపించబోతున్నారనే దానిపై ప్రేక్షకుల్లో హైప్ నెలకొంది. సినిమా టైటిల్ పరిచయం చేసే విధానంతోనే అందరి దృష్టిని ఆకర్షించాలన్నది మూవీ టీమ్ ఆలోచనగా కనిపిస్తోంది.
వివేక్ ఆత్రేయకు ఇలాంటి కొత్త ఆలోచనలు ఇప్పుడే మొదలుకాలేదు. నాని హీరోగా వచ్చిన సరిపోదా శనివారం సినిమాకు ఆయన చేసిన ప్రమోషన్స్ అప్పట్లో స్పెషల్ గా నిలిచాయి. సినిమా పేరుకు తగ్గట్టుగా ప్రతి శనివారం కొత్త అప్డేట్ ఇస్తూ ప్రేక్షకుల్లో హైప్ పెంచారు. ఎస్.జే. సూర్య పాత్రను పరిచయం చేసిన వీడియోలు కూడా సినిమాపై చర్చ జరిగేలా చేశాయి. స్టోరీలో స్పెషాలిటీని ప్రమోషన్స్ లో చూపించాలని ట్రై చేసి సక్సెస్ అయ్యారు.
ఇప్పుడు రవితేజ సినిమా కోసం మరో కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. నాని సినిమాకు ఫాలో అయినే పద్ధతినే మళ్లీ కంటిన్యూ చేయకుండా, ఈసారి టైటిల్ అనౌన్స్మెంట్ తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ లో తనదైన శైలిలో అట్రాక్ట్ చేయాలనే ఆలోచన ఇందులో కనిపిస్తోంది. మరోవైపు రవితేజతో ఆత్రేయ కాంబినేషన్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
అయితే మాస్ సినిమాలతో ప్రేక్షకులను అలరించే రవితేజ, తనదైన స్టోరీ టెల్లింగ్ తో గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయతో కలిసి వర్క్ చేస్తున్నారు. సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్, అనస్వర రాజన్ హీరోయిన్స్ గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. జేడీ చక్రవర్తి విలన్ గా కనిపించనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తులాభారం అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు కొంతకాలంగా టాక్ ఉన్నా.. అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది.
మరి సరిపోదా శనివారం ప్రమోషన్స్ లో తనదైన ముద్ర వేసిన వివేక్ ఆత్రేయ, ఇప్పుడు రవితేజ సినిమాతో అంతకుమించిన ఎఫెక్ట్ చూపించాల్సి ఉంది. అప్పటికి మించి ఇప్పుడు కొత్త ఆలోచనలతో వస్తే, సినిమా విడుదలకు ముందే హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే కొత్త తరహా ప్రమోషన్స్ తో హైప్ పెంచడం ఒక ఎత్తు. దానికి తగ్గట్లు ప్రేక్షకులను మెప్పించడం మరో ఎత్తు. ఇక టైటిల్ డాక్యుమెంటరీతో మొదలుకానున్న ప్రమోషన్స్ జర్నీ ఫస్ట్ స్టెప్ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.