బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. ఆ సూపర్ ఛాన్స్ వదులుకుంటే మాత్రం..
దానికి తోడు రెడ్ జెయింట్ మూవీస్ కు కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. పెద్ద హీరోల సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో ఆ బ్యానర్ మెయిన్ గా వ్యవహరిస్తుంటుంది.
కొన్ని సినిమాలు హిట్ అయితే నిర్మాతలకు లాభాలు వస్తాయి. కానీ కొన్ని సినిమాల పేర్లు వినగానే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సందడి ఉంటుందో అంచనా వేయొచ్చు. ఇప్పుడు స్టార్ హీరోలు రజినీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించనున్న మల్టీస్టారర్ కూడా ఆ లిస్ట్ లోకి వస్తుంది. దాదాపు 50 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరూ ఒకే మూవీలో కనిపిస్తుండడంతో ఆ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ ప్రాజెక్టును ముందుకు రెడ్ జెయింట్ మూవీస్ గ్రాండ్ గా ప్రొడ్యూస్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అయితే ఇప్పుడు ఆ సినిమా నిర్మాణ బాధ్యతలు కమల్ హాసన్ కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ చేతికి వెళ్లవచ్చనే ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే రెడ్ జెయింట్ మూవీస్ ఓ భారీ ఛాన్స్ ను వదులుకున్నట్లేనా అనే చర్చ మొదలైంది.
రజినీకాంత్, కమల్ హాసన్ లను ఒకే సినిమాలో చూపించడం అంటే నార్మల్ విషయం కాదు. ఇద్దరికీ తమిళంతో పాటు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వీరిద్దరూ కలిసి నటిస్తారనే వార్తే సినిమాపై హైప్ పెంచింది. ఇక దర్శకుడిగా నెల్సన్, సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ ఉండటంతో అంచనాలు పెరిగాయి. ఇలాంటి సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపట్టడం ఏ బ్యానర్ కు అయినా సూపర్ ఛాన్సే.
దానికి తోడు రెడ్ జెయింట్ మూవీస్ కు కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. పెద్ద హీరోల సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో ఆ బ్యానర్ మెయిన్ గా వ్యవహరిస్తుంటుంది. అలాంటి సంస్థ రజినీ, కమల్ మల్టీస్టారర్ ను నిర్మిస్తే దానికి మరింత స్పెషాలిటీ ఉండేది. కానీ రెడ్ జెయింట్ ఆ అవకాశాన్ని వదులుకుంటే ఎంతటి బిజినెస్ ఛాన్స్ ను మిస్ అవుతుందనే చర్చ జరుగుతోంది.
సినిమా నిర్మాణం, రిలీజ్ రైట్స్, ఇతర బిజినెస్ ఎలిమెంట్స్ ద్వారా పెద్ద రేంజ్ లో ఇన్కమ్ పొందే ఛాన్స్ ఉండేది. అయితే సినిమా బడ్జెట్, బిజినెస్ అగ్రిమెంట్స్, వసూళ్లపై ఆధారపడి లాభనష్టాలు మారుతాయి. కాబట్టి ఆ సినిమా తీస్తే కచ్చితంగా లాభాలే వస్తాయని చెప్పలేం. ఇక కమల్ హాసన్ కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలు తీసుకోవచ్చని తెలుస్తోంది. అదే జరిగితే కమల్ తన సొంత సంస్థ ద్వారా రజినీకాంత్ తో కలిసి ఆ భారీ సినిమాను నిర్మించే అవకాశం ఉంటుంది. అయితే దీనిపై ఇంకా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
ప్రొడక్షన్ బ్యానర్ మారినా సినిమా మీద ఉన్న అంచనాలు మాత్రం అస్సలు తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ప్రేక్షకులకు కావాల్సింది రజినీ కాంత్, కమల్ హాసన్ కాంబినేషన్. అందుకే రెడ్ జెయింట్ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటే, ఇంతటి క్రేజీ సినిమాను నిర్మించే అవకాశం మరో సంస్థకు దక్కినట్లవుతుంది అంతే. అయితే ఆ ఛేంజ్ వెనుక కారణాలేంటి, ఎవరు నిర్మాణ బాధ్యతలు చేపడతారనేది అధికారిక ప్రకటన వస్తేనే తెలుస్తోంది.