తమన్నా మళ్లీ ఫామ్‌లోకి వచ్చేనా..?
మిల్కీ బ్యూటీ తమన్నా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది.;
మిల్కీ బ్యూటీ తమన్నా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. సరిగ్గా 20 ఏళ్ల క్రితం శ్రీ సినిమాతో తమన్నా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. మంచు మనోజ్ హీరోగా నటించిన ఆ సినిమా పెద్దగా ఆడకున్నా కూడా తమన్నాకు గుర్తింపు లభించింది. 2007లో ఈమె చేసిన హ్యాపీ డేస్‌తో ఒక్కసారిగా కెరీర్ సెట్ అయింది. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్స్ జాబితాలో చేరి పోయేంత బిజీగా సినిమాలు చేస్తూ వచ్చింది. యంగ్ స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేసి రికార్డ్ సొంతం చేసుకుంది. సీనియర్ హీరోలతో కూడా నటించడం ద్వారా తమన్నా టాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరోయిన్‌గా పేరు సొంతం చేసుకుంది. ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితులు మారి పోయాయి.
తమన్నా గత కొన్నాళ్లుగా కెరీర్ పరంగా పోరాటం చేస్తుంది. పెద్దగా ఆఫర్లు రాకున్నా, క్రేజీ సినిమాల్లో హీరోయిన్‌గా నటించే అవకాశాలు దక్కకున్నా ఐటెం సాంగ్స్, గెస్ట్ రోల్స్, వెబ్ సిరీస్ ఇలా ఏదో ఒక ప్రాజెక్ట్‌తో బిజీగా ఉంటూ వచ్చింది. కానీ ఇప్పుడు అలా లేదు. తెలుగు, తమిళ్‌లో తమన్నా సినిమాలు, సిరీస్‌లు చేయడం లేదు. చేయడం లేదు అనడం కంటే ఈమెకు ఆఫర్లు రావడం లేదు అంటే కరెక్ట్‌గా ఉంటుంది. ఈమెతో కొందరు లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్‌లను అనుకున్నారు. కానీ ఇటీవల వచ్చిన ఓదెల 2 సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడటంతో ఆ ఆఫర్లు కూడా వెనక్కి వెళ్లిన పరిస్థితి. తమన్నా ప్రస్తుతం హిందీలో రెండు మూడు సినిమాలు చేస్తుంది.
సౌత్‌లో ఒకప్పుడు మోస్ట్ పాపులర్ హీరోయిన్‌గా, చాలా ఖరీదైన హీరోయిన్‌గా నిలిచిన తమన్నా ఇప్పుడు మాత్రం పెద్దగా ఆఫర్లు లేకుండా వెలవెల పోవడం బాధాకరం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. హిందీలో ఒకటి రెండు సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు తెచ్చే సినిమాలు కావు, ముందు ముందు మరిన్ని ఆఫర్లు తెచ్చి పెట్టే సినిమాలు అసలే కావు అంటూ కొందరు మాట్లాడుతున్నారు. మొత్తానికి మిల్కీ బ్యూటీ తమన్నా లవ్ బ్రేక్ కావడంతో సినిమాలతో బిజీ కావాలని ఆశ పడుతున్నా కూడా అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. ఆమె ముందు ముందు అయినా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఆఫర్లు దక్కించుకుంటుందా అంటే అనుమానమే అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
చాలా మంది హీరోయిన్స్ కొన్నాళ్ల తర్వాత బ్రేక్ తీసుకుని సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నారు. వారి తరహాలోనే తమన్నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టే అవకాశం ఉందా అనేది చూడాలి. అందం విషయంలో ఇంకా పాతికేళ్ల పడుచు అమ్మాయిగా కనిపించే తమన్నాకు ఆఫర్లు తగ్గడం ఆమె అభిమానులను బాధిస్తుంది. సీనియర్ హీరోలకు జోడీ గా అయినా తమన్నా నటిస్తే బాగుండు అని అభిమానులు కోరుకుంటున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి సీనియర్ స్టార్స్‌తో మరిన్ని సినిమాల్లో ఈ అమ్మడు నటించే అవకాశాలు దక్కించుకుంటుందో చూడాలి. కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ ఈమె మరికొన్నాళ్లు హీరోయిన్‌గా నటించే అవకాశాలు దక్కించుకునేనా అనేది కాలమే నిర్ణయించాలి.