విల‌న్ గా మారుతున్న సీనియ‌ర్ హీరోయిన్!

అయితే ఇప్పుడు మ‌రో హీరోయిన్ విల‌న్ గా మార‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఒక‌ప్పుడు హీరోయిన్ గా ఇండ‌స్ట్రీని షేక్ చేసిన ట‌బు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ సినిమాలు చేస్తున్నారు.;

Update: 2025-07-10 16:30 GMT

ఒక‌ప్పుడు హీరోయిన్లుగా న‌టించిన స్టార్లు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకెళ్తున్నారు. కొంద‌రు స‌పోర్టింగ్ రోల్స్ లో న‌టిస్తుంటే మ‌రికొంద‌రు ఏ అవ‌కాశమొస్తే దాంతో అడ్జ‌స్ట్ అవుతూ కెరీర్ ను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకొంద‌రు సీనియ‌ర్ హీరోయిన్లు విల‌న్ లుగా కూడా మారి సినిమాలు చేస్తున్నారు. ఆల్రెడీ వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ విల‌న్ గా యాక్ట్ చేస్తూ మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు.

అయితే ఇప్పుడు మ‌రో హీరోయిన్ విల‌న్ గా మార‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఒక‌ప్పుడు హీరోయిన్ గా ఇండ‌స్ట్రీని షేక్ చేసిన ట‌బు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ సినిమాలు చేస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, హిందీ లో ఆమె ప‌లు సినిమాలు చేసి మంచి క్రేజ్ ను ద‌క్కించుకున్నారు. ట‌బు తెలుగులో చేసిన సినిమాలు త‌క్కువే అయినా వాటితోనే భారీ క్రేజ్ ను తెచ్చుకున్నారు.

మొన్న ఆ మ‌ధ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అల వైకుంఠ‌పుర‌ములో సినిమాలో న‌టించిన ట‌బు, ఇప్పుడు ఓ స్టార్ డైరెక్ట‌ర్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న సినిమా కోసం విల‌న్ గా మార‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఆ డైరెక్ట‌ర్ మ‌రెవ‌రో కాదు, పూరీ జ‌గ‌న్నాథ్. విజ‌య్ సేతుప‌తి హీరోగా పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

ఆ సినిమాలో ట‌బు ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నార‌ని మేక‌ర్స్ ఇప్ప‌టికే అనౌన్స్ కూడా చేశారు. ట‌బు తో పాటూ సంయుక్త మీన‌న్, దునియా విజ‌య్ న‌టిస్తున్న ఈ సినిమాలో ట‌బు విల‌న్ గా న‌టిస్తుంద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ స‌ర్కిల్స్ లో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ వార్త‌ల్లో నిజ‌మెంత‌న్న‌ది ప‌క్క‌న పెడితే నిజంగా ట‌బు ఈ మూవీలో విల‌న్ గా న‌టిస్తే, త‌ర్వాత ఆమెకు మ‌రిన్ని అవ‌కాశాలు రావ‌డం ఖాయం. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ మొద‌ల‌వ‌గా, పూరీ కనెక్ట్స్ బ్యాన‌ర్ లో ఛార్మీ కౌర్, పూరీ జ‌గ‌న్నాథ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News