53 ఏళ్ల టబుతో ఇంటిమేట్ సీన్స్ ఇబ్బందేంలేదు!
53 ఏళ్ల టబు- 29 ఏళ్ల ఇషాన్ కట్టర్ మధ్య రొమాన్స్ గత ఏడాది ఎంత సంచలనమైందో తెలిసిందే.;
53 ఏళ్ల టబు- 29 ఏళ్ల ఇషాన్ కట్టర్ మధ్య రొమాన్స్ గత ఏడాది ఎంత సంచలనమైందో తెలిసిందే. `ఏ సూటబుల్ బోయ్` లో ఇద్దరు చెలరేగిన వైనం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరి మధ్య ఇంటిమేట్ సన్నివేశాలు...పెదవి ముద్దులు...బెడ్ రూమ్ సన్నివేశాల గురించి సోషల్ మీడియాలో చర్చ భారీగానే జరి గింది. లేటు వయసులోనూ టబు ఘాటు రొమాన్స్ లో అలరించిన వైనానికి యువత ఫిదా అయింది.
వెబ్ సిరీస్ లో టబు అందం.. ఆహార్యం అంతే ఆకట్టుకుంది. తాజాగా ఈ సిరీస్ లో ఇంటిమేట్ సీన్స్ గురించి ఇషాన్ కట్టర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఉన్న ప్పటికీ టబుతో రొమాన్స్ చేయడం ఏమాత్రం ఇబ్బందిగా అనిపించలేదన్నాడు. ఇలాంటి వాటి గురించి ఆమెతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది వింతగా అనిపించినా? ఆమెతో ఇంటిమేట్ సీన్స్ కి నేను భయపడలేదు.
చాలా సేఫ్ గా భావించాను. ఎందుకంటే నేనేం చేస్తున్నానో అర్దం చేసుకోవడమే కాకుండా దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లగలిగే నటితోనే నేను రొమాన్స్ సీన్ చేసాను. అదే టబులో ఉన్న గొప్పదనం. ఏ సన్నివేశం గురించి ఎక్కడా మాట్లాడాల్సిన పనిలేదు. టబుతో కలిసి పనిచేయడం ఎంతో సరదాగా అనిపించింది. ఆమె సెట్ లో చిన్నపిల్లలా ఉంటుంది. జోకులు వేస్తూ అందరినీ నవ్విస్తుంది.
అలా చేయడం వల్ల కోస్టార్స్ కి ఆమెతో నటించడం ఈజీ అవుతుంది. వయసులో పెద్ద అనే భావన మనసులో తొలగిపోతుంది. ఆ రకమైన ఉత్సాహం నాకు కల్పించారు కాబట్టే కంపర్ట్ గా నటించగలిగాను` అన్నాడు. `ఏ సూటబుల్ బోయ్` అనేది 1993లో విక్రమ్ సేథు రాసిన నవల ఆధారంగా తెరకెక్కింది.