ఏజ్‌లెస్ క్వీన్‌: 'బజార్' కవర్‌పేజీపై మైండ్ బ్లాక్ చేసిన టబు

భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న సీనియర్ నటి టబు తాజాగా ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ `హార్పర్స్ బజార్` కవర్‌పేజీపై మెరిసి అభిమానుల మైండ్ బ్లాక్ చేశారు.;

Update: 2026-05-11 11:30 GMT

భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న సీనియర్ నటి టబు తాజాగా ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ `హార్పర్స్ బజార్` కవర్‌పేజీపై మెరిసి అభిమానుల మైండ్ బ్లాక్ చేశారు. జాతీయ ఉత్తమ నటిగా తన నటనతో ఎందరినో మంత్రముగ్ధులను చేసిన ఈ సీనియర్ బ్యూటీ.. ఈ ఫొటోషూట్‌లో సరికొత్త అవతారంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. డార్క్ పింక్ గౌనులో ట‌బు అందచందాలు మరో స్థాయిలో ఎలివేట్ అవ్వడమే కాకుండా.. త‌న హెయిర్ స్టైల్ ప్రయోగం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఆమె కళ్ళల్లో ఉన్న ఆ షార్ప్‌నెస్, కెమెరాకు ఇచ్చిన ఆ కాన్ఫిడెంట్ పోజ్ త‌న‌లోని అసలైన ప్ర‌తిభావ‌నిని బయటకు తీశాయి.



 


ఈ కవర్ స్టోరీలో భాగంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో టబు తన వ్యక్తిత్వం గురించి ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసారు. నేటి కాలంలో మీరు ఎలా ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా ఉండగలుగుతున్నారు? అని ప్ర‌శ్నించ‌గా.. ట‌బు తనదైన శైలిలో స్పందించారు. ``నేను రెలవెంట్‌గా ఉండాలని ఏనాడూ అనుకోలేదు... అసలు నాకు ఆ ఆసక్తి కూడా లేదు. మనమే ఈ పదజాలాన్ని సృష్టించుకుని.. దాని గురించి ఆలోచిస్తూ ఆందోళన చెందుతున్నాం. రెలవెంట్‌గా ఉండాల్సిన అవసరం ఎవరికి ఉంది?`` అంటూ ఇచ్చిన సమాధానం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. ప్లానింగ్‌తో కాకుండా కేవలం తన పని మీద ఉన్న ఇష్టంతోనే ఇంతకాలం ఇండస్ట్రీలో కొనసాగుతున్నారని ఈ మాటలు స్పష్టం చేస్తున్నాయి.



 


ఈ ఫొటోషూట్‌లో టబు ధరించిన `ప్లేఫుల్ బాన్-బాన్ స్లీవ్డ్ కర్వ్డ్ జాకెట్` ... జోయా జువెలరీకి చెందిన విలువైన ఆభరణాలు ట‌బు లుక్‌ను మరింత రిచ్‌గా మార్చాయి. ముఖ్యంగా పింక్ - ఎల్లో కలర్ వైల్డ్ ఫ్లవర్ పెండెంట్స్ జుట్టుకు యాక్సెసరీగా వాడిన పింక్ ఇయర్ రింగ్స్ త‌న‌ స్టైలింగ్‌లో కొత్తదనాన్ని చూపించాయి. ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఒక క్లాసిక్ ఇమేజ్ ఉన్న టబు ఈ ఆధునిక దుస్తుల్లోనూ అత్యంత హుందాతనంతో కనిపిస్తూ యువ నటీమణులకు గట్టి పోటీనిచ్చారు. ట‌బు అందం.. ఆహార్యంపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

నెటిజన్లు టబును `ఐకానిక్`, `మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్` అంటూ కొనిాడుతున్నారు. త‌ను ఎప్పుడూ కష్టపడి ట్రెండ్‌లో ఉండాలని ప్రయత్నించలేదని, కేవలం సత్తా ఉన్న పాత్రలను ఎంచుకోవడం వల్లే ట‌బు పేరు నేటికీ మారుమోగుతోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. టబు ఏది చేసినా అది ఎఫర్ట్‌లెస్ (శ్రమ లేకుండా) గా ఉంటుంది.. ఆమె ఒక క్లాస్ అపార్ట్! అంటూ ఒక నెటిజన్ చేసిన కామెంట్ త‌న‌ వ్యక్తిత్వాన్ని అద్దం పడుతోంది. నటనలో ఎంతటి గంభీరమైన పాత్రలు పోషిస్తారో... గ్లామర్ పరంగా కూడా అంతే పర్ఫెక్ట్‌గా ఉండటం ట‌బుకు మాత్రమే సాధ్యమైంది.

ప్రస్తుతం టబు చేతిలో పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. హిందీతో పాటు సౌత్‌లో కూడా అడపా దడపా మెరుస్తున్న ఈ నటి మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను అప్‌డేట్ చేసుకుంటూనే తనకంటూ ఉన్న `ఒరిజినాలిటీ`ని కోల్పోకుండా ఉండటమే ట‌బు సక్సెస్ సీక్రెట్. హార్పర్స్ బజార్ కవర్ పేజీపై ఈ సీనియ‌ర్ న‌టి క్రియేట్ చేసిన ఈ సెన్సేషన్, వయసు అనేది కేవలం ఒక అంకె మాత్రమేనని మరోసారి నిరూపించింది. టబు లాంటి నటీమణులు ఉన్నంత కాలం భారతీయ సినిమా గ్లామర్ .. టాలెంట్ విషయంలో ఎప్పటికీ వెనుకబడదు అనడానికి ఈ ఫొటోషూట్ ఒక నిదర్శనం. ట‌బు ప్ర‌స్తుతం కింగ్ నాగార్జున న‌టిస్తున్న భారీ చిత్రంలో క‌లిసి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News