• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సుకుమార్ రైటింగ్స్...

సుకుమార్ రైటింగ్స్ ఉండగా.. తబితా సమర్పణ ఎందుకు?

| రావు రమేష్ ప్రధాన పాత్రలో లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన మారుతీనగర్ సుబ్రహ్మణ్యం మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది

By - Tupaki Desk
Update: 2024-08-23 04:48 GMT

రావు రమేష్ ప్రధాన పాత్రలో లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన మారుతీనగర్ సుబ్రహ్మణ్యం మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే ఈ సినిమాకి స్పెషల్ ప్రీమియర్స్ కూడా పడ్డాయి. మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సినిమాలో రావు రమేష్ లీడ్ రోల్ లో చేస్తున్నాడనే విషయం బయటకొచ్చిన తర్వాత కొంత పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది.

ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో ఇదేదో కొత్తగా ఉండఉండబోతోందనే మాట వినిపించింది. అలాగే ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ చీఫ్ గెస్ట్ లుగా రావడంతో ఒక్కసారిగా హైప్ మరింత పెరిగింది. అల్లు అర్జున్ ఈ సినిమాని ప్రమోట్ చేయడంతో బన్నీ ఫ్యాన్స్ దృష్టి ఈ చిత్రంపై పడింది. అల్లు అర్జున్, సుకుమార్ ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ లు గా రావడానికి కారణం మూవీ నిర్మాణంలో భాగమైన తబితా సుకుమార్.

సుకుమార్ వైఫ్ గా ఎప్పుడు సినిమాలకి బ్యాక్ ఎండ్ లో ఉండే ఆమె మొదటిసారి మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సినిమాకి సమర్పకురాలిగా మారారు. ఆమె దగ్గరుండి సినిమాని ప్రమోట్ చేశారు. మీడియాకి కూడా దూరంగా ఉండే తబితా ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో కూడా పార్టిసిపేట్ చేసి కంటెంట్ ని స్ట్రాంగ్ గా జనాలకి రీచ్ అయ్యేలా చేశారు. నిజానికి ఏదైనా సినిమా నచ్చితే సుకుమార్ డైరెక్ట్ గా ఇన్ వాల్వ్ అవుతారు.

కాని మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సినిమాకి ఆయన భార్య ఇన్ వాల్వ్ అయ్యారేంటి అనే డౌట్ చాలా మందికి వచ్చింది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బుచ్చిబాబు సానాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తబిత సుకుమార్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. సుకుమార్ రైటింగ్స్ ఉండగా మరల తబిత సుకుమార్ ప్రెజెంట్స్ ఎందుకొచ్చింది అని బుచ్చిబాబు ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. అందుకు ఆమె ఈ విధంగా సమాధానం ఇచ్చారు. నేను సుకుమార్ రైటింగ్స్ లోనే ఉన్నారు. నిజానికి ఈ సినిమాని కూడా సుకుమార్ రైటింగ్స్ మీదనే సమర్పించాలని అనుకున్నాను.

అయితే మారుతీనగర్ సుబ్రహ్మణ్యం మూవీ గురించి సుకుమార్ తో మాట్లాడినపుడు పుష్ప 2 కంప్లీట్ అయ్యేవరకు నేను వేరే ఏ సినిమా చూడదలచుకోలేదు అని చెప్పారు. ఒప్పించాలని ట్రై చేసిన ఆయన కుదరదని చెప్పడంతో మూవీని వదులుకోవడం ఇష్టం లేక నేనే ప్రెజెంట్ చేస్తానని సుకుమార్ కి చెప్పేసాను. అలా మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సినిమా నిర్మాణంలో సమర్పకురాలిగా భాగం అయ్యాను అని తబిత సుకుమార్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

Tags:    
  • Tabithasukumar 
  • Sukumarwife 
  • Sukumarwritings 
  • Tollywood 
  • Pushpa2 
  • Maruthinagarsubramanyam 

Similar News

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

Copyright @2026

Powered by Blink CMS