కొబ్బ‌రిచెట్టు సులువుగా ఎలా ఎక్కాలో తాప్సీకి భ‌లేగా నేర్పించాడు!

ఒకవేళ ముందే తెలిసి ఉంటే ఆ ఫొటో కోసం కృత్రిమ మేధస్సు (AI)ను ఉపయోగించుకునేదానిని అంటూ తాప్సీ చేసిన సరదా వ్యాఖ్యలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Update: 2026-09-13 12:24 GMT

బాలీవుడ్ నటి తాప్సి పన్ను తాజాగా తన భర్తతో కలిసి సెషెల్స్‌లోని క్లబ్ మెడ్‌(ఫ్రాన్స్‌)లో గడిపిన సెలవులకు సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. అద్భుతమైన లొకేషన్, భర్త నుంచి పూర్తి మద్దతు ఉన్నా తాము అనుకున్నట్టుగా వైరల్ అయ్యే ఫొటో మాత్రం రాలేదని చాలా చమత్కారంగా క్యాప్షన్ జోడించారు. ఒకవేళ ముందే తెలిసి ఉంటే ఆ ఫొటో కోసం కృత్రిమ మేధస్సు (AI)ను ఉపయోగించుకునేదానిని అంటూ తాప్సీ చేసిన సరదా వ్యాఖ్యలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఈ సరదా పోస్ట్‌కు సోషల్ మీడియాలో అనూహ్య స్పందన లభించింది. నిజానికి బీచ్ లో కొబ్బ‌రి చెట్టు సులువుగా ఎక్క‌డం ఎలానో భ‌ర్త మాథియాస్ బో ఎంతో చ‌క్క‌గా తాప్సీకి నేర్పించాడు! అంటూ అభిమానులు స‌ర‌దాగా వ్యాఖ్యానిస్తున్నారు. తాప్సీ ఎంతో క‌ష్టంగా కొబ్బ‌రి చెట్టు ఎగ‌బాకాల‌ని చూస్తుంటే, మాథియాస్ చాలా సింపుల్ గా ఇసుకలో ప‌డుకుని త‌న రెండు కాళ్ల‌ను చెట్టు ఎక్క‌బోతున్న తాప్సీ పిరుదుల‌కు ఆన్చి స‌పోర్ట్ నిచ్చాడు. ఇది చాలా ఫ‌న్నీ.. కానీ చాలా అద్భుత‌మైన ఐడియా! అంటూ నెటిజ‌నులు మాథియాస్ ని పొగిడేస్తున్నారు. క్షణాల్లో వేలాది లైక్‌లు, కామెంట్‌లతో ఆ పోస్ట్ వైరల్ అయింది. పలువురు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, అభిమానులు ఈ క్యూట్ కపుల్‌ను అభినందిస్తూ హార్ట్ ఎమోజీలు, నవ్వుతున్న సింబల్స్‌తో కామెంట్లు పెట్టారు. ఫొటోలో తాప్సి భర్తను ఉద్దేశించి కొందరు ఫన్నీగా వ్యాఖ్యానించడంతో పాటు.. సెలబ్రిటీల ఇలాంటి సహజమైన మూవ్‌మెంట్స్‌ను చూడటం ఆనందంగా ఉందని కామెంట్లు చేశారు.

అయితే సెలబ్రిటీల సోషల్ మీడియా పోస్టులకు ఉండే సాధారణ ధోరణిలోనే ఈ పోస్ట్ కింద కూడా భిన్నమైన స్పందనలు వెల్లువెత్తాయి. ఒకవైపు అభిమానులు తమ అభిమాన నటి హ్యాపీ హాలిడేస్‌ను ఆస్వాధిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తుంటే... మరోవైపు కొందరు తమ పేజీల ప్రమోషన్లు, ఫాలోవర్లను పెంచుకునేందుకు రకరకాల కామెంట్లు పెడుతూ కనిపించారు. సెలబ్రిటీల పేజీలలో కనిపించే ఈ రకమైన కామెంట్లు సోషల్ మీడియాలో సర్వసాధారణంగా మారిపోయాయి.

అదే సమయంలో ఈ పోస్ట్ కొద్దిసేపట్లోనే వివాదాలు- ట్రోలింగ్‌కు కూడా కేంద్ర బిందువుగా మారింది. కొందరు నెటిజన్లు తాప్సి గతంలోని వ్యాపారాలు, వివాదాలను ప్రస్తావిస్తూ విమర్శించగా.. మరికొందరు సోషల్ మీడియాలో అనవసరమైన రాజకీయ అంశాలను, ఇతర నటుల పేర్లను లాగుతూ విద్వేషపూరిత కామెంట్లు చేశారు. ఒక సాధారణ హాలిడే ఫొటో కూడా ఇంటర్నెట్‌లో ఎంత తొందరగా ట్రోలింగ్‌కు గురికావచ్చో ఈ సంఘటన మరోసారి నిరూపించింది.

మొత్తంగా చూస్తే... తాప్సి పన్ను షేర్ చేసిన ఈ సరదా హాలిడే పోస్ట్ సోషల్ మీడియాలోని విభిన్న కోణాలను కళ్లకు కట్టింది. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను అభిమానులు ఎంతగా ఆస్వాదిస్తారో.. అదే సమయంలో ఆన్‌లైన్ వేదికలపై వ్యక్తమయ్యే ప్రతికూలత-ట్రోలింగ్- వివాదాలు ఏ స్థాయిలో ఉంటాయనేదానికి ఈ పోస్ట్ కామెంట్లు ఒక నిదర్శనంగా నిలిచాయి.

తాప్సీ ప‌న్ను న‌టించిన గాంధారి ఇటీవ‌లే విడుద‌లై మిశ్ర‌మ స్పంద‌న‌లు అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ భామ ఆశించిన స్థాయి విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. ఆ వెంట‌నే ఇలా ఫ్రాన్స్ లోని సెయింట్ అన్నే ఐల్యాండ్ లో ప్ర‌త్య‌క్ష‌మైంది. అక్క‌డ ఎగ్జోటిక్ లొకేష‌న్ల‌లో భ‌ర్త‌తో క‌లిసి రిలాక్స్ అవుతోంది.



Tags:    

Similar News