నటి స్నానమాడిన నీటితో సబ్బు తయారీ
క్రేజ్ ఎంత పీక్స్ కి చేరుకుంటే ఇలాంటి నిర్ణయం తీసుకోగలదు? ప్రముఖ హాలీవుడ్ నటి ప్రకటన నిజంగా అభిమానులకు షాకిచ్చింది.;
క్రేజ్ ఎంత పీక్స్ కి చేరుకుంటే ఇలాంటి నిర్ణయం తీసుకోగలదు? ప్రముఖ హాలీవుడ్ నటి ప్రకటన నిజంగా అభిమానులకు షాకిచ్చింది. ఇంతటి అందగత్తె, తమ ఆరాధ్య దేవతతో ఒక్కసారైనా సెల్ఫీ దిగాలనుకోవడం లేదా ఫోటో దిగాలని కలలు కనడం సహజమే కానీ, ఇప్పుడు బాత్ టబ్ లోకి ఆమె ఒంటిపై నుంచి జాలువారిన నీటితో తయారు చేసే సబ్బును మార్కెట్లోకి రిలీజ్ చేస్తానని ప్రకటించింది ఈ పాపులర్ నటి.
తన అందం ఆకర్షణతో ఎంతగా మత్తు చల్లుతోందో ఇప్పుడు అభిమానులు అర్థం చేసుకోవచ్చు. ఈ భామ జలకాలాడే బాత్ టబ్ నుంచి బబుల్స్ ని సేకరించి మరీ సబ్బు తయారీ కోసం ఉపయోగిస్తారట. అలా ఒంటిపై నుంచి జాలువారే ఒక్కో నీటి బిందువును సేకరిస్తారు. ఈ అమ్మడు తాగే నీటిని కూడా అవసరమైతే సబ్బు తయారీకి ఉపయోగిస్తారట. ఇది వినడానికి కొంత వింతగా ఉన్నా కానీ, ఇదే నిజం. ఇంతకీ ఎవరు ఈ భామ? అంటే.. సిడ్నీ స్వినీ. బ్లాక్‌బస్టర్ షో యుఫోరియాతో సిడ్నీకి చాలా గుర్తింపు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్ ఆమె.
తనకు ఉన్న క్రేజ్ ని విభిన్న మార్గాల్లో మార్కెటింగ్ చేసి ఆర్జించాలని ప్లాన్ చేసింది. సిడ్నీ స్వినీ బాథింగ్ వాటర్ తో చేసే ఈ సబ్బు రూపకల్పన కోసం డాక్టర్ స్క్వాచ్ సోప్‌తో సిడ్నీ భాగస్వామ్యం కలిగి ఉంది. సుమారు 5000 సోప్ పీసెస్ మాత్రమే తయారు చేస్తారు. ప్రతి సబ్బు వెల 8 డాలర్లు.. అంటే దాదాపు రూ.700. ఫ్యాన్స్ డిమాండ్ మేరకే సిడ్నీ సినీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని చెబుతోంది. ఆమె అందాన్ని దూరం నుంచి మాత్రమే అభిమానులు చూడగలరు. కానీ ఇప్పుడు ఆమె అందాన్ని తాకిన నీటి బిందువులు తమ శరీరంపై నాట్యం చేయాలని ఆరాటపడే అభిమానులందరికీ ఇది అద్భుత వార్త.