వాయిస్‌ ఆఫ్‌ బేబమ్మ దర్శకత్వం...!

కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది అనడంలో సందేహం లేదు.

Update: 2024-05-10 11:30 GMT

ఒకప్పుడు బుల్లి తెర నటీనటులు, యాంకర్స్‌ కి మరియు రేడియో జాకీలకు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ గౌరవం మరియు గుర్తింపు ఉండేది కాదు. సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీలతో పోల్చితే వారిని కాస్త తక్కువగానే చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది అనడంలో సందేహం లేదు.


బుల్లి తెర ద్వారా గుర్తింపు తెచ్చుకున్న చాలా మంది స్టార్స్ హీరోల స్థాయిలో ఆదరణ దక్కించుకున్నారు. జనాల్లో హీరోల మాదిరిగా పాపులారిటీని సొంతం చేసుకున్నారు. రేడియో జాకీలకు కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న రోజులు ఇవి. ఈ మధ్య కాలంలో ఆర్జే కమ్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ అయిన డార్లింగ్‌ శ్వేత గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది.

ఉప్పెన సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడంలో బేబమ్మ పాత్ర ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బేబమ్మ పాత్ర అంతటి హిట్‌ అవ్వడానికి కారణం ఆమె వాయిస్ అనడంలో మరెలాంటి డౌట్‌ లేదు. అలాంటి వాయిస్ ను డార్లింగ్ శ్వేత ఇచ్చింది.

ఉప్పెన సినిమాలోని హీరోయిన్‌ పాత్రకు డార్లింగ్‌ శ్వేత ఇచ్చిన వాయిస్ అదనపు బలం గా నిలిచింది. డబ్బింగ్‌ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలకు వర్క్‌ చేసిన శ్వేత ఇప్పుడు దర్శకురాలిగా పరిచయం అవ్వబోతుంది. బిగ్‌ బెన్ ప్రొడక్షన్‌ లో శ్వేత దర్శకత్వంలో ఒక సినిమా రూపొందబోతుంది.

తరుణ్‌ భాస్కర్‌, భరత్‌ కమ్మ, సంజీవ్ రెడ్డి ఇంకా చాలా మంది కొత్త వారిని ప్రోత్సహించి వారిలోని టాలెంట్‌ ని గుర్తించిన బిగ్‌ బెన్‌ సంస్థ ఇప్పుడు శ్వేతకు దర్శకత్వం ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇండస్ట్రీలో లేడీ దర్శకుల ప్రభావం తక్కువ. మరి శ్వేత ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అనేది చూడాలి.

Tags:    

Similar News