నిఖిల్ స్వయంభూ టీజర్.. ఏ రేంజ్ లో ఉందంటే..
రాజుల కాలంలో ఫ్యూచర్ ను డిసైడ్ చేసే రాజ దండాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు జరిగే యుద్ధాలే సినిమా మెయిన్ స్టోరీ లైన్ గా టీజర్ ద్వారా అర్థమవుతోంది.;
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా స్వయంభూపై ఆడియన్స్ లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో సంయుక్త మీనన్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఆ మూవీ.. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న విడుదల కానుంది.
అయితే రిలీజ్ కు ముందు వరుస అప్డేట్స్ తో మంచి బజ్ క్రియేట్ చేస్తున్న స్వయంభూ మేకర్స్.. తాజాగా టీజర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన టీజర్.. అందరినీ ఆకట్టుకుంటోంది. అదిరిపోయే విజువల్స్.. గ్రాండ్ మేకింగ్ తో సినీ ప్రియులను మెప్పిస్తోంది. ఇప్పటికే నిఖిల్ చెప్పినట్లు.. న్యాయపరమైన పాలనకు సింబల్ గా నిలిచే రాజదండం సెంగోల్ చుట్టూ మూవీ సాగుతుందని టీజర్ ద్వారా క్లారిటీ వచ్చింది.
రాజుల కాలంలో ఫ్యూచర్ ను డిసైడ్ చేసే రాజ దండాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు జరిగే యుద్ధాలే సినిమా మెయిన్ స్టోరీ లైన్ గా టీజర్ ద్వారా అర్థమవుతోంది. ఆ యుద్ధాల్లో ధర్మం కోసం పోరాడే ఓ యోధుడిగా నిఖిల్ ఎంట్రీ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. 985 ఏడీ కాలానికి ప్రేక్షకులను తీసుకెళ్లేలా క్రియేట్ చేసిన భవనాలు, సెట్స్, కాస్ట్యూమ్స్, విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయనే చెప్పాలి.
అదే సమయంలో సినిమాలో నిఖిల్ నెవ్వర్ బిఫోర్ అనేలా కనిపించనున్నారు. యోధుడి పాత్ర కోసం బాడీ లాంగ్వేజ్ లో భారీ ట్రాన్స్ఫర్మేషన్ చూపించారు. ఆయన లుక్ అదిరిపోయేలా ఉండగా.. టీజర్ లో ప్రతి విజువల్ లో కూడా ఓ రేంజ్ లో మెప్పించారు. పాత్రలో పూర్తిగా లీనమైనట్లు కనిపించడం.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆయన పెర్ఫార్మెన్స్ సినిమాకు బిగ్ అసెట్ గా మారేలా కనిపిస్తుంది.
హీరోయిన్స్ సంయుక్త మీనన్, నభా నటేష్ రోల్స్ ను టీజర్ లో పెద్దగా రివీల్ చేయకపోయినా కీలక పాత్రలు పోషిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి టీజర్.. సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. ముఖ్యంగా టెక్నికల్ పరంగా స్వయంభూ ఒక పవర్ హౌస్ లా కనిపిస్తోంది. ప్రొడక్షన్ వాల్యూస్, ఇంటర్నేషనల్ రేంజ్ యాక్షన్ కొరియోగ్రఫీ, 3డీ విజువల్స్ సినిమాకు హైలైట్ గా నిలవనున్నాయి.
మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ ను మరింత గ్రాండ్ గా మార్చింది. అయితే హైదరాబాద్ లోని పీసీఎక్స్ థియేటర్‌లో మీడియా కోసం ప్రదర్శించిన 3డీ టీజర్ అందరినీ ఫిదా చేసిందని సమాచారం. ప్రతి ఫ్రేమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ను కొత్త స్థాయికి తీసుకెళ్తుందనే టాక్ వినిపిస్తోంది. మరి ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో విడుదల కానున్న స్వయంభూ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.