• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హీరోలున్నా.. ఆమె పేరు ఒక...

హీరోలున్నా.. ఆమె పేరు ఒక బ్రాండ్!

| తెలుగు సినిమా స్వర్ణయుగం గురించి మాట్లాడితే, ఆ కాలం నటీనటుల ప్రతిభ, పాత్రల బలం, కథల లోతు ఇప్పటికీ చర్చకు వస్తూనే ఉంటాయి.

By - Sravani Lakshmi Srungarapu
Update: 2026-04-30 12:30 GMT

తెలుగు సినిమా స్వర్ణయుగం గురించి మాట్లాడితే, ఆ కాలం నటీనటుల ప్రతిభ, పాత్రల బలం, కథల లోతు ఇప్పటికీ చర్చకు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఎస్.వి. రంగారావు, సూర్యకాంతం వంటి మహానటుల స్థాయి ఎందుకు ఇప్పటికీ అందనిదిగా ఉందనే ప్రశ్నకు సమాధానం వెతికితే, అప్పటి సినీ సంస్కృతి, పాత్రల నిర్మాణం, నటనలో సహజత్వం వంటి అంశాలు ప్రధాన కారణాలుగా కనిపిస్తాయి. ఆ కాలంలో నటులు పాత్రలో మునిగిపోయి జీవించేవారు. అందుకే సూర్యకాంతం తెరపై కనిపిస్తే, అది నటనగా కాకుండా నిజ జీవితంలో చూసే వ్యక్తిలా అనిపించేదని సినీ వర్గాలు ఇప్పటికీ గుర్తుచేస్తుంటాయి. ఆమె నటనలోని సహజత్వం, టైమింగ్, డైలాగ్ డెలివరీ.. ఇవన్నీ కలిపి ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి.

ఈ సహజ నటనకు మరో పెద్ద నిదర్శనం, ఆమెకు వచ్చిన ప్రశంసలు. భారతీయ సినీ ప్రపంచంలో విభిన్న పాత్రలతో తనదైన గుర్తింపు పొందిన కమల్ హాసన్ సైతం సూర్యకాంతం యాక్టింగ్ ను మెచ్చుకోవడం విశేషం. ఒకసారి సహజ నటుల గురించి డిస్క‌ష‌న్ జరుగుతున్న సందర్భంలో, తమిళంలో కూడా సూర్యకాంతంలాంటి నేచురల్ ఆర్టిస్ట్‌ను చూడలేదని ఆయన చెప్పినట్లు సినీ వర్గాల్లో ప్రసిద్ధి. ఇది కేవలం ఒక ప్రశంస మాత్రమే కాదు, ఆమె నటనా వైభవానికి వచ్చిన అరుదైన గుర్తింపుగా భావించాలి. ఒక భాషకు చెందిన ఆర్టిస్ట్ ప్రతిభను మరొక భాషలోని దిగ్గజం ఈ స్థాయిలో ప్రశంసించడం చూస్తుంటే ఆమె రేంజ్ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు.

అయితే సూర్యకాంతం గొప్పతనం కేవలం యాక్టింగ్ లోనే కాకుండా, ఆమె వ్యక్తిత్వంలో కూడా స్పష్టంగా కనిపించేది. సెట్స్‌లో ఆమె ఉత్సాహభరితమైన వాతావరణాన్ని సృష్టించేవారని, అందరితో సరదాగా మెలిగేవారని సహచరులు చెబుతుంటారు. ఆమె ఇంటి నుంచి తెచ్చిన భోజనాన్ని యూనిట్ సభ్యులతో పంచుకోవడం, ఎవరూ తినకపోతే బలవంతంగా తినిపించడం వంటి సంఘటనలు ఆమె మానవత్వాన్ని చూపిస్తాయి. అదే సమయంలో, సావిత్రి, ఛాయాదేవి వంటి నటీమణులతో కలిసి ఉన్నప్పుడు సెట్స్ మొత్తం ఒక కుటుంబ వాతావరణంలా మారేదని చెప్పడం ఆమె స్నేహపూర్వక స్వభావానికి నిదర్శనం.

ఇక ఆమె కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన గుండమ్మ కథ సినిమాను తీసుకుంటే, అప్పటి సినీ సంస్కృతిలో ఉన్న ప్రత్యేకతలు మరింత స్పష్టమవుతాయి. సీనియ‌ర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి స్టార్ హీరోలు నటించినప్పటికీ, సినిమా టైటిల్‌ను ఒక మహిళా పాత్ర పేరు మీద పెట్టడం నిజంగా సాహసోపేత నిర్ణయం. ఇది కేవలం టైటిల్ మాత్రమే కాదు, కథలో సూర్యకాంతం పాత్ర ఆధిపత్యాన్ని ప్రతిబింబించే అంశం. హీరోలున్నా, కథను నడిపించింది గుండమ్మ పాత్రే. ఇది అప్పట్లో మహిళా పాత్రలకు ఇచ్చిన ప్రాధాన్యతను స్పష్టంగా చూపిస్తుంది.

ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆ రోజుల్లో స్టార్ ఈగో అనే భావన చాలా తక్కువగా ఉండేది. పెద్ద హీరోలు తమ పేర్లు టైటిల్‌లో ఉండాలని పట్టుబట్టకుండా, కథ, పాత్రల బలం ముందు త‌ల‌వంచి వాటికే ప్రాధాన్యత ఇచ్చేవారు. అదే కారణంగా గుండమ్మ కథ వంటి సినిమాలు తెరకెక్కి, పాత్రలే బ్రాండ్‌గా నిలిచాయి. ప్రేక్షకులు హీరో పేర్ల కన్నా, పాత్రల పేర్లను గుర్తుపెట్టుకునేలా కథనం ఉండేది. గుండమ్మ అనే పేరు అప్పటివరకు పెద్దగా వినిపించకపోయినా, ఈ సినిమా తర్వాత అది ప్రతి ఇంట్లో వినిపించే పేరుగా మారింది.

Tags:    
  • suryakantham 
  • telugucinema 
  • goldenera 
  • gundammakatha 
  • kamalhaasan 
  • naturalacting 
  • teluguactress 
  • svrangarao 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS