• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తీవ్ర విషాదం... గుంటూరులో...

తీవ్ర విషాదం... గుంటూరులో స్టార్ హీరో అభిమానులు మృతి!

| తమ హీరోలపై తమకున్న అభిమానాన్ని చాటుకునే క్రమంలో చాలా మంది అభిమానులు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఇదే సమయంలో మరికొంతమంది ప్రమాధవసాత్తు ప్రాణాలు పోగొట్టుకుంటుంటారు.

By - Tupaki Desk
Update: 2023-07-23 06:49 GMT

తమ హీరోలపై తమకున్న అభిమానాన్ని చాటుకునే క్రమంలో చాలా మంది అభిమానులు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఇదే సమయంలో మరికొంతమంది ప్రమాధవసాత్తు ప్రాణాలు పోగొట్టుకుంటుంటారు. ఇందులో భాగంగా... తాజాగా ఒక స్టార్ హీరో అభిమానులు ఫ్లెక్సీలు కడుతూ మృతి చెందారని తెలుస్తుంది.

అవును... ప్రముఖ సినీ నటుడు, హీరో సూర్య పుట్టినరోజు వేడుకల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. అభిమాన హీరో పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీ కడుతూ ఇద్దరు యువకులు కరెంట్ షాక్ తగిలి మృతి చెందారు. దీంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ఆ యువకుల మృతికి సూర్య ఫ్యాన్స్ తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు.

ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావపేట మండలం కోటప్పకొండ సమీపంలోని మోపువారిపాలెంలో నిషాదం నెలకొంది. సూర్య పుట్టినరోజు సందర్భంగా ముగ్గురు యువకులు ఆదివారం తెల్లవారుజామున ఫ్లెక్సీలు కట్టాలని ఫిక్సయ్యారు. ఈసమయంలో పక్కనే ఉన్న కరెంట్ స్థంభం నుంచి షాక్ కొట్టింది.

ఈ క్రమంలో ఫ్లెక్సీ ఇనుప ఫ్రేమ్‌ అక్కడే పైనున్న విద్యుత్‌ తీగలకు తగలడంతో ఇద్దరు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో నక్క వెంకటేష్ (19), పోలూరి సాయి (20) అనే ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన అతడిని గ్రామస్తులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

మృతులు వెంకటేష్, సాయి డిగ్రీ రెండో ఏడాది చదువుతున్నట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేశారు. యువకుల ఆకస్మిక మరణాలతో.. వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటగా.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

కాగా... ప్రసుతం హీరో సూర్య "కంగువా" అనే పీరియాడిక్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌ తో కలిసి యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తుంది. ఆదివారం సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసింది మూవీ టీమ్.

Tags:    
  • Suriya 
  • Guntur 
  • AndhraPradesh 
  • MovieNews 

Similar News

సాయి అభ్యంకర్‌.. అప్పుడే తేల్చేస్తారా!

2026-11-24 06:33 GMT

నీతూ మాస్టర్ ఎలిమినేషన్‌పై భర్త ఫైర్.. పూరీ, అలీకి నటరాజ్ మాస్టర్ స్ట్రాంగ్ వార్నింగ్!

2026-11-24 06:32 GMT

కమర్షియల్ సినిమాల్లో ఈ ఎలిమెంట్స్ ఉంటే హిట్టు పక్కనా?

2026-11-24 06:31 GMT

సీతమ్మ‌ పాత్ర‌ను నితీష్ పున‌రాలోచించాల్సిందే!

2026-11-24 06:30 GMT

ఓటీటీలోకి నేరుగా తెలుగు వెర్షన్.. మహిళల ఆదరణ దక్కేనా?

2026-11-24 05:43 GMT

దీపిక‌తో బ‌ల‌వంతంగా ఇల్లు ఊడ్పించిన ట్రైన‌ర్!

2026-11-24 05:43 GMT

శ్రేయా ఘోషల్‌తో క‌పూర్ బ్యూటీ మ్యూజికల్ జర్నీ!

2026-11-24 05:43 GMT

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ టైటిల్ ఇదేనా?

2026-11-24 05:41 GMT

షాహిద్.. సైఫ్‌ హుందాతనానికి బాలీవుడ్ ఫిదా!

2026-11-24 04:18 GMT

చిరకాల ప్రేయసితో ఏడడుగులు వేసిన నటుడు!

2026-11-24 04:18 GMT

సంపత్ నంది కి టాలెంట్ ఉన్నప్పటికీ స్టార్ డైరెక్టర్ అవ్వకపోవడానికి కారణమేంటి..?

2026-11-24 03:56 GMT

క్లిన్ కారాను స్కూల్‌కి వెళ్ల‌మంటే మారాం చేస్తోందా!

2026-11-24 03:50 GMT

Copyright @2026

Powered by Blink CMS