ఆ నిర్మాతకు కలిసి రావట్లేదా?... 18 రోజుల్లోనే భారీ ఎదురుదెబ్బలు
టాలీవుడ్ లో ఓ హీరోతో సమానంగా క్రేజ్ ఉన్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఇండస్ట్రీలో నిర్మాతల్లో ఆయనకున్న క్రేజ్ వేరు.;
టాలీవుడ్ లో ఓ హీరోతో సమానంగా క్రేజ్ ఉన్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఇండస్ట్రీలో నిర్మాతల్లో ఆయనకున్న క్రేజ్ వేరు. సోషల్ మీడియాలో ఆయన స్పీచ్ లు, డైలాగ్ లు వైరల్ అవుతుంటాయి. అయితే ఆయనకు అంత క్రేజ్ ఊరికే రాలేదు. కెరీర్ లో ఏ నిర్మాతకు కాడా సాధ్యం కాని సక్సెస్ రేట్ సాధించాడు. వరుస సినిమాలు హిట్ కొడుతూ ఇండస్ట్రీ దృష్టిని తనవైపునకు తిప్పుకున్నాడు.
ఆయన బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి సినిమా వస్తుందంటే.. అది మినిమమ్ గ్యారెంటీ అనేవాళ్లు. బడా నిర్మాతలు సైతం నాగవంశీని చూసి షాక్ అయ్యాకు కూడా. అతడు మంచి కథలు ఎంపిక చేసుకొని సినిమాలు తీస్తున్నాడని అందరూ మెచ్చుకున్నారు. ఇక సినిమాలు నిర్మించడమే కాదు.. వంశీ డిస్ట్రిబ్యూషన్ లోకి కూడా దిగాడు. ఇక్కడ కూడా మంచి సక్సెస్ రేట్ సాధించాడు. అలా ఒకానొక టైమ్ లో వంశీని గోల్డెన్ హ్యాండ్ అన్నారు.
అయితే ఇండస్ట్రీలో సినిమా వ్యాపారం ఓ రకంగా జూదం లాంటిదే. ఇక్కడ ఎక్కువ కాలం సక్సెస్ తో కొనసాగడం చాలా కష్టం. కాలం కలిసిరాకపోతే ఒక్క సినిమాతోనే జాతకం మారిపోతుంది. రాత్రికి రాత్రే సీన్ రివర్స్ అయిపోతుంది. ఇందుకు వంశీ మినహాయింపు ఏమీ కాదు. గత నెలాఖరు నుండి నెల రోజుల టైమ్ లో వంశీ మూడు సినిమాలు రిలీజ్ కు పెట్టుకున్నాడు. ఈ సినిమాలు సూపర్ సక్సెస్ సాధించి.. తనను ఇంకో రేంజ్ లో నిలబెడతాయని అనుకున్నాడు. కానీ ఇక్కడే అనుకున్న ఫలితం రాలేదనిపిస్తోంది.
తొలుత జులై 30న తాను ప్రొడ్యూసర్ గా రూపొందించిన కింగ్డమ్ సినిమా రిలీజ్ చేశాడు. ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. తొలి వీకెండ్ లో ఫర్వాలేదనిపించినా.. ఆ తర్వాత ఫేడ్ ఔట్ అయ్యింది. విజయ్ గత చిత్రాలతో పోలిస్తే.. కింగ్డమ్ కు వసూళ్లు వచ్చినా.. బడ్జెట్ ఎక్కువవడంతో అది నష్టాలే మిగిల్చుంది. ఈ నష్టాలు వార్ 2 భర్తీ చేస్తుందని భావించి.. యశ్ రాజ్ ఫిల్మ్ నుంచి తెలుగు హక్కులను రూ.80 కోట్లకు దక్కించుకున్నాడు.
భారీ అంచనాలతో రిలీజైన వార్ 2 నాగవంశీకి పెద్ద దెబ్బ కొట్టేలా ఉంది. బాక్సాఫీస్ వద్ద కూలీతో పోటీ పడ్డ వార్ 2 ప్రీ బుకింగ్స్ నుంచే వెనుకబడింది. ఇక ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. ఇప్పటికే హాలీడే స్ లో రెండు రోజులు గడిచిపోయాయి. మిగిలింది సండే ఒక్కటే. అయితే టాక్ కూడా అంత గొప్పగా ఏమీ లేకపోవడంతో, ఆయన పెట్టుబడి అంతా ఆదివారం కవర్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
ఇక రవితేజ సినిమా మాస్ జాతర ఇదే నెల 27న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, టీజర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై పెద్దగా బజ్ ఏర్పడలేదు. అందుకే సినిమాను వాయిదా వేయాలని డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే 2025లో తొలి భాగంలో డాకు మహారాజ్, తర్వాత మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో హిట్ కొట్టి హ్యాపీగా నాగవంశీకి, 17 రోజుల్లోనే భారీ దెబ్బ తగిలింది.