హీరో కన్నా ముందు హీరోయిన్ ని దించారేంటి..?
సూర్య రెట్రో సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో పూజా తిరిగి సౌత్ లో ఫాంలోకి రావాలని చూస్తుంది.;
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్ లో రెట్రో అంటూ ఒక క్రేజీ ప్రాజెక్ట్ వస్తుంది. ఈ సినిమాను సూర్య తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. ఈమధ్య సూర్య సోషల్ మెసేజ్ తో కూడిన సినిమాలు చేస్తూ వచ్చారు. అందుకే తనలోని మాస్ ని మిస్ అవుతున్న ఫ్యాన్స్ కోసం సూర్య రెట్రో చేస్తున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ కూడా ఈ సినిమాతో పెద్ద్ ప్లానింగ్ తో వస్తున్నాడు. కార్తీక్ సినిమాలకు తమిళ్ లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే రెట్రో మీద సూర్య ఫ్యాన్స్ తో పాటు ప్రతి సినీ లవర్ కొన్ని అంచనాలు పెట్టుకున్నాడు.
సూర్య రెట్రో సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో పూజా తిరిగి సౌత్ లో ఫాంలోకి రావాలని చూస్తుంది. ఐతే రెట్రో సినిమా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మే 1న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఐతే ఇప్పటికే రెట్రో ప్రమోషన్స్ మొదలు పెట్టారు మేకర్స్. తమిళ్ లో ఏమో కానీ తెలుగులో ఆ సినిమా హీరోయిన్ తో ప్రమోషన్స్ చేస్తున్నారు.
సూర్య రెట్రో గురించి పూజా హెగ్దే వరుస ఇంటర్వ్యూస్ ఇస్తుంది. తెలుగులో రాధే శ్యామ్ తర్వాత అమ్మడు మళ్లీ ఛాన్స్ అందుకోలేదు. ఐతే తెలుగులో సినిమాలు చేయకపోయినా సరే ఆమెకు ఉన్న ఫాలోయింగ్ తెలుసు కాబట్టే రెట్రోకి ఆమెతో ప్రమోషన్స్ మొదలు పెట్టారు సూర్య అండ్ టీం. ఐతే సూర్య రెట్రో సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో పూజా హెగ్దే తెలుగు ఛాన్స్ ల గురించి కూడా ప్రస్తావించింది. తెలుగులో నటించాలనే కోరిక ఉన్నా ఇక్కడ నుంచి సరైన ఛాన్స్ లు రావట్లేదని అన్నది అమ్మడు.
రెట్రో సినిమా తెలుగు ప్రమోషన్స్ పూజా హెగ్దే తో మొదలు పెట్టడంలో సూర్య మాస్టర్ ప్లాన్ ఏంటన్నది తెలియాల్సి ఉంది. ఐతే ఇక్కడ పూజా ఫాలోయిన్ ని క్యాష్ చేసుకునేందుకే ఆమెతో ఈ ప్రచారం మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. పూజా హెగ్దే తో మొదలు పెట్టి సూర్యతో ప్రమోషన్స్ అదరగొట్టాలని చూస్తున్నారు. సూర్యకు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన ప్రతి సినిమా ఇక్కడ మంచి రిలీజ్ లు అందుకుంటాయి.
సూర్య రెట్రో సినిమాను తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేస్తున్నారు. అందుకే తెలుగు ప్రమోషన్స్ ని కూడా భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. తెలుగులో పూజా రెట్రో ఇంటర్వ్యూస్ ఇవ్వడం వెనక ప్లానింగ్ కూడా సితార వాళ్లదే అని టాక్. ఏది ఏమైనా సూర్య రెట్రోతో వింటేజ్ లుక్స్ తో అదరగొడతాడని అంటున్నారు. మరి కార్తీక్ సూర్య కాంబో నిజంగా ఆశించిన రేంజ్ ఫలితాన్ని అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.