సూర్య కరుప్పు ఫస్ట్ లుక్ వచ్చేసింది..!

యాక్షన్ ఎంటర్టైనర్ గా మాస్ ప్రియులను మెప్పించేందుకు వస్తుంది కరుప్పు. ఈ సినిమాను కరుప్పు టైటిల్ తోనే తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు.;

Update: 2025-07-22 17:20 GMT

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నెక్స్ట్ సినిమా ఆర్ జె బాలాజీ డైరెక్షన్ లో చేస్తున్నాడు. రెట్రో తో తన వింటేజ్ మాస్ అప్పీల్ తో ఫ్యాన్స్ ని అలరించిన సూర్య మరోసారి తన మాస్ జోరు కొనసాగిస్తున్నాడు. ఆర్ జె బాలాజీ డైరెక్షన్ లో సూర్య చేస్తున్న సినిమాకు కరుప్పు అని టైటిల్ లాక్ చేశారు. కరుప్పు సినిమా ఫస్ట్ లుక్ చూస్తే బ్లాక్ కలర్ షర్ట్, పంచెతో కళ్లకు గాగుల్స్, ఇంకా నోట్లో సిగార్ తో సూర్య లుక్కు అదిరిపోయింది.

 

ఈ సినిమాను ఎస్.ఆర్.ప్రభు, ఎస్.ఆర్ ప్రకాష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా డివోషనల్ బ్యాక్ డ్రాప్ తో వస్తుందని తెలుస్తుంది. సూర్య బర్త్ డే సందర్భంగా కరుప్పు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. మూవీ టీజర్ బుధవారం వస్తుంది. సూర్య మాస్ లుక్ తో కరుప్పు పోస్టర్ అదిరిపోయింది.

ఆర్జె బాలజి ఇదివరకు చేసిన సినిమాల కన్నా ఈసారి స్టార్ హీరో సూర్యతో చేస్తున్న ఈ ప్రయత్నం సంథింగ్ స్పెషల్ గా ఉండేలా ఉంది. కరుప్పు సినిమాలో సూర్య సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. సూర్య, త్రిష ఇద్దరిది సూపర్ హిట్ జోడీ.. మరోసారి ఈ ఇద్దరు కలిసి స్క్రీన్ పై తమ మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నారు.

యాక్షన్ ఎంటర్టైనర్ గా మాస్ ప్రియులను మెప్పించేందుకు వస్తుంది కరుప్పు. ఈ సినిమాను కరుప్పు టైటిల్ తోనే తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. సూర్యకు తెలుగులో కూడా సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమా వస్తుంది అంటే చాలు తెలుగు ఆడియన్స్ కూడా అలర్ట్ అవుతారు. తప్పకుండా కరుప్పు సినిమాకు కూడా తెలుగులో మంచి బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.

ఆర్ జె బాలాజీ తను చెప్పే కథలు అన్నీ కూడా చాలా ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లో ఉన్నాయి. ఇప్పుడు రాబోతున్న కరుప్పు సినిమా కూడా అదే తరహాలో ఉంటుందని చెప్పొచ్చు. సూర్య నుంచి ఫ్యాన్స్ కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న మాస్ మూవీగా కరుప్పు వస్తుంది. సూర్య అసలు సిసలైన మాస్ స్టామినా ఏంటో చూపించేలా కరుప్పు వస్తుంది. తప్పకుండా ఈ మూవీపై ఉన్న అంచనాలను అందుకునేలా మూవీ ఉంటే మాత్రం రికార్డులను తిరగ రాస్తుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News