• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సూర్య కెరీర్ ను మార్చబోయే...

సూర్య కెరీర్ ను మార్చబోయే సినిమా

| సౌత్ ఇండియన్ స్టార్ యాక్టర్ సూర్య బాలీవుడ్ లోకి డెబ్యూ ఇవ్వడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్ర కర్ణ మూవీని సూర్యతో చేయాలని ప్లాన్ చేస్తున్నారంట.

By - Tupaki Desk
Update: 2023-10-04 04:17 GMT

సౌత్ ఇండియన్ స్టార్ యాక్టర్ సూర్య బాలీవుడ్ లోకి డెబ్యూ ఇవ్వడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్ర కర్ణ మూవీని సూర్యతో చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. మహాభారతంలో కర్ణుడి పాత్రకి ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అందుకే ఆ పాత్ర దృక్కోణం నుంచి మహాభారతం కథని చెప్పడంతో పాటుగా, కర్ణుడి జీవిత వృత్తాంతం కూడా మూవీలో ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది.

ఆనంద్ నీలకంఠన్ కర్ణ స్క్రిప్ట్ సిద్ధం చేశారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించడానికి ముందుకొచ్చింది. కర్ణుడి పాత్రకి సూర్య కరెక్ట్ గా న్యాయం చేస్తారని రాకేష్ ఓం ప్రకాష్ అతనిని సంప్రదించడం, కథని కూడా పలుమార్లు నేరేట్ చేయడం జరిగిందని సమాచారం. ఈ చిత్రం కోసం అన్ని భాషల నుంచి నటీనటులని ఎంపిక చేయనున్నారంట.

మూవీ కోసం ఏకంగా 500 కోట్ల వరకు బడ్జెట్ ఖర్చు పెట్టనున్నారని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. వీలైనన్ని ఎక్కువ భాషలలో కర్ణ మూవీని తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సూర్య శివ దర్శకత్వంలో కంగువ మూవీ చేస్తున్నారు. సుమారు 300 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీని తర్వాత సుధా కొంగరతో ఒక సినిమా చేయడానికి సూర్య కమిట్ అయ్యారు.

అలాగే వాడివాసల్ దర్శకత్వంలో కూడా ఒక ప్రాజెక్ట్ చేయనున్నారు. అయితే కర్ణ మూవీ షూటింగ్ 2024 జులైలో ప్రారంభించనున్నారని తెలుస్తోంది. అంటే కర్ణ కంప్లీట్ చేసిన తర్వాతనే ఇంకా ఏ మూవీ అయిన సూర్య చేయాల్సి ఉంటుంది. సూర్య కోలీవుడ్ కి చెందిన యాక్టర్ అయిన ఇప్పటికే పాన్ ఇండియా లెవల్ లో ఇమేజ్ ని బిల్డ్ చేసుకున్నారు.

అందుకే కర్ణ పాత్రకి సూర్యనే కరెక్ట్అని రాకేష్ ఓం ప్రకాష్ అతన్ని ఫైనల్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. మరో వైపు విక్రమ్ హీరోగా సూర్యపుత్ర మహావీర్ కర్ణ అనే మరో ప్రాజెక్ట్ కూడా సిద్ధం అవుతోంది. ఆర్.ఎస్.విమల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. విక్రమ్ పై గతంలో ఈ మూవీ టెస్ట్ షూట్ కూడా జరిగింది. త్వరలో పూర్తిస్థాయిలో షూటింగ్ స్టార్ట్ చేస్తారనే టాక్ ఉంది.

Tags:    
  • Kollywood 
  • Superstar 
  • Suriya 
  • Bollywood 
  • Debut 
  • Rakeshomprakashmehra 
  • Karna 
  • Karnamovie 

Similar News

దేవుడి కీర్తనను రాజకీయం చేస్తారా ?

2026-11-03 17:50 GMT

విజయ్ దేవరకొండ కష్టం మొత్తం ఎక్కడికి పోతుంది?

2026-11-03 17:30 GMT

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

Copyright @2026

Powered by Blink CMS