తెలుగు మార్కెట్‌పై సూర్య భారీ ఆశలు..
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా సినిమా వీరభద్రుడు రిలీజ్ కు సిద్ధమవుతున్నా, సినిమా చుట్టూ ఏర్పడిన పరిస్థితులు మాత్రం సాధారణంగా లేవు.;
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా సినిమా వీరభద్రుడు రిలీజ్ కు సిద్ధమవుతున్నా, సినిమా చుట్టూ ఏర్పడిన పరిస్థితులు మాత్రం సాధారణంగా లేవు. అసలు ఈ సినిమా మొదట కరుప్పు టైటిల్ తో ప్రారంభమైంది. కానీ తెలుగులో మాస్ కనెక్ట్ కోసం టైటిల్‌ను వీరభద్రుడుగా మార్చడం మేకర్స్ తీసుకున్న కీలక నిర్ణయంగా మారింది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యేలా నేటివిటీ టచ్ ఇచ్చే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ టైటిల్ మార్పు నిజంగానే సినిమాకు అదనపు బలం అవుతుందా? లేదా అన్నది ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా మే 14 రిలీజ్‌పై కూడా కొద్దిరోజుల క్రితం వరకు అనుమానాలే నెలకొన్నాయి. తమిళనాడులో విజయ్ పొలిటికల్ ఎంట్రీ, సీఎం రేస్ చుట్టూ తిరుగుతున్న హైడ్రామా కారణంగా అక్కడి మీడియా, సోషల్ మీడియా, జనాల్లో మొత్తం ఫోకస్ రాజకీయాలపైనే వెళ్లిపోయింది. దాంతో వీరభద్రుడు ప్రమోషన్స్ అనుకున్న స్థాయిలో హైలైట్ కాలేదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే పలు వాయిదాలతో సినిమా హైప్ దెబ్బతిన్న పరిస్థితిలో ఇంకోసారి వాయిదా పడితే ప్రాజెక్ట్‌కు పెద్ద నష్టం జరిగేదనే టాక్ కూడా ఉంది. అందుకే మేకర్స్ ఇక రిస్క్ చేయకుండా రిలీజ్‌ను ఫైనల్ చేశారు.
ఈ సినిమాకు మరో మెయిన్ ఎట్రాక్షన్ సూర్య చేస్తున్న డ్యూయల్ రోల్. ఒకవైపు లాయర్‌గా, మరోవైపు దేవుడి తరహా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం ఆసక్తిని పెంచుతోంది. ఫాంటసీ, యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో మాస్ ఆడియన్స్‌ను ఎంతవరకు ఆకట్టుకుంటుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది. డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఈ కాన్సెప్ట్‌ను ఎలా హ్యాండిల్ చేశారన్న దానిపైనే ఫలితం ఆధారపడనుంది.
అయితే ఈ సినిమా పరిస్థితి కోలీవుడ్ లో ఎలా ఉన్నా, తెలుగు మార్కెట్‌పై మాత్రం ట్రేడ్ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. గతంలో పలు తమిళ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు భారీ స్థాయిలో ఆదరణ ఇచ్చారు. భాషతో సంబంధం లేకుండా కంటెంట్ ఉంటే సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్తారు తెలుగు ప్రేక్షకులు. ఇప్పుడు వీరభద్రుడు విషయంలో కూడా అదే ఫ్యాక్టర్ పని చేస్తుందనే నమ్మకం అందరిలోనూయూనిట్‌లో కనిపిస్తోంది. పైగా ఈ సినిమాను తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ రిలీజ్ చేయడం మరో ప్లస్‌గా భావిస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ స్ట్రెంగ్త్, థియేటర్ ప్లానింగ్, మాస్ రీచ్ పరంగా ఇది సినిమాకు ఉపయోగపడొచ్చని అంచనా.
ఇక సూర్య కెరీర్ పరంగా చూస్తే ఈ సినిమా అతనికి చాలా కీలకంగా మారింది. గత కొంతకాలంగా ఆయనకు భారీ థియేట్రికల్ బ్లాక్‌బస్టర్ దక్కలేదు. ఓటీటీలో ప్రశంసలొచ్చినా, బాక్సాఫీస్ వద్ద పాత స్థాయి మాస్ ఇంపాక్ట్ మాత్రం కనిపించలేదు. అలాంటి సమయంలో వీరభద్రుడు హిట్ అయితే సూర్య మార్కెట్ మళ్లీ బలపడే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలుగులో మంచి కలెక్షన్లు వస్తే ఆయనకు కొత్త ఊపు రావచ్చు. కానీ ఈ సినిమా కూడా ఆశించిన ఫలితం ఇవ్వకపోతే మాత్రం సూర్య మార్కెట్‌పై ప్రభావం పడే అవకాశముంది.